ప్రజల ఆహార హక్కు పై రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌!) ‌దాడి

ఆదివారం జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ యూనివర్సిటీ (  జె ఎన్‌ ‌యు) కావేరీ హాస్టల్‌లో విద్యార్థులపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌( ఆర్‌ ఎస్‌ ఎస్‌)  ‌లిఫుడ్‌ ‌కోడ్‌లిను విధిస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్‌(  ఏబీవీపీ)  గూండాలు దాడి చేశారు  శ్రీరామ నవమిని సాకుగా తీసుకుని మెనూలో  కోడి మాంసం(చికెన్‌)  ఉం‌డకూడదని ప్రకటించారు.  శ్రీరామనవమి ఉత్సవాలకు భంగం వాటిల్లిందని వారు చాలా రాష్ట్రాల్లో, ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముందస్తుగా అనేక  రకరకాలుగా తప్పుడు కథనాలను ప్రచారం చేశారు.  కాబట్టి, రాముడిని రక్షించే పేరుతో అఖిలభారత విద్యార్థి పరిషత్‌  (ఏబీవీపీ)/ రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌( ఆర్‌ ఎస్‌ ఎస్‌) ‌దాడులకు దిగిందిబీ   జవహర్లాల్‌ ‌నెహ్రూ యూనివర్సిటీ లో( జె ఎన్‌ ‌యు)లో కావేరీ హాస్టల్‌ ‌విద్యార్థులపై దాడి చేశారుబీ  ఈ దాడిలోఅనేకమంది  విద్యార్థులు గాయపడ్డారు.  ఏ ఒక్క  అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ)గూండా గాయపడలేదుబీ శాంతిని కోరుకునే వారిపై, ప్రశాంతతనూ  కోరుకునే వారిపై ఈ నెత్తుటి దాడులను సమర్థించుకోవడానికి హిందూత్వం ప్రమాదంలో పడిందని  వారు కల్పిత పిట్టకథలు(కాకమ్మ కథలు) తయారు చేసి ప్రచారంలో పెట్టారు.

గుజరాత్‌,  ‌మధ్యప్రదేశ్‌, ఈశాన్యం ప్రాంతాలు,  ఉత్తర ప్రదేశ్‌ (‌యూపి)లో ఈ దాడులు జరిగాయి.  ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్న శక్తులను అణగదొక్కడానికి వీలైన చోటల్లా ఫాసిస్ట్ ‌దురాక్రమణను ఎలా తీవ్రతరం చేస్తున్నారో దిల్లీ మరియు అనేక ఇతర ప్రాంతాలలో మనం చూస్తున్నాం.  ఇదే సందర్భాన్ని ఉపయోగించుకుని దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో హిందీని విధించారు అమిత్‌ ‌షా.  ఇవన్నీ బహుముఖంగా  రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ (ఆర్‌ ఎస్‌ ఎస్‌) ‌చేస్తున్న ప్రమాదకరమైన  చర్యలు.. ప్రతిస్పందించడానికి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వడం లేదు.  ప్రత్యర్థి పార్టీలను నోరు మెదపడానికి  వీలు లేకుండా చేస్తున్నారుబీ కాషాయ దళంలోకి వచ్చేలా బలవంతంగా కాంగ్రెస్‌, ఇతర పార్టీల నేతలను సీబీఐ, ఈడీ తనిఖీల్లోకి తీసుకొస్తున్నారు. ఈ తరుణంలో, దేశం మొత్తాన్ని వివిధ రూపాల్లో  ఫాసిస్టు చర్యలు శరవేగంగా  చుట్టుముట్టుతున్నాయని  గుర్తించడం అవసరం. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయటమే మన ప్రథమ కర్తవ్యం. ఈ వాస్తవాలను  ప్రచారం చేయడానికి మరియు ఈ ప్రమాదాన్ని అధిగమించడానికి మనం సాధ్యమైనంత విస్తృతమైన ఫాసిస్ట్ ‌వ్యతిరేక ఫ్రంట్‌ను నిర్మించడానికి  మనం మరింత వేగవంతంగా  కార్యోన్ముఖులం కావాలి .
– కే ఎన్‌ ‌రామచంద్రన్‌,  
‌ప్రధాన కార్యదర్శి, సిపిఐ (ఎం.ఎల్‌) ‌రెడ్‌ ‌స్టార్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page