తాజాగా వోటర్ల తీరును చూస్తే మాత్రం మెజార్టీ వోటర్లు సిద్ధాంతపరమైన భావజాలం ఉప్పెనకు ఆకర్షితులు కాలేదనిపిస్తుంది.  బీజేపీ, లేదా ఇతర మతతత్వ పార్టీల ప్రనంగాలకు ఆయా వర్గాల ప్రజలు ప్రభావితం కాలేదని వివేచనతో వోట్లు వేశారనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాము నమ్మిన సిద్దాంతాలకు అనుగుణంగా వోట్లువేశారని,అంతేకాని మతతత్వ భావజాలం ప్రభావంతో వోట్లు వేయలేదని కొన్ని సర్వే సంస్థలు సూచిస్తున్నాయి.
ఎన్నికల ముందు వోట్ల కోసం రాజకీయ పార్టీలు రాజకీయ గారడీలతో ఎత్తుకు పై ఎత్తుకు పాల్పడుతుంటారు. వోటర్లను ఆకర్షించేందుకు ప్రలోభాలతో కూడిన ప్రసంగాలు చేస్తుంటారు. మనది ఎన్నికల ప్రజాస్వామ్యం. కొన్ని రాజకీయ పార్టీల నేతలు తమకు తాము దైవాంశ సంభూతత్వాన్ని ఆపాదించుకుంటారు. వోటర్లు తమను ఆరాధిస్తున్నారనే భ్రమల్లో ఉంటారు. ప్రతి ఎన్నికల్లో దైవత్వం పేరు చెప్పి వోటర్లను ఫూల్‌ చేయాలనుకుంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆరు దశల్లో ఎన్నికలు ముగిశాయి. మరో దశ ఎన్నికలు జూన్‌ 1వ తేదీన జరుగుతాయి. బీజేపీతో పాటు మరి కొన్ని ఇతర మతతత్వ పార్టీలను చూడండి. కొంత మంది నేతలు తమకు దైవత్వాన్ని ఆపాదించుకుంటారు. తమ పార్టీకి వోటు వేస్తే పుణ్యం వస్తుంది. శత్రు పార్టీలకు వేస్తే పాపం మూటగట్టుకుం టారని చెబుతుండడం చూస్తున్నాం. మతతత్వ పార్టీలన్నీ చేసే పని ఇది. ప్రజలు గుడ్డిగా తమ మాట వింటారనుకుంటారు.
   భారత్‌ వోటర్లు తెలివైన వారు. వీరిని ఫూల్‌ చేయడం ఎవరి తరం కాదు. గత ఆరు దశల వోట్లు పోలైన తీరు చూస్తుంటే వోటర్లు గడుసువారని, నేతల మాటలను నమ్మినట్లుగా నమ్మి తమ నిర్ణయంతోనే వ్యవహరిస్తారనిపి
స్తుంది. వోటర్లు తమ ప్రాంతీయ సమస్యలు, వ్యక్తిగత భావోద్వేగాలతో మిళితమైన నిర్ణయం తీసుకుని వోట్లు వేన్తుంటారు. కొంత మంది వోటర్లు ప్రభంజనాలకు, గాలులకు ప్రభావితమవుతుంటారు. కొంత మంది వోటర్లు భావోద్వేగాలకు, రెచ్చగొట్టే ప్రసంగాలకు  ఆకర్షితులవుతుం టారు. ఒక్కోసారి తమ మతానికి, సిద్దాంతాలకు భంగం కలుగుతుందని, భవిష్యత్తులో ప్రమాదంలో పడుతామని భ్రమపడి, వాటి రక్షణ తమ ప్రథమ కర్తవ్యమని భావించి వోట్లు వేన్తుంటారు.
