న్యూజిలాండ్‌ ‌ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ‌రాజీనామా

ఆక్లాండ్‌, ‌జనవరి 19 : న్యూజిలాండ్‌ ‌ప్రధాని పదవికి జెసిండా ఆర్డెర్న్ ‌రాజీనామా చేశారు. ఫిబ్రవరి  మొదటి వారంలో  ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు అధికార లేబర్‌ ‌పార్టీ సమావేశంలో ప్రకటించారు. వచ్చేనెల మొదటి వారంలో తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు న్యూజిలాండ్‌  ‌జెసిండా ఆర్డెర్న్  ‌ప్రకటించారు. ఇదే తనకు సరైన సమయమని, ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికార లేబర్‌ ‌పార్టీ సమావేశంలో వెల్లడించారు. లేబర్‌ ‌పార్టీ తదుపరి నాయకుడిని ఎన్నుకునేందుకు ఈ నెల 22న ఓటింగ్‌ ‌జరుగుతుందని చెప్పారు.

సాధారణ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్‌ 14‌న జరుగుతాయని తెలిపారు. దీంతో ఆర్డెర్న్ ‌పదవీ కాలం ఫిబ్రవరి 7 తర్వాత ముగియనుంది. వచ్చే ఎన్నికల్లో లేబర్‌ ‌పార్టీ గెలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 2017లో  జెసిండా ఆర్డెర్న్ ‌తొలిసారిగా న్యూజిలాండ్‌ ‌ప్రధానిగా ఎన్నికయ్యారు. భాగస్వామ్య పక్షాలతో కలిసి ఆమె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే మూడేండ్ల తర్వాత 2020 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆమె నేతృత్వంలో లేబర్‌ ‌పార్టీ సాధారణ ఎన్నికల బరిలోకి దిగింది. అయితే అనుకున్నంతగా రాణించలేకపోయింది. 49 శాతం ఓట్లతో మొత్తం 120 సీట్లకు గాను 64 స్థానాల్లో లేబర్‌ ‌పార్టీ విజయం సాధించింది. అయితే దేశంలో కోవిడ్‌ను సరిగా కట్టడి చేయలేక పోవడం, ఆర్థిక మందగమనం వంటి పరిస్థితుల్లో ఆమె నాయకత్వ పటిమపై ప్రజల్లో అపనమ్మకం ఏర్పడింది. అదేవిధంగా జెసిండా వ్యక్తిగత ఇమేజ్‌ ‌కూడా దెబ్బతిన్నది.

దీంతో ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో లేబర్‌ ‌పార్టీ ఓటమి చవిచూసింది. దీంతో తాను మరింతకాలం ప్రధాని పదవిలో కొనసాగలేనని ఆమె ప్రకటించారు.ఈ నెల 22న లేబర్‌ ‌పార్టీ తదుపరి నాయకుడి ఎన్నిక ఉంటుందని చెప్పారు. 2023 అక్టోబర్‌ 14‌న  సాధారణ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ ఎన్నికల్లో లేబర్‌ ‌పార్టీ తప్పక గెలుస్తుందని ఆమ  ధీమా వ్యక్తం చేశారు. 2020 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బరిలోకి దిగిన లేబర్‌ ‌పార్టీ  తక్కువ సీట్లు సాధించింది. 49 శాతం ఓట్లతో మొత్తం 120 సీట్లకు గాను 64 స్థానాల్లో మాత్రమే గెలిచింది. న్యూజిలాండ్‌ ‌లో కరోనాను  కట్టడి చేయలేకపోవడం, ఆర్థిక మందగమనం వంటి అంశాల్లో ఆ దేశ ప్రజలకు  జెసిండా ఆర్డెర్న్ ‌పై నమ్మకం తగ్గింది.  దీంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో లేబర్‌ ‌పార్టీ ఓటమి పాలైంది. దీనికి బాధ్యత వహిస్తూ..తాజాగా ఆర్డెర్న్ ‌ప్రధాని పదవికి రాజీనామా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page