నేటి నుంచి దిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సు

  • సదస్సుకు ముస్తాబైన దేశ రాజధాని
  • పలు దేశాల నేతల రాకతో హడావిడి
  • భారీగా ఏర్పాట్లు…బందోబస్తు

న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 8 :  ‌రెండ్రోజుల పాటు జరిగే జి-20 శిఖరాగ్ర సమావేశాలకు భారతదేశం తొలిసారి ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఇందుకోసం దేశ రాజదాని హస్తిన ముస్తాబయ్యింది.  శనివారం నుండి రెండు రోజుల పాటు జరిగే సమావేశం కోసం దేశ రాజధాని ఢిల్లీ సర్వాంగసుందరంగా దర్శనిమస్తోంది. ఈ సదస్సుకు జి 20 దేశాధినేతలు, యూరోపియన్‌ ‌యూనియన్‌కు చెందిన ఉన్నతాధికారులు, అతిథి దేశాలు, అంతర్జాతీయ సంస్థల ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. వసుధైక కుటుంబం అనే థీమ్‌తో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశానికి హజరవుతున్న ప్రముఖల్లో అమెరికా అధ్యక్షలు జో బైడెన్‌, ‌చైనా ప్రధానమంత్రి లి కియాంగ్‌ ఉన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ ‌పుతిన్‌ ఈ ‌సమావేశంలో పాల్గొన లేనని ఇప్పటికే ప్రకటించారు. రష్యా నుంచి ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తారని పుతిన్‌ ‌చెప్పారు. కెనాడా, ఇంగ్లాండ్‌ ‌ప్రధాన మంత్రులు జస్టిన్‌ ‌ట్రూడో, రిషి సునక్‌ ‌హాజరుకానున్నారు.

జి 20 చర్చలతో పాటు, యుకె-ఇండియా వాణిజ్య చర్చలకు సంబంధించి ప్రత్యేక చర్చలల్లో మోడీతో సునక్‌ ‌పాల్గొంటారు. బంగ్లాదేశ్‌ ‌ప్రధాని షేక్‌ ‌హసీనా, జపాన్‌ ‌ప్రధాని కిషిడా ఫుమియో, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌ ‌కూడా ఈ భేటీకి హాజరుకానున్నారు. రిపబ్లిక్‌ ఆఫ్‌ ‌కొరియా అధ్యక్షులు యున్‌ ‌సుక్‌ ‌యోల్‌ ‌హాజరుకానున్నారు. ఫ్రాన్స్ ‌నుంచి ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ ‌మాక్రాన్‌, ‌దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ ‌రామఫోసా ఈ సదస్సులో పాల్గొననున్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌, అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్‌, ‌నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు ఈ సదస్సులో పాల్గొననున్నారు. వీరంతా రాత్రి కల్లా న్యూఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది. అయితే మరోవైపు..ఈ సమావేశంలో సౌదీ అరేబియా, ఇటలీ, జర్మనీ, ఇండోనేషియా, బ్రెజిల్‌ ‌వంటి దేశాలు పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతుంది. ప్రగతి మైదాన్‌లో అధునాతన సదుపాయాలతో నిర్మించిన ‘భారత్‌ ‌మండపం’ కన్వెన్షన్‌ ‌సెంటర్‌ ఈ ‌సమావేశానికి ప్రధాన వేదికగా నిలవనుంది. ఎటుచూసినా  భారీ హౌర్డింగ్‌లు, లైటింగ్స్ ఏర్పాటు చేశారు.

భారత్‌ అధ్యక్షత వహిస్తున్న ఈ సదస్సులో ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, మౌలిక సదుపాయాలు, స్థిరమైన అభివృద్ధి వంటి అంశాలపై వివిధ దేశాల నేతలు చర్చలు జరపనున్నారు. శుక్రవారమే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ‌పలు దేశాల అధినేతలు పలువురు వస్తుండడంతో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోడీ జో బైడెన్‌ ‌మధ్య ద్వైపాక్షికసమావేశం జరగనుంది. నగరంలో మూడు రోజు పాటు పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. వీధులను కుడ్య చిత్రాలు, బ్యానర్లు, ఫౌంటైన్లు, మొక్కలతో అలంకరించారు. విదేశీ అతిథులతో కమ్యూనికేట్‌ ‌చేయడానికి 100 మంది మహిళా పారిశ్రామిక వేత్తలను చాంబర్‌ ఆఫ్‌ ‌ట్రేడ్‌ అం‌డ్‌ ఇం‌డిస్టీ (సిటిఐ) నియమించుకుంది. వీరంతా ఇంగ్లీష్‌, ‌ఫ్రెంచ్‌, ‌స్పానిష్‌, ‌జర్మన్‌, ‌తదితర భాషలను అనర్గళంగా మాట్లాడతారని సిటిఐ చైర్మన్‌ ‌బ్రిజేష్‌ ‌గోయల్‌ ‌తెలిపారు. ఈ మహిళల జాబితాను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపినట్లు చెప్పారు. అలాగే గురుగ్రామ్‌ ‌జిల్లాలో ఈ నెల 8 నుంచి వర్క్‌ఫ్రమ్‌ ‌హోమ్‌ ‌చేయాలని ఉద్యోగులను ఆదేశించాలని అన్ని కార్యాలయాలకు ఆ జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. జిల్లాలోని అన్ని కార్పొరేట్‌, ‌ప్రైవేట్‌ ‌కార్యాలయాలకు ఈ మేరకు సలహాను జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page