హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 04 : తెలుగు ప్రజలు ఐక్యంగా ఉండి తెలంగాణ ఎన్నికల్లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి ఆశీర్వదించి, పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణలో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులకు బీఫామ్ అందజేశారు. అనంతరం షేక్ జలీల్ మాట్లాడుతూ ఆ దాని అంబానీలకు ఊడిగం చేస్తున్న బిజెపిని తెలంగాణ నుండి తరిమి వేయాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ అమర వీరులు ప్రాణాల త్యాగంగా ఆవిర్భవించిన తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తామన్నారు. గత పదేళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజల మనోభావాలను గుర్తించి ప్రతి కుటుంబానికి ఉచిత విద్య, వైద్యం ఆరోగ్యశ్రీతో పాటు దేశంలో హైదరాబాద్ ని రెండో రాజధాని గా తీర్చిదిద్దుతామన్నారు. నదుల అనుసందనం పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. నదుల అనుసందనం ద్వారా రైతాంగానికి పండించే పంటకు గిట్టుబాటు ధరలు లేక ఆకలికేకలతో రైతు చనిపోతుంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సవతి తల్లి ప్రేమ వలక బోస్తుందన్నారు. బిజెపి హటావో దేశ్ కు బచావో అని పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్, మణిపూర్ రాష్ట్రములో ముస్లిం, క్రైస్తవుల ప్రాణాలు తీస్తున్న బిజెపికి ఓటు వేయకూడదు అని విజ్ఞప్తి చేసారు. తెలంగాణ ప్రజల మనోభావాలు అర్ధం చేసుకోలేని బిజెపికి ఆర్ఎస్ఎస్, బజరంగ్ దల్, విశ్వ హిందూ పరిషత్ మద్దతు ఇవ్వదన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ఇంచార్జి బాబర్ షేక్, రాష్ట్ర అధ్యక్షులు ఖలీమ్ ఉద్దీన్, సయ్యద్ సైదా, అభ్యర్థులు మల్లిక రేవతి, గంగాధర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.