నిష్పక్షపాతంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయింపు 

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,అక్టోబర్ 02 : డబుల్ బెడ్ రూం ఇండ్లు లబ్ధిదారులకు పట్టాలు పంపిణి చేసిన భూగర్భగనుల సమాచారశాఖ మంత్రి వర్యులు పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే కాలే యాదయ్య అర్హులైనటువంటి సామాన్య ప్రజలకు చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి మున్సిపాలిటీలో  130 కోట్లా 79 లక్షలతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను  మంత్రి పట్నం మహేందర్ రెడ్డి  స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య  ప్రారంభించారు.50 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేసి సంబంధించిన పట్టాలు అందించారు.ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇళ్లు లేని పేదలకు ఆశ్రయం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ఉచిత డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కార్యక్రమం అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పలు  అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అందుకె భారీ వ్యయంతో కూడుకున్నప్పటికి డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల ప‌థ‌కానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.పేద ప్రజలు ఆత్మ గౌరవంతో బ్రతకాలన్న ఉద్దేశ్యంతోనే ఆర్థికంగా భారమైనప్పటికి సిటి కాలనిలోని సంపన్నుల గెటెడ్ కమ్యూనిటి మాదిరి ఇండ్ల నిర్మాణం చేపట్టామన్నారు.డబుల్ బెడ్ రూం ఇండ్ల గృహ సముదాయంలో సకల సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు.పార్టీలకతీతంగా నిష్పక్షపాతంగా ఇండ్ల కేటాయింపు జరిపామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page