పితృస్వామ్య కుటుంబాల స్థానంలో ప్రజాస్వామిక కుటుంబాలు రావాలి

పీవోడబ్ల్యూ సంధ్య

(గత సంచిక తరువాయి…)

సజయ : ఐదు దశాబ్దాల పీవోడబ్ల్యూ ప్రస్థానంలో అనేక పోరాటాలు జరిగాయి. అందులో ప్రధానంగా కుటుంబహింస కూడా ఒకటి! మీ దగ్గరకు చాలామంది సహాయం కోసం, కౌన్సిలింగ్‌ ‌కోసం వస్తారు. ఏఏ అంశాల మీద ఎక్కడెక్కడ ప్రధానంగా పని సాగింది?
సంధ్య: నిజం చెప్పాలంటే, పీవోడబ్ల్యూ  శ్రమ విముక్తి కి సంబంధించిన అంశాలలో, సమాన పనికి సమాన వేతనం, పని స్థలాల్లో వేధింపులు, శ్రమ దోపీడీ, కుటుంబ హింస ఇలా చాలా అంశాల మీద పని చేశాము. కటుంబహింస పై మేము చేసిన పనికి బాగా గుర్తింపు వచ్చింది. వారికిం అండగా నిలబడటంతో మా మీద ఒక నమ్మకం కలిగింది బాధితులకు. కౌన్సిల్లింగ్‌, ‌గైడ్‌ ‌చేయటం, ప్రత్యక్షం గా కూడా ఒక్కోసారి వారీ వెంటే వుండటం, పోలీసుల మీద వొత్తిడి తీసుకు రావటం ఇలా అనేక అంశాలు వున్నాయి. నా అనుభవంలో, రాజ్యహింస మీద పనిచేసినప్పుడు మమ్మల్ని చాలా పెద్ద హీరోయిన్లుగా చూసేవారు, మీరు చాలా గ్రేట్‌, ఎన్కౌంటర్లు జరిగినా ధైర్యంగా పోలీసులకు ఎదురెళతారు అని అంటారు. ఎంత నిర్బంధం వున్నా వెరవకుండా పనిచేస్తారు అని గుర్తింపు వుంటుంది. సింగరేణి కార్మికుల సమ్మెలో పాల్గొంటే మమ్మల్ని గొడ్లని కొట్టినట్టు కొట్టారు. పంటచేలో గొడ్లు పడితే ఎలా కొడతారో అలా పోలీసులు మహిళా సంఘం వాళ్లని కొట్టారు అని పేపర్లో రాశారు. అట్లా అనేక సంధర్బాలు!  నెల్లిమర్ల జూట్‌ ‌మిల్‌ ‌కార్మికుల సమ్మె, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు ఇలా అనేకమంది పోరాటాలలో వారికి సంఘీభావంగా నిలబడినందుకు మేము కూడా కేసులు ఎదురుకుని జైళ్లకు కూడా వెళ్ళాము. ప్రతి సందర్భంలో ఆయా సెక్షన్స్ ‌తో   పీవోడబ్ల్యూ   ప్రత్యక్షంగా వారితో నిలబడింది, పనిచేసింది.
అప్పుడు పనిచేసినప్పుడు కనపడని అభ్యంతరం, కనపడని పితృస్వామ్యం, మేము కుటుంబ హింస మీద పనిచేస్తున్నప్పుడు ముందుకు వస్తాయి. విమర్శలు ఎదుర్కుంటాము, ట్రోలింగ్స్ ‌జరుగుతాయి. స్త్రీలుగా మేము నిర్బంధాలకు వ్యతిరేకంగా నిలబడితే మేము హీరోయిన్లమే! మేము ఏ పోరాటాలు చేసినా సమాజం హర్షిస్తుంది ఏదో ఒక స్థాయిలో. అక్కడ సమస్యలుండవని అనటం లేదు. అయితే, మరి అభ్యంతరం దేనిమీద? మహిళా సంఘం  పీవోడబ్ల్యూ  కార్యకర్తలుగా మేము ఎదుర్కొన్న అంశాలను చూస్తే, ఇటు రాజ్య నిర్బంధము ఎక్కువే! అయితే, పితృస్వామ్యం గురించి మాట్లాడినప్పుడు మాత్రం అటు సమాజం నుండీ వచ్చే దాడి, నిరసనా కూడా ఎక్కువే! తీవ్రమైన దూషణలు, ఆక్షేపణలు, దాడులు, బురద జల్లటం, డీ గ్రేడ్‌ ‌చేసి మాట్లాడటం అన్నీ ఎక్కువే వుంటాయి. నేను చాలా స్పస్టంగా చెప్పదల చుకున్నాను, రాజ్యహింస ఇంకా కరడు  కట్టిన దేనిమీదైనా మాట్లాడండి, వాటికి వేటికీ రాని విమర్శ పితృస్వామ్యం మీద మాట్లాడితే వస్తుంది. అన్ని రకాల అవమానాలకు మమ్మల్ని గురిచేస్తారు.
