పటాన్‌చెరు నుండి పాకిస్థాన్‌కు.. అక్రమంగా ట్రమడాల్‌ ఎగుమతి

ఎన్‌సీబీ అదుపులో పరిశ్రమ ప్రతినిధులు

పటాన్‌చెరు, మార్చి 21(ప్రజాతంత్ర విలేఖరి) : తీవ్రమైన నొప్పి నివారణకు ఉపయోగించే ట్రామడాల్‌ ‌డ్రగ్‌ను ఎలాంటి అనుమతులు లేకుండా ఉత్పత్తి చేయడమే కాకుండా అక్రమంగా పాకిస్తాన్‌కు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని గడ్డపోతారం ల్యుసెంట్‌ ‌డ్రగ్‌ ‌పరిశ్రమపై సోమవారం ఎన్‌సీబీ దాడులు నిర్వహించి కంపెనీ డైరెక్టర్‌తో పాటు నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారణ నిమిత్తం  బెంగుళూరులోని ఎన్‌సీబీ కార్యాలయనికి తరలించారు. ట్రామడాల్‌ ‌వినియోగం అక్రమమని తెలుస్తుండగా ప్రత్యేక పర్యవేక్షణ లేకుండా వినియోగించారాదని, కొన్ని సార్లు ప్రత్యేక పర్యవేక్షణలో ట్రామిడాల్‌ను వినియోగిస్తే ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

కాగా సదరు ల్యుసెంట్‌ ‌కంపెనీకి ట్రమడాల్‌ ‌డ్రగ్‌ అనుమతి ఉందా లేదా, అనుమతి ఉంటే అంత చిన్న కంపెనీ ఒకే సంవత్సరంలో అంటే 2021లోనే 25 వేల కిలోల ట్రామిడాల్‌ను ఎలా పాకిస్తాన్‌కు ఉత్పత్తి చేసింది. అంత భారీ స్థాయిలో ఉత్పత్తి సామర్థ్యం లేని ల్యుసెంట్‌ ఇతర కంపెనీలు సహకారం అందించాయా, పాకిస్తాన్‌కు అక్రమంగా ఎలా ఎగుమతి చేశారనే కోణంలో ఎన్‌సీబి అధికారులు తమదైన శైలిలో విచారించేందుకే డైరెక్టర్‌తో పాటు నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page