నెలాఖరు వరకు 1442 అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌ ‌పోస్టుల భర్తీ

  • పక్రియ వేగంగా పూర్తి చేయాలి
  • ఆర్థిక వైద్యారోగ్య మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశాలు
  • ఏడాది కాలంలో గణనీయంగా పెరిగిన ఆరోగ్య శ్రీ కేసులు
  • డీఎంఈ, టీవీవీపీ పరిధి హాస్పిటల్స్‌లో 50 శాతం పెరిగిన కేసులు
  • తొలిసారి డీపీహెచ్‌ ‌పరిధి హాస్పిటల్స్‌లో 14,965 కేసులు
  • మంత్రి అభినందన, సేవలు మరింత పెరగాలని పిలుపు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 21 : టీచింగ్‌ ‌హాస్పిటళ్ల పరిధిలో భర్తీ చేస్తున్న 1442 అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌ ‌పోస్టుల నియామక పక్రియను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశించారు. వెరిఫికేషన్‌ ‌సహా, ఇతర పక్రియలు పూర్తి అయిన నేపథ్యంలో తుది ఫలితాలు విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు సత్వరం చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు ఆలోచన మేరకు పేదలకు వైద్య ఖర్చుల భారం లేకుండా చేసి, నాణ్యమైన వైద్యం అందేలా చూడాలన్నారు. మంగళవారం ఆరోగ్యశ్రీ పథకం అమలు, పురోగతిపై ఆర్థిక వైద్యారోగ్య మంత్రి హరీష్‌ ‌రావు నెలవారీ సమీక్ష నిర్వహించారు. డీఎంఇ, డీపీహెచ్‌, ‌టీవీవీపీ పరిధిలోని హాస్పిటల్స్‌లో ఆరోగ్య శ్రీ కేసులు పెరగటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

2021-22తో పోల్చితే, 2022-23 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నెల చివరి వరకు ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఆరోగ్య శ్రీ కేసులు గణనీయంగా పెరిగాయి. డీఎంఈ పరిధిలో 72,225 నుంచి 1,08,223కు పెరగగా, టీవీవీపీలో 66,153 నుంచి 99,744కు పెరిగాయి. డీపీహెచ్‌ ‌పరిధిలో కొత్తగా ఆరోగ్య శ్రీ సేవలు ప్రారంభం కావడం వల్ల 14,965 కేసులు నమోదు అయ్యాయి. ఈ పెరుగుదలకు కృషి చేసిన వైద్యారోగ్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. కొత్త మెడికల్‌ ‌కాలేజీల ద్వారా మరిన్ని పీజీ సీట్లు అందుబాటులోకి రావడం, హాస్పిటల్స్‌లో సౌకర్యాలు పెరగటం,  ప్రభుత్వ దవాఖానా ల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరగటం, డైరెక్టర్‌ ఆఫ్‌ ‌పబ్లిక్‌ ‌హెల్త్ ‌పరిధిలోని దవాఖానాల్లోనూ ఆరోగ్య శ్రీ సేవలు మొదలు పెట్టడం వల్ల ఈ గణనీయమైన మార్పు సాధ్యమైందన్నారు.

ఆరోగ్య శ్రీ బృందంతో పాటు, ఆరోగ్య మిత్రలు చేస్తున్న కృషి కూడా ఇందులో ఉందన్నారు. ఇహెచ్‌ఎస్‌, ‌జేహెచ్‌ఎస్‌ ‌పథకాలు మరింత ప్రభావవంతంగా అమలయ్యేలా చూడాలన్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వెల్నెస్‌ ‌సెంటర్ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. జూమ్‌ ‌ద్వారా నిర్వహించిన సమీక్షలో హెల్త్ ‌సెక్రెటరీ రిజ్వి, ఆరోగ్య శ్రీ సీఈవో విశాలాచ్ఛి, డిఎంఇ రమేష్‌ ‌రెడ్డి, నిమ్స్, ఎంఎన్జే డైరెక్టర్లు, ఆరోగ్య శ్రీ అధికారులు, జిల్లా కోఆర్డినేటర్లు, టీం లీడర్లు, అన్ని టీచింగ్‌, ‌టీవీవీపీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page