‌ప్రగతి పనులు పరుగులు పెట్టాలె..

  • పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
  • పూర్తయిన పనుల ప్రారంభానికి సిద్ధం చేయాలి
  • ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగుపై దృష్టి సారించాలి
  • 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ బూస్టర్‌ ‌డోస్‌ ‌వేసుకోవాలి
  • సీజనల్‌ ‌వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
  • సిద్ధిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధుల సమీక్షలో మంత్రి హరీష్‌ ‌రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 28 : సిద్ధిపేట నియోజకవర్గం పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రగతి పనులను పరుగులు పెట్టించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. గురువారం సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో మంత్రి హరీష్‌రావు నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…మండలాల వారీగా, గ్రామాల వారీగా అభివృద్ధి పనులపై ఆరా తీశారు. కొన్ని గ్రామాల్లో సిసి రోడ్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయనీ, వొచ్చే వారం పది రోజుల్లో పనులు పూర్తి కావాలని కోరారు.

పంచాయత్‌రాజ్‌ ‌పరిధిలోని బిటి రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేశామని త్వరలోనే పనులు ప్రారంభించేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. నిర్మాణంలో గ్రామ పంచాయితీ భవనాలు, కమ్యూనిటీ భవనాలు పనులు వెంటనే పూర్తి కావాలన్నారు. డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్ల  నిర్మాణం పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని, అధికారులతో కలిసి  అర్హులైన లబ్దిదారులని ఎంపిక చేయాలని సూచించారు.

వొచ్చే వారం, పది రోజుల్లో అన్ని మండలాల్లో పర్యటన చేస్తా
సిద్ధిపేట నియోజకవర్గంలో పూర్తయిన అభివృద్ధి పనులు ప్రారంభానికి సిద్ధం చేయాలని ప్రజాప్రతినిధులకు మంత్రి హరీష్‌రావు సూచించారు. నారాయణరావుపేట మండల కేంద్రంలో నిర్మించిన డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లను వొచ్చే నెల  మొదటి వారంలో ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. ఇరుకోడ్‌, ‌పాలమాకుల గ్రామాల్లో అర్హులైన లబ్దిదారులని ఎంపిక చేసి గృహా ప్రవేశాలకు సిద్ధం చేయాలన్నారు. అన్ని మండలాల్లో అభివృద్ధి పనులు, గృహా ప్రవేశాలు  చేయాల్సిన డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లను ప్రారంభించడానికి సిద్ధం చేయాలన్నారు.

గ్రామ స్థాయి నుండి పార్టీ బలోపేతం చేయాలని ఆ దిశగా అన్ని గ్రామాల్లో బూత్‌ ‌స్థాయి నుండే ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లేలా ప్రతి కార్యకర్త పని చేయాలనీ, అందుకు మండల నాయకత్వం చొరవ చూపాలన్నారు. రైతు బీమా, రైతుబంధు, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ ‌కిట్‌, ఇం‌టింటికి త్రాగు నీరు, మండుటెండలో ప్రతి పొలంకు సాగు నీరు అందిస్తున్నామనీ, ప్రభుత్వ దవాఖానను కార్పొరేట్‌ ‌స్ధాయి చేసుకున్నామనీ, హైదరాబాద్‌కు వెళ్లకుండా ఎన్నో వైద్య సేవలు సిద్ధిపేటలో అందిస్తున్నామని చెప్పారు. ఉచితంగా  కంటి ఆపరేషన్లు, మోకాళ్ల చిప్ప మార్పిడి ఆపరేషన్లు ఇలా ఎన్నో  ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు సద్వినియోగం చేసుకునేలా చొరవ చూపాలన్నారు.

ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగుపై దృష్టి సారించాలి..
సిద్ధిపేటలోనే ఆయిల్‌ ‌పామ్‌ ‌ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకోబోతున్నామని 2వేల ఎకరాలకు మొదటి దశగా ఆయిల్‌ ‌ఫామ్‌ ‌సాగు చేసుకోబోతున్నామనీ, వొచ్చే సెప్టెంబర్‌లో మరో 5వేల ఎకరాలకు సంసిద్ధం అయ్యేలా చొరవ చూపాలని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారి రామలక్ష్మితో సమన్వయం కావాలని చెప్పారు. ఆయిల్‌ ‌ఫామ్‌ ‌సాగు ఎంతో లాభదాయక మైన పంట అని రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఈ విషయంపై రైతుల్లో మరింత అవగాహన కల్పించాలని చెప్పారు.

సిద్ధిపేట సర్వ జన దవాఖానలో సాయంకాల ఒపి సేవలు…
సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాల దవాఖానలో సాయంత్రం పూట ఒపి సేవలు ఉంటాయని మంత్రి హరీష్‌ ‌రావు చెప్పారు. దవాఖాన సూపరిండెంట్‌ ‌కిషోర్‌తో దవాఖాన పని తీరుపై సమీక్ష నిర్వహించారు. సాయంత్రం ఒపి సేవలు ప్రారంభించాలని చెప్పారు. సీజనల్‌ ‌వ్యాధులు ప్రభలుతున్న నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా వంటి కేసులు వచ్చే అవకాశం ఉందనీ, అందుకు దవాఖానలో అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్లేట్‌లేట్స్ ఎక్కించే సేవలు అందుబాటులో ఉంచాలని మరింత మెరుగుపరచాలని సూచించారు. దవాఖాన వచ్చే పేషంట్స్‌కు, కుటుంబ సభ్యులకు నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పారు.

ప్రతి ఒక్కరూ బూస్టర్‌ ‌డోస్‌ ‌వేసుకోవాలి..
కొరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి హరీష్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి మనిషి రెండు డోస్‌ ‌టీకా వేసుకున్న ప్రతి ఒక్కరూ బూస్టర్‌ ‌డోస్‌ ‌వేసుకోవాలని చెప్పారు. ఇందుకు ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపలన్నారు .గ్రామాల్లో ఏఎన్‌ఎం‌లు, ఆశ వర్కర్స్ అం‌దుబాటులో ఉన్నారని చెప్పారు. కొరోనా విజృంభించే అవకాశం ఉనందున ముందు జాగ్రత్తగా అందరూ బూస్టర్‌ ‌డోస్‌ ‌వేసుకోవాలని సూచించారు.

రెండు డోసులు ఇప్పటికే పూర్తయి ఉన్నారనీ, ఆరు నెలలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ బూస్టర్‌ ‌డోస్‌ ‌వేసుకోవాలని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, ప్రజాప్రతినిధులు, నేతలు పాల సాయిరామ్‌, ‌మారెడ్డి రవీందర్‌రెడ్డి, రాజనర్సు, కూర మాణిక్యరెడ్డి, శ్రీహరిగౌడ్‌, ఉమా వెంకట్‌రెడ్డి, సారయ్య, కోల రమేష్‌గౌడ్‌, ‌సదానందం, కొండం సంపత్‌రెడ్డి, ఎల్లారెడ్డి, సోమిరెడ్డి, అరవింద్‌, ‌సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page