టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎ.కోదండరాం
ఖైరతాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 04 : ధరణీ వల్ల రాష్ట్రంలో 50, 60 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ మేరకు శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్రంలో జరగాల్సిన భూ సంస్కరణల మీద ‘భూమి ఎజెండా-తెలంగాణ ఎన్నికలు-ప్రజల ఆకాంక్షలు’ అన్న నినాదంతో భూ చట్ట నిపుణులు భూమి సునీల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం సమావేశంలో మాజీ న్యాయ మూర్తులు, పర్యావరణ వేత్తలు, పార్టీల నాయకులు, సామాజిక వేత్తలు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా హాజరైన ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ముఖ్యమంత్రి ధరణీ పోతే రైతు బందు రాదనే విషప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. ధరణీ అనేక సమస్యలను సృష్టించిందన్నారు. కానీ ఆ సమస్యలకు పరిష్కారం లేదన్నారు. భూ రికార్డ్ తన చేతిలో పెట్టుకోవాలని అందుకే ధరణీ తీసుకొచ్చారన్నారు. ఏంఅర్‌ఓ ఏమీ చేయలేరని, సీసీఎల్‌ఏ మాత్రమే చేయాలని కీనీ కెసిఆర్ తన దగ్గర పెట్టుకున్నాడన్నారు. ధరణీలో కొత్తవి 46, పాతవి 76 సమస్యలు ఉన్నాయన్నారు. పేరు తప్పు పడితే చేంజ్ చేసే విధానం లేకపోవడం దుర్మార్గం అన్నారు. ధరనిలో పేరు ఎవరు మారుస్తారో ఎవరికి తెలియదన్నారు. ఛాలెంజ్ చేస్తున్న భూమిపై మా అజెండా ఇదీ, మీ అజెండా ఎంటి? అడ్డగోలు భూసేకరణ చెస్తున్నారని మండి పడ్డారు. దరణిని రద్దు ఉండదు, ధరణీకీ మెరుగులు దిద్దుతామన్నారు. ధరణీ స్థానంలో మెరుగైన వ్యవస్థను తీసుకొస్తామన్నారు. టైటిల్ డీడ్ గ్యారంటీ అడుగుతున్నామని అన్నారు. హక్కులకు గ్యారంటీ ఉండాలన్నారు. దరణితో సాదా బైనమా 9, ప్రోహిబిటెడ్ 15 లక్షలు సమస్యలు పెండిరగ్ లో ఉన్నాయన్నారు. వీటి పరిష్కారానికి సరైన వ్యవస్థలను తీసుకురావాలన్నారు. తాతల తండ్రుల అడ్డగోలుగా భూములు వాళ్ళ పేరు మీద ఎక్కించుకోవడానికి ధరణీ తెచ్చారన్నారు. పేద రైతులు హక్కులు ధ్యేయంగా పని చేస్తామని హామీ ఇస్తున్నాం అన్నారు. కాంగ్రెస్ పార్టీ కిసాన్ నాయకులు కోదండ రెడ్డి, భూమి సునీల్ మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నికల ఉన్న సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు భూమికి సంబంధించిన హామీలను మేనిఫెస్టోలో చేర్చాయన్నారు. కౌలు దారులను భూ యజమానులుగా చేసిన చరిత్ర తెలంగాణదన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి 56 శాతం కుటుంబాలకు భూమి లేదన్నారు. భూమి, పట్టా, రికార్డులో పేరు ఉన్న వారు ఒక్క శాతం అని, చివరగా 1930, 40 లలో తెలంగాణ భూమి సర్వే జరిగిందన్నారు. ప్రతి 30 సంవత్సరాల కొక సారి ల్యాండ్ సర్వే జరగాలన్నారు. తెలంగాణలో ప్రతి ఊరిలో 2 వందల సమస్యలున్నాయని, భూమి హద్దులకు స్పష్టత హక్కులను భద్రత లేదన్నారు. లక్షల ఎకరాలు పట్టా భూమినీ నిషేధిత భూమి జాబితాలో చేర్చారన్నారు. 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల సమస్య అని, భూముల సర్వే జరిగి 80 ఏళ్లు అయ్యిందన్నారు. 10 నుంచి 15 లక్షల కౌలుడారులు ఉన్నారన్నారు. కౌలు దారులకు గతంలో గుర్తింపు కార్డు ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించాల్సిన అవసరం లేదని చెప్పిందన్నారు. భూమి హక్కులను కాపాడాలని ఐక్య రాజ్య సమితి సూచించిందన్నారు. భూమి హక్కు రాజ్యాంగ హక్కు, భూముల రీ సర్వే, ఓకే భూమి చట్టం, ఎక్కడైతే భూ సంస్కరణల జరిగాయని, ఆ దేశాలు అభి వృద్ధి చెందాయన్నారు. భూమి సర్వే, ఒకే భూమి చట్టం, టైటిల్ గ్యారెంటీ, సాదా బైనామాల క్రమబద్దీకరణ, పేదలకు భూమి, రెవెన్యూ ట్రిబునల్లు, తెలంగాణలో లాంటి సంస్కరణలు జరగాలన్నారు. ధరణి ఒక చిన్న సమస్య మాత్రమే అన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన చేయకుండా సమాచారాన్ని దరణిలో పెట్టడం వల్ల సమస్యలు తలెత్తయన్నారు. ధరణిలో ఉన్న సమస్యలను రెవెన్యూ కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. ఆధార్ కార్డ్ లాగా భూములకు భుదార్ కార్డ్ రావాలన్నారు. భూముల సర్వే కోసం రూ.1000 కోట్ల బడ్జెట్ కేటాయించి, రూ.600 కోట్లతో సర్వే చేస్తామని సర్వే ఆఫ్ ఇండియా ముందుకు వచ్చిందన్నారు. తెలంగాణలో 124 భూ చట్టాలు ఉన్నాయన్నారు. భూ హక్కు దారులకు ప్రభుత్వమే భద్రత కల్పించాలి దీన్ని టైటిల్ గ్యారెంటీ అంటారన్నారు. సాదా బైనామాల క్రమబద్దీకరణ, అసైన్డ్ భూములకు హక్కులు కల్పించాలన్నారు. తెలంగాణలో రూ.25 లక్షల ఎకరాల భూములను అసైన్డ్ చేశారన్నారు. పేద ప్రజలు, రైతులకు కోసం ప్రభుత్వం అసైన్డ్ చేసే భూమి తెలంగాణలో 56 శాతం గ్రామీణ కుటుంబాలకు భూమి లేదన్నారు. భూ సమస్యల కోసం జిల్లా కొక భూమి ట్రిబునల్లు ఏర్పాటు చేయాలన్నారు.