పెళ్లి వేడుకలో విషాదఛాయలు బరాత్‌లో కాల్పులతో యువకుడు మృతి

లక్నో,జూన్‌23 :  అం‌గరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లి వేడుకలో విషాదఛాయలు అలుముకున్నాయి. బరాత్‌ ‌వేడుకలో భాగంగా ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లికుమారుడు గాల్లోకి కాల్పులు జరిపాడు. ప్రమాదవశాత్తు ఆ బుల్లెట్‌ ‌స్నేహితుడికి తగిలింది. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌ ‌సోన్‌భంద్రా జిల్లాలోని బ్రహ్మనగర్‌ ఏరియాలో చోటు చేసుకుంది. మనీష్‌ ‌మాద్హేశియా అనే పెళ్లి కుమారుడు తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి బరాత్‌ ‌వేడుకలో భాగంగా ఊరేగింపుగా వెళ్తున్నాడు.

ఈ సమయంలో మనీష్‌ ‌గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆ బుల్లెట్‌ ‌పెళ్లి కుమారుడు స్నేహితుడు బాబు లాల్‌ ‌యాదవ్‌కు తగిలింది. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ యాదవ్‌ ‌ప్రాణాలు కోల్పోయాడు. వరుడు ఉపయోగించిన తుపాకీ కూడా యాదవ్‌దే. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరుడిని అదుపులోకి తీసుకున్నారు. తుపాకీని కూడా పోలీసులు సీజ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page