నేడు ములుగు జిల్లాకు రాహుల్‌, ‌ప్రియాంక గాంధీ

 

రామాంజపురంలో మహిళా డిక్లరేషన్‌ ‌విడుదల…

భారీ బహిరంగ సభ

స్థానిక ఎంఎల్‌ఏ ‌సీతక్క ఆధ్య్వర్యంలో ఏర్పాట్లు పూర్తి

సీతక్కతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన

 భూపాలపల్లి పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ

 

వెంకటాపూర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17 : ‌నేడు ములుగు నియోజకవర్గ పరిధిలోని వెంకటాపుర్‌ ‌మండలం రామాంజపురం గ్రామ శివారులో కాంగ్రెస్‌ ‌పార్టీ ఏర్పాటు చేసిన మహిళా డిక్లేషన్‌ ‌భారీ బహిరంగ సభకు కాంగ్రెస్‌ అ‌గ్ర నేతలు రాహుల్‌ ‌గాంధీ, ప్రియాంక గాంధీలు బుధవారం ముఖ్య అతిథులుగా రానున్నారు. మంగళవారం సాయంత్రం సభా ప్రాంగణా న్ని ములుగు ఎమ్మెల్యే సీతక్క, భూపాలపల్లి జిల్లా డిసిసి ప్రెసిడెంట్‌ ‌ప్రకాష్‌ ‌రెడ్డి ఇతర ముఖ్య నాయకులతో కలిసి భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి సత్యనారాయణ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ అ‌గ్ర నేతలు రాహుల్‌ ‌గాంధీ, ప్రియాంక గాంధీ 18, 19 తేదీలల్లో ములుగు, భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించనట్లు తెలిపారు. 18న సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక హెలి క్యాప్టర్‌ ‌ద్వారా రామప్పకు చేరుకుని, రామప్ప రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుండి ప్రత్యేక బస్సు ద్వారా దేవాలయం నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాంజపురం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. సభలో ప్రియాంక గాంధీతో కలిసి రాహుల్‌ ‌గాంధీ మహిళా డిక్లరేషన్‌ ‌వ్లెడిస్తారని తెలిపారు. సభ అనంతరం అక్కడి నుండి రోడ్డు మార్గంలో వెల్తుర్లపల్లి క్రాస్‌ ‌రోడ్‌, ‌గణపురం, గాంధీనగర్‌ ‌క్రాస్‌ ‌రోడ్‌, ‌చెల్పూరు మీదుగా జెన్‌ ‌కో గెస్ట్ ‌హౌస్‌(‌గోదావరి గెస్ట్ ‌హౌస్‌)‌కు చేరుకుని, రాత్రి అక్కడే బస చేయనున్నారు. 19న గురువారం రోజున ఉదయం 7:30 గంటలకు 5 ఇంక్లైన్‌ ‌కమాన్‌ ‌నుండి బాంబుల గడ్డ వరకు నిరుద్యోగ యువత నిర్వహించే భారీ బైక్‌ ‌ర్యాలీలో రాహుల్‌ ‌గాంధీ పాల్గొనున్నట్లు వారు వెల్లడించారు. ర్యాలీ అనంతరం అక్కడి నుండి తిరిగి రామగుండం పర్యటనకు వెళ్తారని తెలిపారు. వారి వెంట ములుగు, వెంకటాపూర్‌, ‌భూపాలపల్లి, రాష్ట్ర, జిల్లా, మండల కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు ఉన్నారు.

నేడు రామప్ప దేవాలయంలో పూజలు నిర్వహించనున్న రాహుల్‌ ‌గాంధీ,

ప్రియాంక గాంధీలు…రామంజపూర్‌లో భారీ బహిరంగ సభ

ములుగు జిల్లా వెంకటపూర్‌ ‌మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప ఆలయంలో నేడు రాహుల్‌ ‌గాంధీ, ప్రియంగా గాంధీలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మంగళవారం రామంజపూర్‌ ‌గ్రామంలో విలేఖరుల సమావేశంలో సీతక్క మాట్లాడారు. రామంజపూర్‌లో భారీ బహిరంగ సభ జరుగునున్నట్లు తెలిపారు. ములుగు జిల్లా నుండి మహిళలు, యువత, కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యకర్తలు, అభిమానులు లక్షలాదిగా తరలి వొచ్చి అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం సభ జరిగే స్థలాన్ని, ఏర్పాట్లను పరిశీలించారు. రామప్ప దేవాలయ పరిసరాలలో హెలిప్యాడ్‌ ‌పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూచన రవళి రెడ్డి ,సిపిఎస్‌ ‌సభ్యులు, మాజీ మార్కెట్‌ ‌కమిటీ చైర్మన్‌ ‌మల్లాడి రామిరెడ్డి , ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్‌, ‌బ్లాక్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్‌ ‌రెడ్డి, వెంకటాపూర్‌ ‌మండల అధ్యక్షుడు చేన్నోజు సూర్యనారాయణ, జిల్లా యూత్‌ అధ్యక్షుడు బానోత్‌ ‌రవిచందర్‌ ,ఎన్‌ ‌హెచ్‌ ‌సి జిల్లా అధ్యక్షుడు మామిడి శెట్టి కోటి, జిల్లా యూత్‌ అధికార ప్రతినిధి సుమన్‌ ‌రెడ్డి ,ఎస్టీ సెల్‌ ‌మండల అధ్యక్షుడు మూడు వీరేష్‌, ‌సర్పంచ్‌ ‌తుమ్మేటి రాజిరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

రాహుల్‌ ‌పర్యటనకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు : ములుగు జిల్లా ఎస్పీ గౌష్‌ ఆలం

నేడు ములుగు జిల్లా రాహుల్‌ ‌గాంధీ పర్యటన నిమిత్తం అధునాతన భద్రత అనుసంధాన బృందం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ గౌష్‌ ఆలం తెలిపారు. బుధవారం రామప్ప దేవాలయ ప్రాంగణంలో జరగబోవు రాహుల్‌, ‌ప్రియాంక గాంధీల పర్యటన నిమిత్తం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సిఆర్‌పిఎఫ్‌ ‌రాష్ట్ర ఇంటలిజెన్స్ ‌వింగ్‌ ‌జిల్లా ఆరోగ్య అగ్నిమాపక దళ అధికారులతో, కార్యక్రమ నిర్వాహకులతో సంయుక్తంగా సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా అడ్వాన్సుడ్‌ ‌లైసెనింగ్‌ ‌బృందం హెలిపాడ్‌ ఏర్పాట్లు సభా ప్రాంగణం ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు ఎమ్మెల్యే సీతక్క, ఐటీడిఏపిఓ అంకిత్‌, ‌సిఆర్‌పిఎఫ్‌ ‌కమాండంట్‌ ‌కమలేష్‌, ఓఎస్‌డి అశోక్‌ ‌కుమార్‌ ఐపిఎస్‌ ‌రాహుల్‌ ‌గాంధీ వ్యక్తిగత భద్రతాధికారి సబూ, ఏఎస్‌పి ఏటూరునాగారం సిరిశెట్టి సంకీర్త్, ‌కమాండంట్‌ ‌సదానందం, ఐశ్వర్యం డిఎస్‌పి నర్సిరెడ్డి, రఘు, డిఎంహెచ్‌ఓ అప్పయ్య, డిఎస్‌పి ఇంటలిజెన్స్ ‌జితేందర్‌, ‌డిఎస్‌పి ములుగు రవీందర్‌ ‌తదితర అధికారులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ ‌డబ్బు, మద్యాన్ని నమ్ము

కున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page