పార్లమెంటులో విపక్షాల దూకుడు…

పాలక పక్షంలో ఆరంభమైన వొణుకు, బెదురు!

మతం, కులం, సాంస్కృతిక అంశాలపై జన సమూహాలను రెచ్చగొట్టి నమ్మించవొచ్చు. ఈ అంశాలు సున్నితమైనందు వల్ల సులువుగా జనాన్ని నాయకులు తమవైపు తిప్పుకుంటారు. అదే తార్కిక ధోరణి, వాదనల ద్వారా జనాన్ని వీలైనంత త్వరితగతిన నాయకులు తమ వైపు తిప్పుకోలేరు. గత పదేళ్లుగా బీజేపీ పాలకులు ప్రజలను మతం ముసుగులో ఎంచక్కా వోటు బ్యాంకుగా వాడుకున్నారు. వారు విమర్శలను కూడా పట్టించుకోరు. విమర్శలపై స్పందించరు. తాము చెప్పాల్సిన అంశాలను పదే పదే చెబుతుంటారు. వాటిలో తార్కికవాదం ఉండదు. అర్థం పర్ధం లేనివాదనలతో ప్రజలను మభ్యపెడుతుంటారు. ప్రతిపక్ష పార్టీల నేతల నోళ్లను మూయిస్తుంటారు. ప్రస్తుతం పార్లమెంటులో బీజేపీ చేస్తున్న పని ఇదే. రాష్ట్రపతి ప్రసంగానికి  ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి నంబంధించి ప్రధాని చేసినప్రసంగం వింటే డొల్లతనం అర్థమవుతుంది.

ప్రతిపక్ష పార్టీలు ప్రస్తావించిన అంశాలకు సరైన సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణిని అవలంభించారు. వారిపై ఎదురుదాడి చేశారు. ప్రతిపక్ష పార్టీల నోళ్లు మూయించేందుకు వితండ వాదన చేసిన ఘనత ప్రధానికి దక్కుతుంది. గత పదేళ్లుగా సాగిన ధోరణినే ప్రధాని తాజాగా రాష్త్రపతి ప్రసంగంపై మాట్లాడుతూ కొనసాగించారు. పదేళ్లతర్వాత విపక్షాలు తన గొంతును పార్లమెంటులో పెంచాయి. వారికి సంఖ్యాబలం పెరిగింది. ప్రతపక్ష నేత మాట్లాడుతున్నప్పుడుకూడా ప్రధాని అడ్డుపడి బదులిచ్చారు.  పాలక పక్షంలో అసహనం పెచ్చుమీరింది. పార్లమెంటులో విపక్ష సభ్యులు మాట్లాడుతున్నప్పుడు పాలక పక్ష సభ్యులు చికాకును వ్యక్తం చేశారు. విపక్షాలకు పార్లమెంటులో బలం పెరగడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

ప్రధాని మోదీ తన ప్రసంగంలో విపక్ష నేతను టార్గెట్‌ చేశారు. హిందూ వ్యతిరేక శక్తులుగా కాంగ్రెస్‌ ను, రాహుల్‌గాంధీని ముద్రవేసేందుకు ప్రయత్నించారు.  ప్రధాని మాటల్లో పస లేదు. హుందాతనం లేదు. సహేతుకమైన విమర్శలేదు. అదే రాహుల్‌ గాంధీ ప్రసంగంలో ఫైర్‌ కనపడిరది. ఉత్సాహంతో కదం తొక్కారు. రాహుల్‌ ప్రసంగం  పదునుగా ఉంది. బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. రాహుల్‌ గాంధీ తాను చెప్పదలుచుకున్న అంశాలను నూటిగాచెప్పారు. ఎక్కడ బెరుకు, తొణికిసలాట కనపడలేదు. అదురు, బెదురులేదు. రాహుల్‌ బాగానే పాలకపక్షంపై ఎటాక్‌ చేశారు. రాహుల్‌ ప్రస్తావించిన అంశాలకు ప్రధాని మోదీ జవాబు పేలవంగా ఉంది. ఉప్పుకారం లేదు. రంగురుచిలేని ప్రసంగంతో మోదీ హమ్మయ్య అనుకున్నట్లుగా కనపడిరది. మోదీ కళ్లలో గతంలోలాగా సంతోషం లేదు.  ఆయన బాడీ లాంగ్వేజీలో అడుగడుగున లోపాలు బహిర్గతమయ్యాయి. ఎంత సేపు మతపరమైన అంశాలను ప్రస్తావించి రాహుల్‌ నోరు మూయించడానికి చూశారే తప్ప, మోదీ ప్రసంగంలో చావ లేదు. హింసాత్మక హిందూ అని రాహుల్‌ ప్రస్తావించడంపై రాద్దాంతం చేసినా జనం పట్టించుకోలేదు. సమయ సందర్భం పరిగణనలోకి తీసుకుని ఏ సమయంలో ఆ మాటను రాహుల్‌ అన్నారనే విషయాన్ని పట్టించుకోలేదు. కాంగ్రెస్‌  హిందూవ్యతిరేక అని చెప్పేందుకు మోదీ చాలా ప్రయత్నం చేశారు.

