నేడు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలం స్నాతకోత్సవం

  • పలువురు ప్రముఖులకు డాక్టరేట్ల్లు ప్రదానం
  • నేడు వర్చువల్‌గా పాల్గొననున్న గవర్నర్‌

‌తిరుపతి, జూన్‌ 22 : ‌తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం జరిగే స్నాతకోత్సవంలో ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేయనున్నారు. గౌరవ డాక్టరేట్‌లు అందుకోనున్న వారిలో ఒడిశా మాజీ డీజీపీ, ప్రముఖ దాత డాక్టర్‌ ‌చంద్రభాను సత్పతి, ప్రముఖ సినీ గేయ రచయిత, అవధాని నరాల రామారెడ్డి ప్రొద్దుటూరు, ప్రముఖ సైకియాట్రిస్ట్ ‌డాక్టర్‌ ఇం‌డ్ల రామ సుబ్బారెడ్డి ఉన్నారు. డియా సమావేశంలో రెక్టార్‌ ‌ప్రొఫెసర్‌ ‌వీ శ్రీకాంత్‌ ‌రెడ్డి, రిజిస్ట్రార్‌ ‌ప్రొఫెసర్‌ ఓఎం‌డీ హుస్సేన్‌, ‌కాన్వొకేషన్‌ ‌డియా కోఆర్డినేటర్‌ ‌ప్రొఫెసర్‌ ‌దేవప్రసాద్‌ ‌రాజు కూడా పాల్గొన్నారు. యూనివర్సిటీ ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్న ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్ర గవర్నర్‌ ‌బిశ్వ భూషణ్‌ ‌హరిచందన్‌.. ఈ ‌స్నాతకోత్సవానికి వర్చువల్‌గా హాజరై డిగ్రీలు అందజేయనున్నారు. ఈ విషయాలను ఎస్వీ యూనివర్శిటీ వైస్‌ ‌ఛాన్సలర్‌ ‌ప్రొఫెసర్‌ ‌కే రాజా రెడ్డి డియాకు వెల్లడించారు. 2015 నుంచి 2019 వరకు పెండింగ్‌లో ఉన్న ఐదేండ్ల కాన్వకేషన్‌లు (58-62 వ కాన్వకేషన్లు) ఒకేసారి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

గత రెండేండ్లుగా కరోనా వైరస్‌ ‌వ్యాప్తితోపాటు వివిధ కారణాల వల్ల ఈ స్నాతకోత్సవాలు నిర్వహించలేకపోయినట్లు వీసీ పేర్కొన్నారు. 2015-2019 మధ్య కాలంలో మొత్తం 26,052 మంది అభ్యర్థులు పట్టాలు అందుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కాన్వకేషన్‌ ‌సందర్భంగా ఐదేండ్లకు సంబంధించి ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు దాదాపు 340 బంగారు పతకాలు, 213 బహుమతులు అందజేయఇదిలాఉండగా, ప్రస్తుత గౌరవ డాక్టరేట్‌ అం‌దుకుంటున్న ఒడిశా రిటైర్డ్ ‌డీజీపీ చంద్రభాను సత్పతి.. ఐపీఎస్‌గా సేవలందించి శౌర్య పతకం, విశిష్ట సేవా మెడల్‌తోపాటు పలు అవార్డులను అందుకున్నారు. ఇతడు ప్రముఖ దాతగా పేరుగాంచారు. 200 చారిటబుల్‌ ‌సంస్థలకు మార్గదర్శిగా ఉన్నారు. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. 2015లో అమెరికా దిగువ సభను సందర్శించి ప్రార్థనలో పాల్గొన్న గెస్ట్ ‌చాప్లిన్‌గా నిలిచిన తొలి భారతీయుడిగా చంద్రభాను సత్పతి నిలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page