పూర్తి స్థాయిలో 2 లక్షలు మాఫీ చేయాలి

నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రుణాలు మాఫీచేయాలని డిమాండ్‌ ‌చేస్తూ ఇందూరు రైతాంగం పోరుబాట పట్టింది. ఇచ్చిన మాట ప్రకారం ఆంక్షలు లేకుండా రుణాలు మాఫీ చేయాలంటూ నిజామాబాద్‌ ‌జిల్లా ఆర్మూర్‌లో మహాధర్నా నిర్వహిస్తున్నారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాకు ఆర్మూర్‌, ‌బాల్కొండ, నిజామాబాద్‌ ‌రూరల్‌ ‌నియోజకవర్గాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మామిడిపల్లి రోడ్డుపై బైఠాయించారు. ఎలాంటి షరతులు లేకుండా ఏకకాలంలో రూ.2 లక్షలు రుణమాఫీ మాఫీచేయాలని వారు డిమాండ్‌ ‌చేస్తున్నారు. తక్షణమే ఎకరానికి రూ.7500 చొప్పున రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కూడా వారు డిమాండ్‌ ‌చేశారు. రైతు జేఏసీ నిర్వహిస్తున్న ధర్నాకు బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ, వామపక్షాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి.

కాగా, మహాధర్నా నేపథ్యంలో ఆర్మూర్‌ ‌పట్టణంలో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. బీఆర్‌ఎస్‌తోపాటు విపక్షాలకు నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. రైతులు మామిడిపల్లికి రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. రైతులు రోడ్లపైకి వొస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 25 వరకు ఆర్మూర్‌, ‌బాల్కొండ సెగ్మెంట్లలో ఆంక్షలు విధించారు. అయినా ఆర్మూర్‌ ‌ధర్నాకు భారీగా రైతులు తరలివచ్చారు. బిఆర్‌ఎస్‌ ‌నేతలు జీవన్‌ ‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌, ‌వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రజలకు ఆశలు చూపి గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ‌పార్టీ మోసం చేస్తున్నదని, రైతుబంధు డబ్బులనే రుణమాఫీకి వాడారని, అయినా సంపూర్ణంగా మాఫీ చేయలేదని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి అన్నారు.

సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఎన్నికల ముందు రైతులంతా బ్యాంకులకు వెళ్లి రుణాలు తీసుకోవాలని, అందరికీ మాఫీ చేస్తామని చెప్పి.. ఇప్పుడేమో నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. రైతుధర్నాలో పాల్గొని ఆయన మాట్లాడుతూ…అమలుకు నోచుకోని హావి•లను ఇచ్చి ప్రజలను మోసం చేసిన రేవంత్‌ ‌సర్కారుకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. రైతు రుణమాఫీకి ఏడున్నర వేలు కోట్లు మాత్రమే విడుదలయ్యాయని, అవి కూడా రైతుబంధు డబ్బులేనని తెలిపారు. రుణమాఫీ విషయంలో సీఎం సంపూర్ణంగా చేశామని చెబితే, ఒక మంత్రి ఏడున్నర వేల కోట్లు అయ్యాయని చెప్పడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page