ప్రజా సమస్యలను మోదీ ప్రస్తావించలేదు. విపక్షాలు అడిగిన అనేక అంశాలపై మోదీ దాటవేత వైఖరిని కనబరిచారు.పార్లమెంటరీ స్థాయి ప్రసంగంగా లేదు. చోటా రాజకీయనాయకుడి ప్రసంగం మాదిరిగా కనపడిరది. పార్లమెంటు వేదికగా మోదీ చేసిన ప్రసంగం పేలవంగా అట్టర్‌ ప్లాప్‌ అయింది. ఎందుకో మోదీ గతంలో ఇలా కనపడలేదు. మెజార్టీ తగ్గడంతో తీవ్ర అసహనంతో పాలక పక్షం ఉంది. ప్రజా తీర్పును జీర్ణించుకోలేకపోతున్నారు. అనుకున్నదొకటి, జరిగిందొకటి. అయోధ్య లో ఓటమి బీజేపీని కృంగదీసింది. విపక్ష పార్టీ నేతలు చాలా మంది మాట్లాడారు. జాతీయ సమస్యలను ప్రస్తావించారు. వాటిపై స్పందించలేదు. పార్లమెంటులో పాలక్ష పక్షం తాము చేపట్టిన పథకాలు, సంక్షేమ ప్రాజెక్టుల గురించి చెప్పుకోవాలి. మన విజయాలను ప్రస్తావించాలి. వాటి జోలికి మోదీ వెళ్లలేదు. ఎంత సేపు హైందవ వ్యతిరేక శక్తులు ఏకమవుతున్నారని బురద జల్లారు. మోదీ ప్రసంగాన్ని ఎవరు పట్టించుకోలేదు. పైగా జనంలో ఎమోషన్‌ కూడా కనపడలేదు. ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగితే జాతీయ వ్యతిరేక శక్తులుగా ముద్రవేయడం బీజేపీకి అలవాటైంది. విపక్ష నేతలను చీత్కార దృష్టితో చూడడం, వారిని తక్కువ చేసి మాట్లాడడం, వారిని వ్యక్తిత్వం ఉన్న నేతలుగా గుర్తించకుండా అవమానించడం బీజేపీకి అలవాటైంది. తాజాగా పార్లమెంటులో తమ బలం తగ్గడం, అలయెన్సు పార్టీలతో ప్రభుత్వంలోకి రావడంతో, బీజేపీ అగ్రనేతల్లో అలజడి మొదలైంది. వివక్షాల ఐక్యత వారిని ఆందోళనకు గురి చేస్తోంది. లోక్‌సభలో నీట్‌, మణిపూర్‌, నిరుద్యోగం గురించి చర్చకు అనుమతించకపోవడం దురదృష్టకరం. ఎప్పటిలాగానే రొటీన్‌గానే ధన్యవాదాల తీర్మానం ప్రవేశపెట్టడం, బీజేపీ తనగొప్ప  చెప్పుకోవడం, విపక్షాలపై దుమ్మెత్తిపోయడం, హైందవ  వ్యతిరేక శక్తుల కూటమిగా అభివర్ణించి ప్రసంగాన్ని ప్రధాని మోదీ ముగించేశారు.

ప్రతిపక్ష నేతను పిల్లవాడని, బాలుడని నిందించడం, నిజంగా అవాంచనీయ ధోరణి. ప్రధాని హుందాగా మాట్లాడాలి. ప్రతిపక్ష నేత ప్రస్తావించిన అంశాలకు ధీటుగా బదులివ్వాలి. అంతేకాని అక్కసుతో మోదీ మాట్లాడడం బాధకరని ప్రజాస్వామిక వాదులు వాపోతున్నారు. విపక్ష నేతను తూలనాడడం ఎక్కడైనా ఉందా ? ఇదేనా పార్లమెంటరీ సంప్రదాయం. ప్రస్తావించన అంశాలపై జవాబు ఇవ్వకుండా, నిందించడమెందుకు? రాజ్యాంగాన్ని అవహేళన చేసేవిధంగా పాలక పక్షం తీరు ఉంది. రాహుల్‌ గాంధీ ఎదుగుదలను, ప్రసంగం  తీరును చూసి బీజేపీ నేతలు తట్టుకోలేక పోతున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పెచ్చుమీరుతున్న మతతత్వం, ఆర్థిక మాంద్యం, కుంటుపడిన అభివృద్ధిఅంశాలపై విపక్ష నేత రాహుల్‌ సంధించిన ప్రశ్నలకు ప్రధాని నమాధానం చెప్పకుండా పలాయనం చిత్తగించారు. మొదటి సారిగా పదేళ్లలో బీజేపీ పార్లమెంటులో తడబడుతోంది. ధిక్కార ధోరణితో వివక్షాల గొంతును నొక్కేయడానికి మోదీ ప్రయత్నించారు. వొచ్చే ఐదేళ్లు ఇలాగే ఉంటుందా? పార్లమెంటులో విపక్షాల నుంచి ఎదురుదాడి ఇలాగేకొనసాగుతుందా అనే భయం బీజేపీ నేతల్లో ఆరంభమైంది. అడిగిన ప్రశ్నలకు సరైన బదులివ్వకుండా, సున్నితమైన అంశాలను ప్రస్తావించి, విపక్షాలను తొక్కేస్తామంటే కుదరదని రాష్ట్రపతి  ప్రసంగంపై జరిగిన చర్చ సందర్భంగా వెల్లడైంది. విపక్షం బలంగా ఉంది. దూకుడుతనంతో ఉందనే సంకేతాలు పంపడంలో విపక్ష నేతలు సఫలీక్నృతులయ్యారు. బీజేపీకి రానున్నవన్నీ గడ్డురోజులే. గతంలో మాదిరిగా బలం లేదు. వొళ్లు దగ్గరపెట్టుకుని విపక్ష నేతలనుగౌరవించి మాట్లాడాలి. యావత్తు భారతావని చూస్తూనే ఉంది. పార్లమెంటులో బీజేపీ పెత్తనం ఎంతో కాలం కొనసాగదు. పార్లమెంటు ప్రజల ఆస్తి. పాలక పక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. దురదృష్టకరం!
 -శామ్‌ సుందర్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page