నేడు అందుబాటులోకి విఎస్‌టి ఫ్లై ఓవర్‌

‌ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్‌…‌ నాయిని నర్సింహారెడ్డి పేరు ఖరారు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌హైదరాబాద్‌లో ఇందిరాపార్కు చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్‌ ‌భవన్‌ ‌సవి•పంలోని విఎస్టీ కూడలి వరకు నిర్మించిన స్టీల్‌ ‌బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. నేడు శనివారం ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి కెటిఆర్‌ ‌వెల్లడించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్‌, ‌వీఎస్టీ జంక్షన్లలో దశాబ్దాల తరబడి ఉన్న ట్రాఫిక్‌ ‌రద్దీని పరిష్కరించడం సంతోషంగా ఉందంటూ కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. రూ.450 కోట్ల వ్యయంతో 2.63 కి.వి•ల పొడవైన ఈ వంతెనను స్టాట్రజిక్‌ ‌రోడ్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌పోగ్రామ్‌(ఎస్‌ఆర్‌డిపి) కింద జిహెచ్‌ఎం‌సి నిర్మించిందని తెలిపారు. ఈ వంతెనకు కార్మిక నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని సిఎం కెసిఆర్‌ ఆదేశించారన్నారు.

నాయిని ముషీరాబాద్‌ ‌నియోజకవర్గం ఎంఎల్‌ఎగా ప్రాతినిధ్యం వహించారని, అలాగే, చాలా కాలం పాటు వీఎస్టీ కార్మికుల సంఘానికి సారథ్యం వహించారని ఈ సందర్భంగా కెటిఆర్‌ ‌తెలిపారు. 2.6 కిలోవి•టర్ల స్టీల్‌ ‌బ్రిడ్జి నగరవాసులకు అందుబాటులోకి వొస్త్తుంది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ ‌నేపథ్యంలో వాహనదారుల కష్టాలను తగ్గించేందుకు సిగ్నల్‌ ‌ఫ్రీ సిటీ లక్ష్యంగా ఇప్పటి వరకు సిటీలో 32 ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వొచ్చాయి. 33వ ప్రాజెక్టుగా ఇందిరా పార్క్ ‌నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్‌ ‌బ్రిడ్జి నగరవాసులకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. 2020 జులై 10న ఈ ఫ్లై ఓవర్‌ ‌నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 2021 జనవరిలో పనులు ప్రారంభమయ్యాయి. కేవలం రెండున్నర ఏళ్లలో 4 లైన్ల రోడ్‌తో స్టీల్‌ ‌బ్రిడ్జి నిర్మించారు.

రూ.450 కోట్ల అంచనా వ్యయం కాగా 12,500 మెట్రిక్‌ ‌టన్నుల ఇనుమును ఉపయోగించారు. సన్నటి ఐరన్‌ ‌పిల్లర్లు 81, 426 దూలాలు నిర్మించారు. తెలుగుతల్లి ఫ్లై  ఓవర్‌ ‌వి•ద నుంచి వొచ్చే వాహనాలు ఓయూ, నల్లకుంట వైపు వెళ్లాలంటే 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది. జంక్షన్లు ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ స్టీల్‌ ‌బ్రిడ్జి నిర్మాణంతో 2.6 కిలోవి•టర్ల దూరమైన లోయర్‌ ‌ట్యాంక్‌ ‌నుంచి వీఎస్టీ వరకు 5 నిమిషాల్లో వెళ్లొచ్చు. నగరంలో పలు చోట్ల ఫ్లైల ఓవర్లపై నుంచి మెట్రో లైన్‌ ఉం‌టుంది. కానీ ఇక్కడ మెట్రో లైన్‌ ‌పైనుంచి వెళ్లేలా ఈ బ్రిడ్జి నిర్మించారు. సిటీలో మెట్రో లైన్‌పై నుంచి వెళ్తున్న తొలి ఫ్లై ఓవర్‌గా ఈ వంతెన ప్రత్యేకత దక్కించుకుంది. ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, ఎమ్మెల్యే గోపాల్‌ ‌తదితరులు పరిశీలించారు. నగరంలో ట్రాఫిక్‌ ‌చిక్కులు లేకుండా ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించామని వారు ఈ సందర్భంగా అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page