నువ్వు నాలో ఎంతో
నాకు నేను వేసుకునే ఓ ప్రశ్న…???
నువ్వు నాకొక అద్దం…
అందానికి కాదు, నాతో బంధానికి.
నువ్వు నాకొక సురుచి…
ఈ తనువుకి కాదు, నా మనసుకు
నువ్వు నాకొక సుగంధం
పూసే పుష్పం కాదు..
మనసులో కలిగే ఆ సుగంధం ఎప్పటికి పరిమళాలు వెదజల్లుతూనే ఉంటుంది
నా హృదికి..
నువ్వు నాక ఓ తీయని ఊహ…
నా భావాలకు నువ్వొక పెట్టుబడి కాబట్టి
నువ్వు నాకు స్వప్నం లాంటివాడివి..
పగటిని ఒడిసే వలని విసురుతావ్‌ ‌కాబట్టి..
నువ్వు నాకొక కవిత…
నా మనసులోంచి వచ్చే ఆలోచనలకి
ఎప్పటికి ఓ కొమ్మకి చిగురు లాంటి సరికొత్త రూపం నీది..
నువ్వు నాకు మధురం, అతి మధురం..
పెదవి కొమ్మకు మిఠాయి లాంటిది..
ఆ తియ్యదనాన్ని అందుకోవడం అంత మధురం
నీ.. నా… మనసు…
నాకు నేనుగా వ్రాసుకుంటున్నా
ప్రేమలేఖవి నువ్వు..
– ప్రియగోలి, గుంటూరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page