- నాలుగు రోజుల క్రితం గవర్నర్ వద్దకు చేరింది
- టీఎస్‌ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వథ్థామ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : సుమారు నెల రోజుల నుంచి ఆర్టీసి విలీన బిల్లు పెండింగ్‌లో ఉందని.. ప్రభుత్వం నుంచి నాలుగు రోజుల క్రితం వొచ్చిన బిల్లును గవర్నర్ న్యాయ నిపుణుల సలహా కోసం పంపించారని టీఎస్‌ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వద్ధామ రెడ్డి అన్నారు. తమ వద్దకు వచ్చిన బిల్లుపై పది సూచనలు చేసినట్లు గవర్నర్ తెలిపారన్నారు.
ఆర్టీసీ బిల్లును ఆమోదించాలని గవర్నర్‌ను కోరామని.. అందుకు గవర్నర్ సానుకూలంగా ఉన్నారని చెప్పారు. రెండు రోజుల్లో సరైన సూచనలు చేసి నిర్ణయం తీసుకుంటాను అని గవర్నర్ తెలిపారన్నారు. పదవీ విరమణ పొందిన వారికి సంస్థ తరపున రావాల్సినవి అందించాలని కోరామన్నారు. వేతన సవరణ అంశాలు, సీసీఎస్ డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకుందని.. ఆసుపత్రి సేవలు, ఆర్టీసి ఆస్తులు, అప్పులు తదితర అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని అశ్వద్ధామ వెల్లడించారు.