శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: నిరుపేదల ఆత్మగౌరానికి ప్రతీక డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అని సికింద్రాబాద్ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్మోహర్ పార్క్ కాలనీ లో రూ 18.68 కోట్లతో నిర్మించిన 216 డబుల్ బెడ్ రూమ ఇళ్ల పంపిణి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రభుత్వ విప్,శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ , కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి ,మంజుల రఘునాథ్ రెడ్డి ,జగదీశ్వర్ గౌడ్ , పూజిత జగదీశ్వర్ గౌడ్ ,శ్రీమతి మాధవరం రోజారంగారావు , నార్నె శ్రీనివాసరావు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ సాయి బాబా ల తో కలిసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పద్మారావు మాట్లాడుతూ పేదల పక్షపాతి సీఎం కేసీఆర్ అని 9 ఏళ్ల బి ఆర్ఎస్ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలపరుస్తున్న రాష్ట్రం తెలంగాణ అని పథకాల అమలులో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామని తెలిపారు. కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా రాజకీయాలకు అతీతంగా పూర్తి పారదర్శకతతో అత్యంత ఆధునిక సాఫ్ట్వేర్ సహాయంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లను కేటాయించడం జరుగుతుందని తెలిపారు.అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని లక్కీ డ్రాలో పేరు రాని వారు నిరుత్సానికి గురికావద్దని అర్హులైన నిరుపేదలకు పారదర్శకంగా డబల్ బెడ్ రూమ్ ఇండ్లను అందిస్తామని అని తెలిపారు. ఇళ్ల స్థలం ఉన్నవాళ్లు గృహలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం అందించే మూడు లక్షల రూపాయల సహాయానికి దరఖాస్తులు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రంగ రెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ హరీష్, శేరిలింగంపల్లి మండల్ తహశీల్దార్ శ్రీనివాస్,వివిధ విభాగాల అధికారులు,కార్పొరేటర్ లు, గచ్చిబౌలి డివిజన్ పరిధి లోనీ రాష్ట్ర, జిల్లా, సీనియర్ నాయకులు,డివిజన్ నాయకులు,మహిళ నాయకులు,మహిళ కార్యకర్తలు,అనుబంధ సంఘాల ప్రతినిధులు,కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు,జిహెచ్ఎంసి అధికారులు,అభిమానిలు,అనుబంధ సంఘాల నాయకులు,స్థానిక నేతలు మహిళా నాయకులు, లబ్ది దారులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.