పరిగి, ప్రజాతంత్ర, అక్టోబర్ 04: మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టి అమలు పరుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని దోమ మండల జెడ్పీటీసీ నాగిరెడ్డి అన్నారు.బుధవారం పరిగి నియోజక వర్గం దోమ మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన హాజరై చీరలు పంపిణీ చేసి అనంతరం ఆయన మాట్లాడుతూ. తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసిఆర్ మహిళలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని, పెళ్ళీడు వచ్చిన పేదింటి బిడ్డలకు కళ్యాణ లక్ష్మీ, గర్భిణీలకు పౌష్ఠికాహారం, ఆసుపత్రిలో కెసీఆర్ కిట్స్ లాంటి ఎన్నో పథకాలు ఎంతో అండగా నిలిచాయి అని అన్నారు.బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలందరికీ తెలంగాణ ప్రభుత్వం కానుకగా అందిస్తున్న చీరలు మర మగ్గ నేతన్నలకు ఉపాధి కల్పించటంతోపాటు అడపడుచులకు ప్రేమపూర్వక చిరుకానుక అందించే ఉద్దేశ్యంతో ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించబడింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం అధ్యక్షులు రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ మల్లేశం, ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్,మండల కోఆర్డినేటర్ లక్ష్మయ్య, కో ఆప్షన్ సభ్యులు ఖాజా పాషా,రాజగోపాల చారి,శ్రీనివాస్, వార్డు సభ్యులు మైను, నిరోషా, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జ్యోతి, ఐకెపి సిబ్బంది జంగయ్య శేఖర్ భాగ్య మాధవి తదితరులు పాల్గొన్నారు.