పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై విపక్షాల విషప్రచారం..!

అడుగడుగునా ఆటంకాలు..
ప్రతిపక్షాలపై మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి మండిపాటు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 : ఎటువంటి నీటి లభ్యతలేని 6 టీఎంసీల జూరాల ప్రాజెక్టు మీద, దానికింది ఆయకట్టు, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌ ‌సాగర్‌ ఆయకట్టుతో పాటు తాగునీటి అవసరాలతో కలిపి 5.50 లక్షల ఎకరాలు ఆధారపడి ఉన్నాయని గమనించి కేసీఆర్‌ 216 ‌టీఎంసీల సామర్ద్యంగల శ్రీశైలం ప్రాజెక్టు నుండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటిని తోడుకోవడానికి నిర్ణయించుకున్నారని మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై విపక్షాల విషప్రచారం అంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి ప్రకటనలో స్పందించారు. ‘‘వాళ్లు ముందు జూరాల నుండి మొదలుపెట్టాలి అని వాదించారు.. తర్వాత అటవీ ప్రాంతం అని ఫిర్యాదులు పెట్టారు..తర్వాత పర్యావరణం దెబ్బతింటుంది అని గ్రీన్‌ ‌ట్రిబ్యునల్‌లో ఫిర్యాదులు చేశారు’’ అని పేర్కొన్నారు. తర్వాత రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, అనంతరం రైతుల పేరు మీద కేసులు వేయించారని, అన్ని అడ్డంకులను దాటుకుని ప్రాజెక్టులో మొదటి పంపు ప్రారంభించగానే ఇప్పుడు ఒక పంపుతో ఎలా మొదలు పెడతారని కొత్త రాగం ఎత్తుకున్నారని అన్నారు.

జూరాల కింద ప్రతిపాదించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 32 గ్రామాలు, 85 వేల ఎకరాల సేకరణ ఉన్నది..రీ డిజైన్‌ ‌చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేవలం 27 వేల ఎకరాల భూసేకరణ, 3 పెద్ద గ్రామాలు, 8 చిన్నతండాలు మాత్రమే ఉన్నాయన్నారు. తక్కువ ముంపుతో ఎక్కువ ప్రయోజనం మీద కేసీఅర్‌  ‌దృష్టిపెట్టారు..కృష్ణా నదిలో ఎక్కువ నీటి లభ్యత  తుంగభద్ర బేసిన్‌లో ఉన్నది..శ్రీశైలం నుండి పాలమూరు రంగారెడ్డి చేపట్టడం మూలంగా ఈ నీరు కూడా అందుబాటులో ఉంటుంది..పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద వీరు ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వ పనులు ఆగవు అన్నారు. పిల్లి శాపాలకు ఉట్లు తెగవు అని సూచిస్తూ..వీరికి పాలమూరుకు నీళ్లు రావాలి, ప్రజలు, రైతులు, ప్రాంతం బాగుపడాలి అన్న దానికన్నా ప్రాజెక్టు విఫలం కావాలన్న ఆకాంక్ష ఎక్కువగా ఉన్నది. ప్రాజెక్టు నిర్మాణంలో ఏవయినా అవరోధాలు వొస్తే నీళ్లొస్తే బాగుపడతారని ప్రజలను జాగృతం చేసి సహకరించాలి..లోపాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. తెలంగాణ ఎత్తిపోతల పథకాలు అన్నీ ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి నేతృత్వంలో పనులు నడుస్తున్నాయి.

ఇప్పటివరకు దాదాపు 250కి పైగా మోటార్లు బిగించబడ్డాయి..ఇతర దేశాల నుండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి సలహాలు, సూచనలు తీసుకుంటారన్నారు.కానీ సుదీర్ఘ అనుభవం ఉన్న ఇంజనీరు, తెలంగాణ గర్వించదగిన ఇంజనీరు అయిన పెంటారెడ్డి మీద కూడా వీరు బురదజల్లుతున్నారన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఒక్క పంపునే ప్రారంభించారన్న ప్రాథమిక విషయం ఇప్పుడు విషం చిమ్ముతున్న నాయకులు విస్మరించడం గమనార్హం..మిగతా కల్వకుర్తి ఎత్తిపోతల పంపులన్నీ తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్‌  ‌నాయకత్వంలోనే పూర్తి చేసుకున్నాం అని గుర్తు చేసారు. 60 ఏళ్లలో నష్టపోయిన పాలమూరు జిల్లా కేసీఆర్‌  ‌నాయకత్వంలో నిలదొక్కుకుంటున్నది.. పాలమూరుకు నీళ్లొస్తే మీ రాజకీయ జీవితాలు శాశ్వతంగా ఎక్కడ కూలిపోతాయోనని విషప్రచారం చేస్తున్నారు అని మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి పేర్కన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page