మా పుట్టుకలు, మమ్మల్ని కన్న కుటుంబాలు, అన్నీ దాడికి గురవుతాయి. ఎందుకింత వ్యతిరేకత అంటే, మీరు ఎన్ని పోరాటాలు చేసుకున్నా మాకేమీ కాదు కానీ, పితృస్వామ్యానికి, కుటుంబానికి, కుటుంబ వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడితే సహించం అని అంటారు. అల్టిమేట్‌ ‌గా కుటుంబాల్లో పురుషులకు వ్యతిరేకంగా, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు అనేది వారి సారాంశం. ఇది కనపడని ఆంక్షలాగా వుంటుంది. వ్యక్తిగతంగా మా మీద దాడి, తిరోగమన శక్తులు విజృంభించినప్పుడు, మత ఛాందసవాదులు రాజ్యం ఏలుతున్నప్పుడు అది చాలా నగ్నంగా బయటకు వచ్చింది. అది ఓపెన్‌ ‌గా ట్రోలింగ్స్ ‌రూపంలో, ఫేస్‌ ‌బుక్‌ ‌లో కనపడితే చాలు, కట్టగట్టుకుని పడిపోతారు. 1995 లో  బీజింగ్లో జరిగిన అంతర్జాతీయ మహిళా కాన్ఫరెన్స్ ‌లో ఒక డిక్లరేషన్‌ ‌వచ్చింది. నిర్ణయాలలో సహ భాగస్వామ్యం వుండాలి అని దానిలో రాశారు. అన్ని రకాల హింసలకి వ్యతిరేకంగా పోరాడాలి అని రాశారు. ఈ రెండు డిక్లరేషన్స్ ‌మీద భారత ప్రభుత్వం సంతకం పెట్టింది. మన దేశంలోని అనేకమంది మహిళా ఉద్యమకారులతో పాటు   పీవోడబ్ల్యూ   గా మేము కూడా చైనా లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన ఆ సదస్సులో పాల్గొన్నాము, ఈ విషయాల మీద జరిగిన చర్చల్లో పాల్గొన్నాము. డ్రాఫ్ట్ ‌తయారీలో కూడా వున్నాము.
సజయ: డొమెస్టిక్‌ ‌వయలెన్స్ ‌బిల్‌ ‌కోసం ఏం ప్రయత్నం చేశారు?
సంధ్య : డొమెస్టిక్‌ ‌వయలెన్స్ ‌మీద ఇందిరా జై సింగ్‌ ‌లాంటి వాళ్లు చాలా పనిచేశారు. డొమెస్టిక్‌ ‌వయలెన్స్ ‌బిల్‌ ‌కనీసం చర్చకు రావటానికి, ఆమోదం పొందటానికి, అమలిలోకి రావటానికి దాదాపు పదహారు సంవత్సరాలు పట్టింది. తీరా అమలులోకి వచ్చాక దానికి కి బడ్జెట్‌ ‌లేదు. ఇప్పటికీ కూడా అమలు చేసే యంత్రాంగం సరిగా లేదు. ఇంక లైంగిక వేధింపుల చట్టం గురించి. దాని గురించి బిల్‌ ‌పాస్‌ అయింది కానీ అమలు యంత్రాంగం లేదు. ఇదీ పరిస్థితి. ‘ఎబోలిష్‌ ‌పేట్రియార్కీ ఫ్యామిలీ అండ్‌ ఎస్టాబ్లిష్‌ ‌డెమోక్రటిక్‌ ‌ఫ్యామిలీ’ అనే 82 సంవత్సరపు యుఎన్‌ ‌డిక్లరేషన్‌ ఏదైతే వుందో దాన్ని అమలులోకి  తీసుకురావటం కోసం పనిచేయటం అనేది ప్రభుత్వం బాధ్యత.
ఈ చట్టాల గురించి మొట్టమొదటిసారి మేమే ఆర్టికల్‌ ‌రూపంలో తెలుగులో రాసాము. ఈ చట్టాలు అమలులోకి తీసుకురావటానికి రాష్ట్ర, జిల్లా, మండల  స్థాయి సదస్సులు పెట్టటానికి ఆలోచించాము. మామధ్య కూడా వీటి గురించీ ఒక చర్చ వచ్చింది. మనల్ని కుటుంబాలకి వ్యతిరేకం అనుకుంటారేమో అనే సంశయం కొంతమంది వ్యక్తం చేశారు. మహిళా సంఘాలు కుటుంబాలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కాంపైన్‌ ‌చేస్తున్నారు అనుకుంటారేమో అని చర్చ మా రాష్ట్ర  స్థాయి కార్యకర్తల మధ్యే జరిగింది. చాలా పెద్ద చర్చే జరిగింది. కుటుంబం పితృస్వామిక స్వభావం కలిగి వున్నది, పవర్‌ ఎక్సర్సైజ్‌ ‌చేస్తుంది, దీని మీద పోరాడుతూ, దీనిస్థానంలో ప్రజాస్వామిక కుటుంబాల కోసం పనిచేయాలని మేము కింది స్థాయి వరకూ పనిచేసుకుంటూ వెళ్ళాము. అప్పటికీడీవీ యాక్ట్ ‌చట్టం రూపం తీసుకోలేదు.
ఇంకా బిల్‌ ‌గానే వుంది. ఎన్డియే ప్రభుత్వం ఈ డెఫినిషన్‌ ‌మార్చటానికి ప్రయత్నం చేసింది కానీ ఎవరూ వొప్పుకోలేదు.  ఆ తర్వాత యూపిఏ ప్రభుత్వం 96 లో వచ్చిన తర్వాత బిల్‌ ‌పాస్‌ అయింది. మౌకికంగా, మానసికంగా, శారీరికంగా, లైంగికంగా, ఆర్థికంగా .. ఇన్ని రకాలుగా హింసలు  జరుగుతున్నాయని ఎలా అర్థం చేయించాలి? ఏ రకమైన హింసల నుండీ మనం రక్షణ కోరుకుంటున్నాము? అప్పటివరకూ వున్న 498•  మిస్యూజ్‌ అవుతోందనే చర్చ ఒకవైపు నుంచీ, మరోవైపు దానిని ఒక మెకానికల్‌ ‌గా అమలు చేసే ధోరణి మరోవైపు, ఈ రెండింటి మధ్యా పోలీసుల పాత్ర ఎలా వుంది? ఒక సివిల్‌ ‌డిస్ప్యూట్‌ ‌గా లేదా సివిల్‌ ‌రెమెడీ గా మహిళలకు కుటుంబాలలో నిజమైన రిలీఫ్‌ అది మెయింటెనెన్స్ ‌కావొచ్చు, లేకపోతే మధ్యంతర ఉత్తర్వులు ఏవైనా రక్షణ కోసం కావొచ్చు, కుటుంబాన్ని దాటి బయటకు వెళ్లి బతకటానికి కావొచ్చు, ఆ కుటుంబంలోనే వుండి రక్షణతో బతకటానికి కావొచ్చు. మొదటిసారి ఈ అంశాన్ని భారతదేశ ఎజండాలోకి తెచ్చినప్పుడు మేము  పీవోడబ్ల్యూగా ఆ చట్టాన్ని కిందివరకూ తీసుకెళ్లటంలో, ప్రతీ మండల స్థాయికి తీసుకెళ్లటానికి చాలా కృషి చేశాము. బార్‌ ‌కౌన్సిల్‌ అడ్వకేట్లు కూడా మమ్మల్ని పిలిపించి మాట్లాడించారు. పీవోడబ్ల్యూగా కాంపైన్‌ ‌చేయటంలో అన్ని సంఘాలు కృషి చేశాయి. అలాగే లైంగిక వేధింపుల వ్యతిరేక చట్టం  గురించి. 2013 వరకూ కూడా అవి ఒక రూపం లోకి రాలేదు. ఢిల్లీ దాకా వెళ్లి జాతీయ స్థాయిలో వాయిస్‌ ‌వినిపించటంలో, ప్రొటెస్ట్‌లు చేయటంలో  కూడా మేము చాలా కృషి చేశాం.
సజయ : వుమన్‌ ‌రిజర్వేషన్‌ ‌గురించి కూడా చాలా కృషి చేశారు కదా? ఏ విధమైన కార్యాచరణ తీసుకున్నారు?
సంధ్య: నిర్ణయాధికారంలో సహ భాగస్వామ్యం కోసం, రిజర్వేషన్‌  ‌కోసం గీతా ముఖర్జీ నేతృత్వంలో బిల్‌ ‌పెట్టారు. ఇప్పటికీ దానికి మోక్షం లేదు. బీజేపీ ఇప్పుడు తానేదో మోక్షం కలిగించానని చెప్పుకున్నా గానీ అది 2029 వరకూ అమలయ్యే అవకాశం లేదు. ఇలాంటి స్థితిలో ఈ దేశంలో పితృస్వామ్యం గురించి మనం చర్చిస్తున్నాము. ఆడవాళ్లకు చాలా హక్కులు వచ్చేశాయి, సమాన హక్కులు వున్నాయి, ఇంకా ఎక్కువ ఈక్వాలిటీ మీకు కావాలా అంటూ దాడులు జరుగు తున్నాయి.
