నిమజ్జనంపై ప్రభుత్వ తీరుకు హిందూసంస్థల ఆగ్రహం

  • నగరంలో పలుచోట్ల దీక్షలకు దిగిన నేతలు..అరెస్ట్
  • ‌సీతాఫల్‌మండిలో దీక్షకు దిగిన భగవతంతరావు
  • ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బిజెపి నేత మురళీధర్‌ ‌రావు
  • ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనాలకు క్రేన్లను ఏర్పాటు చేస్తున్న జిహెచ్‌ఎం‌సి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7 : ‌ట్యాంక్‌ ‌బండ్‌పై గణేష్‌ ‌నిమజ్జనాల వివాదానికి తెరపడింది. ఎట్టకేలకు నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌పై జీహెచ్‌ఎం‌సీ క్రేన్లను ఏర్పాటు చేస్తుంది. మొత్తం 10 క్రేన్లను జీహెచ్‌ఎం‌సీ ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్‌ ‌మార్గ్‌తో పాటు ట్యాంక్‌బండ్‌ ‌వైపు కూడా గణెళిష్‌ ‌నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. కాగా… ట్యాంక్‌బండ్‌పై నిమజ్జన ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ కొద్ది రోజులుగా బీజేపీ, భాగ్యనగర్‌ ‌గణేష్‌ ఉత్సవ సమితి నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే హైదరాబాద్‌లో గణేశ్‌ ‌నిమజ్జనంపై ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంపై నగరంలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పిలుపు మేరకు పలుచోట్ల పార్టీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో భాగ్యనగర్‌ ‌గణేష్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత రావు ఆమరణ నిరాహార దీక్షకు బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌ ‌రావు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్‌ ‌నిమజ్జనానికి వినాయక సాగర్‌ ‌దగ్గర ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం హిందూ పండగలపై నిర్లక్ష్యం వహిస్తుందని…ఎల్లుండే నిమజ్జనం అయినా…ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన వైఖరి లేదని ఆరోపించారు. మండపాల నిర్వాహకులు అయోమయంలో ఉన్నారని మురళీధర్‌ ‌రావు అన్నారు. సికింద్రాబాద్‌ ‌సీతాఫల్‌ ‌మండిలో నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నేతలను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. వినాయక విగ్రహాల నిమజ్జనం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని బీజేపీ స్టేట్‌ ‌చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌పిలుపునిచ్చారు. దీంతో మాజీ మేయర్‌ ‌బండ కార్తీకరెడ్డి, ఇతర నేతలు సీతాఫల్‌ ‌మండిలో ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళన కారులను అరెస్టు చేసి పోలీసులు పీఎస్‌కు తరలించారు.

వినాయక నిమజ్జనంపై ప్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా ఉప్పల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు దగ్గర భాగ్యనగర్‌ ఉత్సవ కమిటీ నేతలు నల్ల జెండాలతో నిరసన చేపట్టారు. హుస్సేన్‌ ‌సాగర్‌ ‌లో పీఓపీ విగ్రహాల నిమజ్జనం చేయాలంటూ రోడ్‌పై బైటాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఉప్పల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు దగ్గర భారీగా ట్రాఫిక్‌ ‌జామ్‌ అయింది. ఈ సందర్భంగా గణేష్‌ ‌నిమర్జనంపై ఆంక్షలు ఎత్తి వేయాలని నిరసన నేతలు డిమాండ్‌ ‌చేశారు. హిందువుల హక్కులను గౌరవించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ హుస్సేన్‌ ‌సాగర్‌లో నిమజ్జనం చేస్తామన్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌ ‌డౌన్‌ ‌డౌన్‌ అం‌టూ నినాదాలు చేయగా…భాగ్యనగర్‌ ఉత్సవ కమిటీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ చిన్నపాటి ఘర్షణలో పోలీసులు, కార్యకర్తలను నెట్టివేశారు.

గణేష్‌ ‌నిమజ్జనం కోసం హుస్సేన్‌ ‌సాగర్‌ ‌పై కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం హిందువుల పై కక్ష సాధింపు చర్యలే అని భాగ్యనగర్‌ ‌జిల్లా బీజేపీ అధ్యక్షులు సంరెడ్డి సురేందర్‌ ‌రెడ్డి అన్నారు. గణేష్‌ ‌నిమజ్జనంకు హుస్సేన్‌ ‌సాగర్‌పై కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు చేయకపోవడంతో ఐఎస్‌ ‌సదన్‌  ‌చౌరస్తాలో హిందూ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. భారీ ఎత్తున హిందూ భక్తులు హాజరై కేసీఆర్‌ ‌ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో భారీ బలగాలతో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అరెస్ట్ ‌చేసి సైదాబాద్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌కి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page