సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: జగ్గారెడ్డి ఆదేశాలతో నియోజకవర్గ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు ఎన్నికయ్యారు.నియోజకవర్గం లోని ఇద్దరు బ్లాక్ ప్రెసిడెంట్ లు, 6 గురు ప్రెసిడెంట్ లు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ,మహిళా కాంగ్రెస్, ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ అలాగే పార్టీ కి సంబందించిన అన్ని విభాగల నాయకులు, ప్రజాప్రతినిధులు,జెట్పీటీసి, ఎంపీటీసి, ఎంపీపీ, సర్పంచ్, కౌన్సిలర్, వార్డ్ మెంబెర్ లు గెలిచినా ఓడినా నాయకులు భవిష్యత్తులో జెట్పీటీసి, ఎంపీటీసి,సర్పంచ్, కౌన్సిలర్, వార్డ్ మెంబెర్స్ కావాలి అనుకున్న నాయకులు, మండల ప్రెసిడెంట్, మున్సిపల్ చైర్మన్, ఆయకట్టు చైర్మన్, స్కూల్స్ చైర్మన్ కావాలి అనుకున్న నాయకులు నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఉన్న అన్ని గ్రామాల్లో, రెండు మున్సిపాలిటీ లో ఉన్న అన్ని వార్డులో తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ, రాహులో గాంధీ,మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ నాయకత్వం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారెంటీ స్కీమ్ లు టీపీసీసీ అధ్యక్షుడు, సిఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, సంగారెడ్డి జిల్లా మంత్రి దామోదర్ రాజానర్సింహా, జిల్లా ఇన్ ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ, కాబినెట్ మీసిస్టర్స్ ఆధ్వర్యంలో వారి డైరెక్షన్స్ లో అధికారికంగా ఈ నెల 28 నుండి జనవరి 6 వ తేదీ అంటే 10 రోజులు దరఖాస్తులు తీసుకోనున్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి ఇందువల్ల నియోజకవర్గం లోని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరు మీ గ్రామంలో, వార్డు లో ప్రజల దగ్గరికి వెళ్ళి అన్ని కులాల, మతాల వారు కాంగ్రెస్ పార్టీ హామీలు లబ్ది చేరే విధంగా 6 స్కీమ్ లు దరఖాస్తులు చేసుకునే విధంగా చూసుకోవాలి.1) మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ప్రతి నెలా 2500 రూపాయలు ఆర్ధిక సహాయం.ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఉచితం కానుంది.గ్యాస్ సిలెండర్ ధర 500 రూపాయలకే.2) చేయూత పథకంలో భాగంగా నెలకు 4000 రూపాయల పెన్షన్,10 లక్షల వరకూ రాజీవ్ ఆరోగ్య శ్రీ భీమా.3)గృహలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకూ విద్యుత్ ఉచితంగా అందించనుంది ప్రభుత్వం.
4) యువ వికాసంలో భాగంగా విద్యార్ధులకు 5 లక్షల రూపాయలు విద్యా భరోసా కార్డు.ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మాణముంటుంది.
5)ఇందిరమ్మ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్లు లేనివారికి ఇంటి స్థలంలో నిర్మాణానికి 5 లక్షల రూపాయలు సహాయం.ఉద్యమకారుల కుటుంబాలకు 250 చదరపు గజాల స్థలం.6)రైతు భరోసాలో భాగంగా రైతులు, కౌలు రైతులకు ఏటా 15000 రూపాయలు ఆర్ధిక సహాయం.
వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12000 ఆర్ధిక సహాయం.వరి పంటకు క్వింటాల్‌కు 500 రూపాయలు బోనస్ దరఖాస్తులు చేయించి సంబంధిత అధికారులకు దరఖాస్తులు చేరే విధంగా చేయడమే కాకుండా మళ్ళీ అధికారుల ద్వారా ఇవ్వని మీ చేతుల మీదుగా ప్రజలకు పధకాలు అందేవిధంగా చూడాలి.ఈ పధకాలని ప్రజలకు అందేవిధంగా చూసి మంచి పేరు తెచ్చుకోవాలని ఈ పధకాల అమలు కార్యక్రమాన్ని నియోజకవర్గ కన్వీనర్ గా మాజీ ఎంపీపీ చేర్యాల ఆంజనేయులు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి నియోజకవర్గ నాయకులతో కోర్డినేట్ చేస్తారని ఎలాంటి సందేహాలు ఉన్న సమస్యలు ఉన్న వీరి దృష్టికి తీసుకొని రావాలని జగ్గారెడ్డి యొక్క ఆదేశాలను ఈ మెసేజ్ ద్వారా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను.