- మతలబు ఏంటి..మల్లేశ్వరా..?
- అక్రమ నిర్మాణాలు ఇష్టానుసారమేనా..?
- కాసుల కక్కుర్తిలో అధికారులు..!
- ప్రభుత్వ ఖజానాకు గండి..
కూకట్ పల్లి ప్రజాతంత్ర మార్చి 25 : హైదరాబాద్ విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్న తరుణంలో కూకట్‌పల్లి నియోజకవర్గంలో అభివృద్ధికి కొందరు అవినీతి, అక్రమ నిర్మాణదారులు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ విఘాతం కలిగిస్తుచ న్నారనీ, అక్రమ నిర్మాణాలకు, అవినీతి పనులకు కొందరు స్థానిక నాయకులు అండగా నిలుస్తు న్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైకోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ టౌన్ ప్లానింగ్ అధి కారులు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తుంది. సర్కిల్ కార్యాలయాల పరిధిలో అక్రమ నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరి ంచాలనీ, నోటీసులతో కాలయాపన చేయకుండా నిర్మాణదారులు చేపట్టిన అక్రమాలను నిర్దాక్షిణ్య ంగా కూల్చివేయాలని హైకోర్టు ఎన్ని మార్లు హెచ్చరి ంచినా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూసాపేట్ సర్కిల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సిబ్బంది, ఇతర అధికారులు కోర్టు ఆదేశాలను ఏ మాత్రం ఖాతరు చేయకపోవడం గమనార్హం. అక్రమ నిర్మాణాలను కార్పొరేషన్ పరిధిలో ఆదిలోనే తుంచి వేసి ఉంటే ఇంత వరకు వొచ్చి ఉండేది కాదని స్థానికులు అంటున్నారు.
స్థానిక నియోజకవర్గ పరిధిలోని జీహెచ్‌ఎంసీ మూసాపేట్ సర్కిల్‌లో టౌన్ ప్లానింగ్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తుందని చెప్పవచ్చు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు బాధ్యత మరిచి ముడుపుల మాయలో ఊగుతూ ఉన్నారని చెప్పడానికి ఆయా ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను చూస్తే కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. నాడు అక్రమ నిర్మాణాల పేరుతో కూలగొట్టిన నిర్మాణాలే నేడు స్థానిక అధికారుల దృష్టిలో సక్రమాలుగా నిలుస్తు న్నాయి. ఇలా జరగడానికి మతలబేంటి అని స్థానిక ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారుల పుణ్యమా అని అక్రమాలకు నిలయంగా స్థానిక సర్కిల్ పట్టణ ప్రణాళిక విభాగం మారింది. ముడుపుల మత్తులో అక్రమాలకు జోరు పెరిగినట్లుగా చెప్పు కోవచ్చు. సంబంధిత అధికారులు అమ్యామ్యాలకు అలవాటు పడి, తాజాగా స్థానిక సర్కిల్ పరిధిలోని, బాలాజీ నగర్ డివిజన్ నందు కైతలపూర్‌లో ప్లాట్ నెంబరు, ‘‘191 ,194’’ నందు నిర్మిస్తున్న అక్రమ నిర్మాణం చూస్తే, టౌన్ ప్లానింగ్ అధికారులు పనులు గాలికి వదిలేసినట్లుగానే కనిపిస్తుంది.
ఇక్కడ జరిగే తతంగం చూస్తుంటే స్థానిక మున్సిపల్ సర్కిల్ పరిధిలో అక్రమంగా, లేదా సక్రమంగా ఏది చేసినా అడిగే దిక్కు లేకుండా పోయిందని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. ఇక్కడ జిహెచ్‌ఎంసీ కార్యాలయంలో పేరుకు మాత్రం టౌన్ ప్లానింగ్ అధికారులు ఉంటారు. కానీ అక్రమ రాబడికి అలవాటు పడిన వారు కుర్చికే పరిమితం కావడం పలువురుని విస్మసనీయనికి గురిచేస్తుంది. స్థానిక సర్కిల్ పరిధిలోని జరుగుతున్న అక్రమాలను వారే దగ్గరుండి నడిపిస్తున్నారనే వినికిడి గట్టిగానే వినిపిస్తుంది.
సర్కిల్ పరిధిలో జరుగుతున్న అక్రమాల విషయమై పలుసార్లు పిర్యాదు చేసినప్పటికీ ఇక్కడి ఉన్నత అధికారి స్థానంలో ఉన్న టౌన్ ప్లానర్ స్పందించకపోవడం ఏంటని ఫిర్యాదు దారులు వాపోతున్నారు. ఇక్కడ ప్రయివేటు వ్యక్తులు అక్రమ నిర్మాణాల పేరుతో కోట్లాది రూపాయలు దండుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నా.. తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనితో స్థానిక జీహెచ్‌ఎంసీ పరిధిలోని పాలన పక్కదారి పడుతుంది. పలు సమస్యలపై కార్యాలయానికి వొచ్చిన పలువురు సమస్యలు పరిష్కారం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే వినికిడి ఆయా ప్రాంత వాసుల్లో చర్చనీయాంశంగా మారింది. దీనితో ప్రజలు కార్యాలయం నుండి వెనుదిరుగుతున్నారు. ఇప్పటికైనా, సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి స్థానిక జీహెచ్‌ఎంసీ సర్కిల్ పరిధిలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.