* కాంగ్రెస్ నాయకులు ప్రజల మనోభావాలను కించపరిచే ధోరణిలో మాట్లాడుతున్నారు
* కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలు నమ్మొద్దు
* ఉప్పల్ బీఆర్‌ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి
* బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు బొట్ల పరమేశ్వర్
ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 26 : తెలంగాణ ఏర్పడ్డ తరవాత కెసిఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని వినియోగదారు లందరికీ నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నదని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు బొట్ల పరమేశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఉప్పల్ క్రాస్ రోడ్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…ఉప్పల్ బీఆర్‌ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. తెలంగాణ ఏర్పడే నాటికి స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, ప్రస్తుతం 18,453 మెగావాట్లుగా ఉంది. రాష్ట్రంలో ఇంధన రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రూ.12,727 కోట్లు కేటాయించి, 2022 ఆర్థిక సంవత్సరం నుంచి రూ.1,500 కోట్లకు పెంచింది. విద్యుత్ తలసరి వినియోగం 2014-15లో 1,356 యూనిట్లుగా ఉంది. 2021-22 నాటికి ఇది 2,126 యూనిట్లకు పెరిగింది. దేశంలో తలసరి విద్యుత్ వినియోగం 1,255 యూనిట్లుగా ఉంది. గత 9 సంవత్సరాలలో అన్ని వర్గాలకు రూ. 39,321 కోట్లతో సరఫరా పంపిణీ వ్యవస్థలకు బలోపేతం చేయడంతో 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1110 యూనిట్లు ఉంటే 2023 మార్చి 31 నాటికి 2126 యూనిట్లుకు చేరింది. దీనిని ఎవరూ కాదనలేని నిజం. దీనిని గుర్తించని కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారని బొట్ల పరమేశ్వర్ మండిపడ్డారు. ఉచిత విద్యుత్‌ను కర్నాటకలో అమలు చేసి చూపాలని సవాల్ చేశారు. జాతీయ తలసరి విద్యుత్ వినియోగం 73శాతం అధికంగా ఉంది. ఇది రాష్ట్ర ప్రగతికి నిదర్శనం. రాష్ట్రంలో 2.47శాతం అతి తక్కువ సరఫరా నష్టాలతో తర్వాత 99.98శాతం ట్రాన్స్‌మిషన్ అవైలబిలిటీతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఘనత సాధించింది. రైతులకు ఉచిత విద్యుత్ తో పాటు 101 యూనిట్ల వరకు ప్రతి నెలా 5,96,6 42 మంది ఎస్‌సి వినియోగదారులకు, 3,21,736 మంది ఎస్‌టి వినియోగదారులకు 2017 నుండి ఇప్పటి వరకు రూ. 656 కోట్ల విలువగల విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వడం జరిగింది. 29,365 నాయీ బ్రాహ్మణులకు సెలూన్‌లకు, 56,616 లాండ్రీ షాపులకు ప్రతి నెలా 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నది. 6667 పౌల్టీ యూనిట్స్, 491 పవర్ లోమ్స్‌కు యూనిట్‌కి రెండు రూపాయల సబ్సిడీ ఇస్తుంది. 24 గంటల విద్యుత్తుపై తెలంగాణ ప్రభుత్వానికి వున్న చిత్తశుద్ధి, నిబద్ధతకు ఇదే నిదర్శనం. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కరెంటు ఎప్పుడు వస్తదో పోతదో భగవంతుడికే ఎరుక. ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు, స్టెబిలైజర్లు ఉండేవి. ఇప్పడు ఆ పరిస్థితి లేదు. ఐదారేండ్ల నుంచి 24 గంటల విద్యుత్తు అందుతున్న ఒకే ఒక్క రాష్ట తెలంగాణ. ఎన్నికల కోసం కాంగ్రెస్ నాయకులు 24 గంటల కరెంటు ఎందుకు రైతులకు 3 గంటలు సరిపోతుంది అన్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లడుతూ తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచే ధోరణిలో మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ చెప్పే మాటలు నమ్మొద్దని, కర్ణాటక రాష్ట్రంలో 5 గంటల కరెంట్ ఇవ్వడానికే దిక్కులేదని ఆయన అన్నారు. రైతు సంక్షేమం ధ్యేయంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు. ప్రతిపక్షాలు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కర్ణాటక రాష్ట్రంలో 5 గంటల కరెంట్ ఇవ్వడానికే దిక్కులేదని, ఆ నాయకులు రాష్టాన్రికి వచ్చి ప్రగల్బాలు పలుకుతున్నారని, గంటలు కరెంట్ ఇస్తున్న బీఆర్‌ఎస్ పార్టీకే ఓటు వేయాలని కోరారు. కర్ణాటక మోడల్‌ను నమ్ముకుంటే కటిక చీకట్లోకి బతకాల్సివస్తుందన్నారు ప్రజలు ప్రతిపక్షాలకు తగిన బుద్ది చెప్పాలని బొట్ల పరమేశ్వర్ అన్నారు.