ప్రజాతంత్ర కొడంగల్ నవంబరు 22: ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బుధవారం కొడంగల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన…. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ రాదని అన్నారు. ఇక కొడంగల్ నుంచి పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కేసీఆర్. రేవంత్ రెడ్డి పెద్ద భూకబ్జాదారుడు అని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపిస్తే ప్రమోషన్ ఇస్తామని చెప్పారు. ఎన్నికల్లో నిలబడిన వ్యక్తుల గురించి ఆలోచించండి. ఎన్నికలు వస్తుంటాయి.. పోతూ ఉంటాయి. ఎన్నికల్లో పార్టీ తరపున అభ్యర్థులు ఉంటారు. కేవలం అభ్యర్థి గుణగనాలు మాత్రమే చూడకుండా… ఆ అభ్యర్థి వెనక ఉన్న పార్టీ చరిత్రతో పాటు విధానమేంటి..? ప్రజల పట్ల వారి దృక్పథం ఏంటనేది చూడాలి…?ఓటు అనేది వజ్రాయుధం. ఆ ఓటు అనేది ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే అషామాషీగా తీసుకొని ఓటు వేయవద్దు. మన గురించి మంచి ఆలోచించే పార్టీకే ఓటేయ్యాలి. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. 14 ఏళ్లు కష్టపడి తెలంగాణను సాధించింది. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. ప్రజలు వద్దని చెప్పినా… తెలంగాణను ఆంధ్రాలో కలిపారు. 58 ఏళ్లు అరిగోస పడ్డాం. చాలా అవస్థలు పడ్డాం-తెలంగాణలో అప్పుడు ఆకలి చావులు, ఆత్మహత్యలు, బతకలేక వలస పోయే వాళ్లు.కొడంగల్ వాళ్లు కూడా బతుకుదెరువుకు వెళ్లేవారు. ఇవన్నీ మీరు చూశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 10 ఏళ్లు అవుతుంది. మనం ఏం చేశామో మీ కళ్ల ముందే ఉందనీ అన్నారు కాంగ్రెస్ 200 పెన్షన్ ఇస్తే… బీఆర్ఎస్ 2వేలకు పెంచింది. మరోసారి గెలిస్తే ఈ పెన్షన్లను రూ.5వేలకు పెంచుతామని భరోసానిచ్చారు వచ్చే ఎన్నికల్లో మనమే మళ్లీ గెలుస్తున్నాం. ఎలాంటి డౌట్ లేదనీ అన్నారు రైతుల సమస్యలను పరిష్కరించుకుంటూ వచ్చాం. ఉచితంగా కరెంట్ తో పాటు రైతుబంధు ఇస్తున్నాం. రైతుబంధును పుట్టించిందే కేసీఆర్. ధాన్యానికి మద్దతు ధర కూడా ఇస్తున్నామని రైతుబంధు దుబారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. కానీ మన నరేందర్ రెడ్డి గెలిస్తే రైతుబంధు ఎకరాకు 16వేలు వస్తుంది ఇక ఇక్కడ్నుంచి పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి.. కరెంట్ 24 గంటలు అనవసరంగా ఇస్తున్నారని కేవలం 3 గంటలే చాలని అంటున్నాడు. మరీ 24 గంటల కరెంట్ ఉండాలంటే కూడా నరేందర్ రెడ్డినే ఉండాలి. 10 హెచ్ పీ మోటర్లు పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి అంటుండు. కానీ మన రైతుల దగ్గర 10 హెచ్ పీ మోటర్లు ఉంటాయా…? అందుకు అయ్యే ఆ డబ్బులు ఎవరు ఇస్తారు..? రేవంత్ రెడ్డి ఇస్తాడా…? దీనిపై రైతులు ఆలోచించాలనీ అన్నారు రేవంత్ రెడ్డి పెద్ద భూకబ్జాదారు, ఈ జిల్లాలోనే అనేక భూములను కబ్జా చేసిండి. కాంగ్రెస్ వస్తే ధరణిని తీసివేసి.. భూమాతా అని పెడ్తారంటా. అది భూమాతానా లేక భూమేతనా..?కొడంగల్ లో నరేందర్ రెడ్డి ఎంతో చేశాడు. వీటిపై ఆలోచన చేయాలి. పని చేసే నరేందర్ రెడ్డి కావాలా చిల్లర మాటలు చెప్పే రేవంత్ రెడ్డి కావాలా..? టికెట్లు అమ్ముకున్నాడని కాంగ్రెస్ నేతలే రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తుండు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి.అడ్డంగా దొరికిపోయి కూడా సత్య హరిశ్చంద్రుడిలాగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఉస్మానియా విద్యార్థులను కూలీలు అని మాట్లాడుతుండు.ఏకాణా పని చేయని రేవంత్ రెడ్డి కావాలా..? లేక నరేందర్ రెడ్డి కావాలా..? అనేది ఆలోచించాలి.
కాంగ్రెస్ లో 15 మంది నేతలు సీఎం కోసం కొట్లాడుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ కు 20 సీట్లు కూడా వచ్చేవి లోవు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది లేదు పాడు లేదు.నరేందర్ రెడ్డిని గెలిపిస్తే ఆయనకు ప్రమోషన్ ఇస్తాం. రేవంత్ రెడ్డి మాటలను నమ్మవద్దు. మోసపోవద్దు.
రేవంత్ రెడ్డికి ఓ నీతి లేదు, పద్ధతి లేదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాడు.ఇంకా ఇక్కడే కాదని… కామారెడ్డి వచ్చి పోటీ చేస్తుండు రేవంత్ రెడ్డి. అక్కడ చిత్తుచిత్తుగా ఓడిపోతున్నాడు. ఇక్కడ కూడా మీరు బుద్ధి చెప్పాలనీ అన్నారు ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.