కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రుద్రారం మాజీ సర్పంచ్ వెంకన్న
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బి. రాంగోపాల్
పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 29: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రుద్రారం మాజీ సర్పంచ్ వెంకన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బి.రాంగోపాల్ లు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ… పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హస్తం గుర్తుకు ఓటు వేసి కాట శ్రీనివాస్ గౌడ్ ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలుపొందుతారని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు కచ్చితంగా అందుతాయని వారు పేర్కొన్నారు.