వుమన్‌ ‌రిజర్వేషన్‌ ‌బిల్‌ ‌గురించి కూడా నాలుగైదు సార్లు ఢిల్లీ దాకా వెళ్లి పార్లమెంటు ముందు జంతర్‌ ‌మంతర్‌ ‌ప్రొటెస్ట్ల లలో పాల్గొన్నాము. ఇక్కడ వొక ముఖ్యమైన విషయం చెప్పాలి.
96లో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్‌ ‌పెట్టారు. దేవగౌడ ప్రభుత్వం పెట్టింది. ప్రగతిశీల మహిళా సంఘం గా మేము ఓబీసీ, మైనారిటీ సవరణతో  రిజర్వేషన్‌ ‌వుండాలనే స్టాండ్‌ ‌తీసుకున్నాం. మిగతా మహిళా సంఘాలు యథాతధంగానే అడుగుదాము లేకపోతే వీగిపోతుంది అని స్టాండ్‌ ‌తీసుకున్నారు. గీతా ముఖర్జీ గారు కూడా ఒక హంబుల్‌ ఎక్స్పలనేషన్‌ ఇచ్చారు. అవకాశం లేదు కాబట్టి, చట్ట సవరణలు లేవు, మిగతా ఎస్సీ, ఎస్టీ అన్నిటికీ వున్నాయి. వోబీసీ సవరణలు లేవు. అప్పటికీ వీపీ సింగ్‌ ‌మండల్‌ ‌కమిషన్‌ ‌సిఫారసుల ద్వారా ఒక ప్రయత్నం చేశాడు. వీపీ సింగ్‌ ‌ప్రభుత్వాన్నే కూల్చేసిన ఘనత ఈదేశ కులాధిపత్య రాజకీయ పార్టీలకు వుంది. అలాంటి ఈ స్థితిలో వోబీసీలకు ఈ అవకాశాల గురించి ఎలా మాట్లాడగలుగుతాము అని చర్చ వచ్చింది. పార్లమెంటు లో రాజకీయ నాయకుల జెండర్‌ ఇన్సెన్సిటివ్‌ ‌వాఖ్యలను ఖండిస్తూనే, ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు ఫలితాలు వుండాలంటే వోబీసీ మహిళలకు రిజర్వేషన్‌ ‌వుండాలనే స్టాండ్‌ ‌తీసుకున్నాము.
సజయ: ఇక్కడ మన రాష్ట్రం లో ఎలాంటి ప్రయత్నాలు చేశారు ?
సంధ్య: ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌లో మహిళా రిజర్వేషన్‌ ‌కోసం ఒక ఐక్య కార్యాచరణ ఏర్పడింది. ఆ టైమ్‌ ‌లో రేపో మాపో బిల్‌ ఆమోదం అయిపోతుంది అనే వూపు వచ్చింది. బయట అన్ని రాష్ట్రాలలో జోరుగా దిష్టి బొమ్మలు దగ్ధం అవుతున్నాయి. అయితే, యథాతధం అనే స్టాండ్‌ ‌కి మేము డిఫర్‌ అవుతున్నాం అని ఒక రాష్ట్ర స్థాయి మీటింగలోనే డిక్లయిర్‌ ‌చేసి మేము బయటకు వచ్చాము. బిల్‌ అప్పటికీ డ్రాఫ్ట్ ‌రూపం లోనే వుంది. మేము  పీవోడబ్ల్యూ   గా మా స్టాండ్‌ ‌ని కరపత్రం రూపంలో ప్రచురించి ప్రచారం చేశాము. అప్పటి నుంచీ ఇప్పటివరకూ ఆ డిమాండ్‌ ‌కు మోక్షం రాలేదు. కుల జనగణన జరగలేదు.
మన రాష్ట్రం లో వుండే అందరి బీసీ నాయకులతో పాటు పార్లమెంటులో వున్న అందరు బీసీ నాయకులను కూడా కలిసాము. మహిళా బిల్‌ ‌ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రమే ఓబీసీ సవరణ అంటున్నారు కానీ, సాధారణ సవరణ అంశాలలో ఎవరూ మాట్లాడటం లేదు. అది మేము వేలెత్తి చూపించాము. అయితే, సాధారణ సవరణలు కష్టం అంటున్నారు కానీ ఎవరి వైపు నుంచీ సరైన సమాధానం రాలేదు. కచ్చితంగా మహిళా బిల్‌ ‌వచ్చినప్పుడే ‘ఏకాభిప్రాయం’ కావాలని రాజకీయ పార్టీలు అన్నీ మాట్లాడటం వెనుక పితృస్వామ్య ధోరణే ప్రధానం అని స్పష్టం చేశాం. వేరే అంశాలకు సంబంధించిన బిల్లులు అన్నీ ఏకాభిప్రాయం లేకుండానే ఆమోదం పొందటం మనం గమనించవచ్చు.

     (ఇంకా వుంది )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page