ఉప్పల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) ఆద్వర్యంలో ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ కార్యక్రమం నాచారం డివిజన్ లోని అన్నపూర్ణ కాలనీ అంబేద్కర్ భవన్ లో 300 మందికి ఇన్సూరెన్స్ చేయించామని బీసీ సెల్ అధ్యక్షులు ఎర్రగొల్ల విఠల్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా విఠల్‌యాదవ్ మాట్లాడుతూ ఉచిత ఆరోగ్య శ్రీ కార్డులను బుధ వారం పంపిణీ చేశామన్నారు. పీఎంసీ ఆర్‌పై ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ కోసం అర్హులనుంచి నాచారం అన్న పూర్ణ కాలనీలో నీ అంబేద్కర్ భవన్ లోకేంద్రాన్ని ఏర్పాటు చేసి సుమారు 300 మందికి ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తులను స్వీకరించి కార్డులను అందజేసారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు..