- తెలంగాణ కోసం మరో పోరాటం అవసరం
- టిజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్
మెదక్, ప్రజాతంత్ర, మే 31 : నీళ్లు, నిధులు, నియామకాల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీజేఎస్ పార్టీ అధ్యక్షులు కోదందరామ్ విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ…ఆంధ్ర కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కేవలం ఆంధ్ర కాంట్రాక్టర్లకే ప్రయోజనం చేకూరిందన్నారు. ప్రగతి భవన్‌లో ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఎర్ర తివాచీ పరుస్తున్నారని మండిపడ్డారు.
మిగతా వారు ప్రగతి భవన్‌కు వెళితే 144 సెక్షన్ ద్వారా కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు. ధర్నా చౌక్‌లు ప్రభుత్వం మూయిస్తే కోర్టు ద్వారా తెరిపించామని తెలిపారు. కాళేశ్వరం ఖర్చు ఎక్కువ…నీళ్లు తక్కువని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నియంత, నిరంకుశ పాలనకు ప్రజలు త్వరలోనే స్వస్తి పలుకుతారని హెచ్చరించారు. జూన్ 6న ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో తెలంగాణ ఆత్మగౌరవ దీక్షకు ఉద్యమకారులు రాజకీయ పార్టీలకతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారులు మరో పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోదండరామ్ పేర్కొన్నారు.