క్యాలెండర్, డైరీ ఆవిష్కరణలో కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యే సతీష్‌కుమార్, కమలానంద భారతి స్వామిజీల ఆకాంక్ష.
హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 13 : అనేక కష్ట నష్టాలను అదిగమించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రజాతంత్ర తెలంగాణ దినప త్రిక మరిన్ని ఉత్సవాలు జరుపుకోవాలని, తన ఆశయం కోసం చిరకాలం కొనసాగాలని మాజీ ఎంపి కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ బాబు, దేవాలయాల పునరుద్దరణ పరిరక్షణ ఉద్యమ నేత కమలానంద భారతి స్వామిజీ ఆకాక్షించారు. శుక్రవారం హన్మకొండ హంటర్‌రోడ్డులోని తమ నివాసంలో లక్ష్మికాంతరావు, సతీష్‌బాబు, కమలానంద భారతిలు ప్రజాతంత్ర డైరీ, క్యాలెండర్‌ను వేరు వేరుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు గత 25 సంవత్సరాలుగా ప్రజాతంత్ర ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా నిలిచింద న్నారు. ప్రజా సమస్యలను ప్రతిభింబింప చేస్తూ ప్రజా హృదయాల్లో ప్రజాతంత్ర సుస్థిర స్థానం సంపాదించుకుందన్నారు. కెప్టెన్ లక్ష్మీకాంత రావు మాట్లాడుతూ తాను అనేక సంవత్సరా లుగా ప్రజాతంత్ర దినపత్రికను చదువుతున్నా నని, ఒక ఆశయం కోసం పత్రిక కృషి చేస్తుం దని, ఇదే రీతిన కొనసాగాలని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ ఒక దినపత్రిక విజయవంతంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం గొప్ప విషయమని , మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరారు. ఇంతటి పోటీ యుగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ప్రజాతంత్ర కలిగి ఉందని యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. అనంతరం దేవాలయాల పునరుద్ధరణ పరిరక్షణ ఉద్యమ నేత కమలానంద భారతి మాట్లాడుతూ అనేక సంవత్సరాల క్రితమే తెలంగాణ రాష్ట్రం కోసం ప్రారంభించిన ప్రజాతంత్ర చీరకాలం కొనసాగాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ప్రజాతంత్ర డైరీ, క్యాలెండర్‌ను ఆయనకు పాత్రికేయులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాతంత్ర గెస్ట్ ఎడిటర్ మండవ రవీందర్ రావు, ప్రజాతంత్ర బ్యూరో చీఫ్ వి.నారాయణ రెడ్డి, డెస్క్ జర్నలిస్టు కిరణ్ రెడ్డి, వనం శ్రీకాంత్, సీనియర్ రిపోర్టర్లు నల్లాల బుచ్చిరెడ్డి, డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి, డాక్టర్ ఎస్.రాజన్న, పెండెం వేణుమాధవ్, రాంమోహన్, సీనియర్ ఫోటో జర్నలిస్టు బి.శ్రీనివాస్, మండలాల రిపోర్టర్లు ఎం.సంతోష్‌కుమార్, టి.నరేష్, భీమదేవరపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సురేందర్ తదితరులు పాల్గొన్నారు.