పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి
2,41,742 మంది వోటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
కల్వకుర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్ ఓ) శ్రీనివాస్ నాయక్
ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 29 : కల్వకుర్తి నియోజకవర్గం లో 262 పోలింగ్ బూత్ లలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కల్వకుర్తి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి శీను నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాతంత్ర తో మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గం లో 24 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. సుమారు 2,41,742 మంది ఓటర్లు తమ వోటు హక్కును వినియోగించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకుగాను 1724 మంది పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు వారందరికీ ఎన్నికల సామాగ్రి అందజేసి ఆయా పోలింగ్ బూత్లకు కేటాయించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో 80 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయన్నారు. ఇందుకుగాను 67 వీడియో కవరేజ్లను.. 50 మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు దాదాపు 417 మంది పోలీసు సిబ్బందితో భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని తెలుసుకునే విధంగా ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.