నదీ ప్రవాహంలా భారత్‌ ‌జోడో యాత్ర ..!

  • రాజకీయ నాయకుడు జనం మాట వినాలి
  • తెలంగాణా గిరిజనుల భూములను తిరిగి ఇప్పిస్తాం: రాహుల్‌ ‌గాంధీ

షాద్‌ ‌నగర్‌ ,‌ప్రజాతంత్ర ,అక్టోబర్‌ 30: ‌భారత్‌ ‌జోడో యాత్రలో ఎక్కడా విద్వేషం కనిపించదు,,అన్నివర్గాలతో కలిసి నడుస్తున్న ఈ యాత్ర నదీ ప్రవాహంలా సాగుతోంది..రాజకీయ నాయకుడంటే జనం మాట వినాలి, కానీ బీజేపీ, టీఆరెస్‌ ‌ప్రజల గొంతును నొక్కేస్తున్నారు. అని రాహుల్‌ ‌గాంధీ అభిప్రాయం వ్యక్తం చేసారు .ఆదివారం 53 వ రోజు భారత్‌ ‌జోడో పాదయాత్ర సందర్బంగా సాయంకాలం షాద్‌ ‌నగర్‌ ‌సోలిపూర్‌ ‌జంక్షన్‌ ‌వద్ద కార్నర్‌ ‌మీటింగ్‌ ‌లో మాట్లాడుతూ బీజేపీ, ఆరెస్సెస్‌ ‌ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాయి..విద్వేషాలకు వ్యతిరేకంగా భారత్‌ ‌జోడో యాత్ర చేస్తున్నాం..భారత్‌ ‌జోడో యాత్రను ఏ శక్తీ ఆపలేదు..అని పేర్కొన్నారు.ఎండైనా, వానైనా ఈ యాత్ర కొనసాగుతుంది అన్నారు.’’తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్లు, కళాశాలలు, యూనివర్సిటీలు ప్రయివేటీకరిస్తున్నారు..

ఉన్నత చదువులు చదువుకున్న యువకులు కూలీలుగా పనిచేస్తున్నారు..ఫీజు రీయింబర్స్మెంట్‌ ‌ను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది..చిరు వ్యాపారులు, నేతన్నలు జీఎస్టీపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే చేనేత, చేతివృత్తులపై జీఎస్టీ భారం లేకుండా చేస్తాం..తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతుంది..కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక విద్యా సంస్థల ప్రైవేటీకరణ జరగకుండా చేస్తాం…పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో విద్యా సంస్థలు నడిచేలా చేస్తాం..తెలంగాణ సీఎం కు ధరణిలో భూములు చూసుకోవడమే సరిపోతుంది..దళిత, గిరిజనుల భూములను లాక్కుంటున్నారు…మేం అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ ‌ను మెరుగుపరుస్తాం..లాక్కున్న దళిత, గిరిజనుల భూములను తిరిగి ఇప్పిస్తాం..వారికి భూమి హక్కును కల్పిస్తాం..

బీజేపీ ఏ చట్టం తీసుకొచ్చిన టీఆరెస్‌ ‌మద్దతు ఇస్తుంది…ఎన్నికల సమయంలో మాత్రమే వారు వేరుగా ఉన్నట్లు డ్రామాలు చేస్తారు..కానీ బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌రెండూ ఒక్కటే.. ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విపరీతంగా డబ్బులు ఖర్చు చేస్తున్నాయి…ఇద్దరు ముగ్గురు మిత్రులతో మోడీ రాజకీయం చేస్తున్నారు…తన మిత్రులకే అన్ని వ్యాపారాలు కట్టబెసుతున్నాడు…సీఎం కేసీఆర్‌ ‌విద్య, వైద్యం మీద నిధులు ఖర్చు చేయడం లేదు..ఉదయం ప్రాజెక్టులతో , రాత్రి ధరణితో కమీషన్లు దండుకుంటున్నాడు..అని రాహుల్‌ ‌విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page