నాలుగో రోజు కొనసాగిన రాహుల్‌ ‌యాత్ర

తిరువనంతపురంలో స్వాగతిస్తూ భారీ ఏర్పాట్లు

‌రాహుల్‌గాంధీ పాదయాత్ర 4వ రోజు ఉత్సాహంగా కొనసాగింది. శనివారం మాలగం నుంచి మొదలైన భారత్‌ ‌జోడో యాత్ర..సాయంత్రానికి కేరళలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా త్రివేండ్రం దగ్గర్లోని చేరువరకోణం వద్ద ఆయనకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్‌ ‌శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. కేరళ పిసిసి ప్రెసిడెంట్‌ ‌సుధాకరన్‌ ‌సహా ముఖ్యనేతలంతా రాహుల్‌తో కలిసి యాత్ర చేయనున్నారు. తిరువనంతపురం నుంచి త్రిసూర్‌ ‌వరకూ 7 జిల్లాల వి•దుగా ఈ పాదయాత్ర ఉంటుంది. ఈ యాత్ర సందర్భంగా పోలీసు బందోబస్తు భారీగా పెంచారు. రాహుల్‌ ‌పాదయాత్రలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. కర్రసాము చేసే ఓ వ్యక్తి రాహుల్‌ని కలవడానికి ప్రయత్నించాడు. ఐతే.. సెక్యూరిటీ వాళ్లు అడ్డుకున్నారు. ఇది గమనించిన రాహుల్‌ అతన్ని దగ్గరకు పిలిచారు. దీంతో..అతను తన కళను ప్రదర్శించారు. అద్భుతమని మెచ్చుకుంటూ రాహుల్‌ ఆయనకు వందనం చేశారు. రాహుల్‌గాంధీ యాత్రకు దారిపొడవునా మంచి స్పందన వొస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page