విద్యార్థుల్లో విశ్వాసం కలిగించాలి
ప్రధాని మోదీకి కాంగ్రెస్ లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ
మోదీ ప్రపంచంలో అవన్నీ సాధ్యమే : లోక్‌సభలో తన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను తొలగించడంపై రాహుల్
న్యూ దిల్లీ, జూలై 2 : నీట్ వ్యవహారంపై లోక్‌సభలో బుధవారం చర్చ జరిగేలా చూడాలని, విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా నీట్ అంశంపై చర్చకు ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తే సముచితంగా ఉంటుందని తాను విశ్వసిస్తున్నట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం రాహుల్ గాంధీ లేఖ రాశారు. జూన్ 28న నీట్ వ్యవహారంపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చించాలని విపక్షాలు కోరగా.. అందుకు నిరాకరించారన్నారు. సోమవారం కూడా ఇదే అంశంపై మళ్లీ చర్చకు అడిగిన విషయాన్ని ఈ సందర్భంగా రాహుల్ గుర్తు చేశారు. దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తామని స్పీకర్ విపక్షాలకు హావి• ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. నీట్ ఆశావహుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన రాహుల్.. ఈ వ్యవహారంపై నిర్మాణాత్మకంగా అడుగులు వేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.
నీట్ పరీక్షపై తక్షణమే దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే ఇది మన ఉన్నత విద్యా వ్యవస్థలో కుళ్లును బహిర్గతం చేసిందన్నారు. గత ఏడేళ్లలో 70కి పైగా పేపర్ లీకేజీలు జరిగాయని, వీటితో 2 కోట్ల మంది విద్యార్థులపై ప్రభావం పడిందని పేర్కొన్నారు. లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలు ఈ అంశాన్ని పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు ధైర్యంగా, నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకుంటారని మనవైపే చూస్తున్నారని తెలిపారు. అందువల్ల పార్లమెంట్‌లో జరిగే చర్చ విద్యార్థుల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు తొలి అడుగుగా ఉండాలన్నారు.
నీట్ అంశం తీవ్రత దృష్ట్యా బుధవారం లోక్‌సభలో చర్చకు సులభతరం చేసేలా చూడాలని అభ్యర్థిస్తున్నట్లు లేఖలో తెలిపారు. మోదీ ప్రపంచంలో అవన్నీ సాధ్యమే : లోక్‌సభలో తన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను తొలగించడంపై రాహుల్
లోక్‌సభలో తాను చేసిన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. మోదీ ప్రపంచంలో నిజాలను చెరిపేస్తారని, కానీ వాస్తవ ప్రపంచంలో అది సాధ్యం కాదని, తాను చెప్పాలనుకున్న నిజం చెప్పానని, వారు కావాలంటే అంతా తొలగించుకోనీయమని, నిజం ఎప్పటికీ నిజమే అని రాహుల్ స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ముందు ఆయనను వి•డియా ప్రతినిధులు ప్రశ్నించగా ఈ విధంగా సామాధానం ఇచ్చారు.