నిరుద్యోగంపై పార్లమెంట్‌లో చర్చకు టిఆర్‌ఎస్‌ ‌పట్టు

  • లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన నామా
  • చర్చకు తిరస్కరించిన స్పీకర్‌ ఓమ్‌ ‌బిర్లా
  • నిరసనగా సభ నుంచి వాకౌట్‌ ‌చేసిన ఎంపిలు
  • ఉపాధికి బడ్జెట్‌లో నిధుల కోత వేశారని కేంద్రంపై ఎంపిల మండిపాటు

న్యూ దిల్లీ, మార్చి 24 : దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని టిఆర్‌ఎస్‌ ఎం‌పీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. లోక్‌సభలో నిరుద్యోగంపై చర్చకు టిఆర్‌ఎస్‌ ‌పటుపట్టింది. ఈ మేరకు ఎంపి నామా నాగేశ్వర్‌ ‌రావు స్పీకర్‌కు వాయిదా తీర్మానం ఇచారు. స్పీకర్‌ అం‌దుకు తిరస్కరించడంతో లోక్‌సభ నుంచి టిఆర్‌ఎస్‌ ‌వాకౌట్‌ ‌చేసింది. అనంతరం టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు వి•డియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ సర్కార్‌ ‌ప్రకటించిందని, ఎనిమిదేండ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో వెల్లడించాలని ఎంపీ నామా నాగేశ్వర రావు డిమాండ్‌ ‌చేశారు. యువతను మోసంచేసేందుకే రెండు కోట్ల ఉద్యోగాలంటూ ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రలో ప్రస్తుతం 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. విపరీతమైన నిరుద్యోగంతో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కల్పనపై కేంద్ర ప్రభుత్వం మాట్లాడటం లేదని ఎంపీ కే కేశవరావు అన్నారు. నిరుద్యోగంపై వాయిదా తీర్మానం ఇస్తే తిరస్కరించారని చెప్పారు. దేశంలో నిరుద్యోగ యువతకి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని మోదీ గతంలో ఇచ్చిన హావి•ని అమలు పరచాలని డిమాండ్‌ ‌చేశారు. దేశ యువతను ఇబ్బందులకి గురిచేసే కీలక అంశాలపై చర్చ జరపాలని నామ కోరారు. దేశంలో ప్రబలిపోతున్న నిరుద్యోగం, నిరుద్యోగ యువత చేసుకుంటున్న ఆత్మహత్యలపై చర్చను కోరుతూ ఆయన వాయిదా తీర్మాన నోటీసులిచ్చారు. వి•డియా సమావేశంలో ఎంపిలు కేశవరావు, కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి తదిరతులు పాల్గొన్నారు.

ఉపాధికి బడ్జెట్‌లో నిధుల కోత వేశారు: కేంద్రంపై ఎంపిల మండిపాటు
నిరుద్యోగం చాలా సీరియస్‌ అం‌శమని టిఆర్‌ఎస్‌ ‌రాజ్యసభ ఎంపీ కే.కేశవరావు అన్నారు. గ్రావి•ణ స్థాయిలోను నిరుద్యోగం పెరిగిందని.. ఉపాధి హావి• పథకం కింద ఎన్‌రోల్‌ అవుతున్న వారి సంఖ్య పెరుగుతుందని తెలిపారు. ఉపాధి హావి• పథకానికి బడ్జెట్‌లో నిధులు తగ్గిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగ కల్పన కోసం నిధులు పెంచాల్సింది పోయి.. తగ్గించడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్‌ ‌పరం చేయాలని కేంద్రం తన విధానంగా పెట్టుకుందని విమర్శించారు. అందుకే విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌ప్రైవేట్‌ ‌పరం చేస్తున్నారని అన్నారు. కేంద్రం వద్ద 16 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలి. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు రూ.295 కోట్లు గత బడ్జెట్‌లో కేటాయిస్తే.. అవి ఇప్పుడు రూ.70 కోట్లకు చేరాయి. కేంద్ర బ్జడెట్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు నిధులు తగ్గించడంతో భవిష్యత్‌ ఉపాధి అవకాశాలపై ప్రభావం పడుతుంది. ప్రజా సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలని తెరాస నిరసన మార్గాన్ని ఎంచుకుందని కేశవరావు అన్నారు.

తెలంగాణలో కేసీఆర్‌ ఉద్యోగాలు ఇవ్వడం లేదన్న భాజపా అవాస్తవాలు చెబుతూ కాలం వెల్లదీస్తుందని మెదక్‌ ఎం‌పీ కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి అన్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ఇప్పటికి ఒక్క ఉద్యోగం కల్పించలేక పోయారని మండిపడ్డారు. భాజపా అబద్ధపు పార్టీ అని ప్రజలు గుర్తించారని తెలిపారు. నిరుద్యోగం.. ఉద్యోగ ఖాలీలపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలని ఎంపీ రాములు డిమాండ్‌ ‌చేశారు.. దాని ద్వారా ఎన్ని ఉద్యోగాలు కల్పించారో తెలుస్తుందని వివరించారు. తెరాస సర్కార్‌ ‌విధానాలు తెరిచిన పుస్తకాలని.. తమ ప్రభుత్వం ఏం చేసిందో అది కళ్లముందే స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని ఎంపీలు అన్నారు. ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page