ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్టు 3 : పటేల్ కూడా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్ తెలిపారు గురువారం మున్సిపాలిటీ పరిధిలోని పటేల్ గూడ గ్రామంలో 50 లక్షల రూపాయలతో వాటర్ ట్యాంక్ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రామాలలో అంచలంచలుగా అభివృద్ధి పరచామని, ప్రజల సౌకర్యాల నిమిత్తం మరింత అభివృద్ధి పరిచేందుకు ఎల్లవేళలా ప్రజలకు తోడునీడుగా ఉండి వారి సహకారంతో మరింత అభివృద్ధి పరుస్తానని ఆమె వెల్లడించారు.ఆదిభట్ల మున్సిపాలిటీలో గతంలో సౌకర్యాలు లేమి ఉండేదని తాను మున్సిపల్ చైర్మన్ అయ్యాక గ్రామాలలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుని సమస్యలను అధిగమించేందుకు కృషి చేశానని ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్న వాటిని తీర్చేందుకు తన వంతుగా ప్రయత్నం చేసి ముందుకు నడిపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.ఎల్లవేళలా ప్రజలు తనతో మమేకమై సమస్యలు పరిష్కరించాలని కోరిన వెంటనే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కోరే కలమ్మ, కౌన్సిలర్లు పొట్టి రాములు,కమండ్ల యాదగిరి,నారని మౌనిక సుధాకర్ గౌడ్, కమిషనర్ అమరేందర్ రెడ్డి,ఎఈ వీరాంజనేయులు,బిజెపి నాయకులు అశోక్ గౌడ్,విజయ్ గౌడ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.