సిఎం కెసిఆర్ సూచన మేరకు బీఆర్ఎస్లోకి ఆహ్వానం
నేడు సిఎం కెసిఆర్‌ను కలిసిన అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం
రాష్ట్ర అసెంబ్లీకి ఇంకో నెలన్నరకు ఎన్నికలు జరుగనున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ఆ దిశగా శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యను శనివారం ఎంఎల్ఏ దానం నాగేందర్, దాసోజు శ్రవణ్‌లతో కలిసి హైదరాబాద్‌లోని ఆయన నివాసాని వెళ్లి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కెటి రామారావు కలిసారు. సిఎం కెసిఆర్ సూచన మేరకు కెటిఆర్ పొన్నాలను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొన్నాల ఇంటికి భారీగా చేరుకున్న ఆయన మద్ధతుదారులు జనగామ గడ్గ…పొన్నాల అడ్డా అంటూ నినాదాలు చేశారు. అనంతరం మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ…రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటి పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ రాజకీయ వేత్త పొన్నాల లక్ష్మయ్యను సీఎం కెసీఆర్ సూచన మేరకు మీఆర్ఎస్లోకి ఆహ్వానించామని, నేడు పొన్నాల సీఎం కెసీఆర్‌ను కలుస్తారని తెలిపారు. రేపు జనగామలో జరుగనున్న బహిరంగ సభలో పొన్నాలను బీఆర్ఎస్లో చేరాలని తాను కోరగా ఆయన సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. ఆదివారం సీఎంతో తన భేటీ అనంతరం తన నిర్ణయం ప్రకటిస్తానని పొన్నాల తలొన్నా చెప్పారని అన్నారు. ఎంతో మంది బీసీ నాయకులకు సీఎం కేసీఆర్ ఇప్పటికే సముచిత స్థానం ఇచ్చారని, పొన్నాల లక్ష్మయ్యకు కూడా సముచిత గౌరవం, ప్రాధాన్యం ఇస్తామని కెటిఆర్ తెలిపారు. 1960లోనే అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన పొన్నాల నాసా లాంటి అంతర్జాతీయ సంస్థలలో పని చేసిన వ్యక్తి అని, మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరి సుధీర్ఘ కాలం పాటు ప్రజా సేవ చేశారని కెటిఆర్ అన్నారు. ఇక పొన్నాల తన రాజీనామా ప్రకటన సందర్భంగా మీడియా ముఖంగా తన ఆవేదనను వెల్లడిరచిన విషయం, అనంతరం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ..వయసులో, అనుభవంలో పెద్ద, బలహీన వర్గాలకు చెంది నాయకుడిని పట్టుకుని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తూలనాడిన విధానం ఆయన దిగజారుడు సంస్కారానికి నిదర్శనమన్నారు. చేచ్చేముందు పార్టీ మారడ అనడం సరికాదని, ఎవరు ఎప్పడు చనిపోతారో ఎవరికి తెలుసంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఆ పార్టీ అధ్యక్షుడు మొదట బీజేపీ, తర్వాత ఆర్ఎస్ఎస్, తర్వాత టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్, రేపు ఏ పార్టీలోకి వెళ్లారో ఎవరికీ తెలయదంటూ కెటిఆర్ విమర్శించారు. అలాంటి వ్యక్తి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చూసేవాళ్లు నవ్వుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. కనకపు సింహాసనంపై ఓటుకు నోటు కేసులో దొంగను కూర్చుండబెట్టారని, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలకు రనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, తగిన గౌరవం ఇవ్వడం లేదని కెటిఆర్ విమర్శించారు.