తాజాగా వోటర్ల తీరును చూస్తే మాత్రం మెజార్టీ వోటర్లు సిద్ధాంతపరమైన భావజాలం ఉప్పెనకు ఆకర్షితులు కాలేద
నిపిస్తుంది.  బీజేపీ, లేదా ఇతర మతతత్వ పార్టీల ప్రనంగా లకు ఆయా వర్గాల ప్రజలు ప్రభావితం కాలేదని వివేచనతో వోట్లు వేశారనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాము నమ్మిన సిద్దాంతాలకు అనుగుణంగా వోట్లువేశారని, అంతేకాని మతతత్వ భావజా లం ప్రభావంతో వోట్లు వేయలేదని కొన్ని సర్వే సంస్థలు సూచిస్తున్నాయి. మెజార్టీ వోటర్లు కొంత మంది ప్రతిపక్ష పార్టీలు చెప్పే అంశాలను విన్నారు. బీజేపీ చెప్పేదాని కంటే, విపక్ష పార్టీలు చేసే ప్రసం గాలను శ్రద్దగా విన్నారు. ఇదంతా ఆరోగ్యక రమైన ప్రజాస్వా మ్యానికి నిదర్శన మని చెప్పవొచ్చు. నగటు వోటర్లు వోట్లువేయ డంలో వివేచనతో వ్యవహ రించా రు. బీజేపీ చెప్పే కొన్ని అంశాలకు ఈ సారి వోటర్లు పెద్దగా పట్టించుకోలేదు.
కాని ఈ విషయమై ఇంకా స్పష్టత రావాలి. బీజేపీకి దూరంగా వోటర్లు జరిగా రా? లేదా బీజేపీయే తర పక్షాల వైవువాస్తవంగా మొగ్గు చూపారా..  అనే విషయమై క్లారిటీ రావాలంటే జూన్‌ 4వ  తేదీ వరకు ఆగాల్సిందే.
అనేక సర్వే సంస్థలు దేశ వ్యాప్తంగా ప్రజల నాడిని  పసిగట్టేందుకు ప్రయత్నాలు చేశాయి. గతంలో మాదిరిగా వోటర్లు బీజేపీకి బ్రహ్మరథం పట్టలేదు. ప్రతిపక్ష పార్టీలు చెప్పే విషయాలను శ్రద్ధగా ఆలకించారు. మరోసారి గెలుపు మాదే. 400కు పైగా సీట్లు మాకే వస్తాయని బీజేపి చెబుతోంది. కాని అందుకు విరుద్ధంగా పరిస్థితులు  సమాజంలో నెలకొ న్నాయి. మూడోసారి మంచి మెజార్టీతో అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.
ఈ సారి బీజేపీకి సాధారణ మెజార్టీ కంటే ఎక్కువ సీట్లు రావొచ్చు. బీజేపీ అగ్రనేతలప్రచారంలో కొత్త దనం లేదు. జనం నుంచి ఆశించిన స్పందన లేదనే వాస్తవాన్ని వారు గ్రహించి బెదురుతున్నారు. ఈ నేతలు పాలన గురించి మాట్లాడడం లేదు. విద్వేషపూరిత ప్రసంగాలు,  తప్పుడు ప్రచారాలు, మతతత్వ ఉద్రేకాలను రెచ్చగొట్టే ప్రసంగాలను
చేయడంలో బీజేపీ ముందంజలో ఉంది. ప్రజలు బీజేపీ నుంచి ఎన్నో ఆశించారు. ఆ ఆశలను బీజేపీ నిర్వీర్యం చేసింది. అందుకే వారి ప్రసంగాలకు పెద్దగా స్పందన లేదు. కాని ఎంత సేపు మూస తరహా ప్రసంగాలతో  వోట్లు
దండుకుందామనుకున్నారు. కాని ప్రజలను మెప్పించే ప్రసంగాలను చేయలేకపోయారు. ఈ తరహా ప్రసంగాలకు
ప్రజల నుంచి స్పందన లేదు.
కొత్తదనం లేని బీజేపీ ప్రసంగాలు వినేందుకు ప్రజలు నిరాసక్తత కనపరిచారు. ప్రజలకు, దిశ, దశ మార్గనిర్దేశనం చేయలేని బీజేపీ నేతల ప్రసంగాలు పేలవంగా ముగుస్తున్నాయి. ఈ సమయంలోనే రాజకీయ విశ్లేషకుడు, వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ను రంగంలోకి దించారు. బీజేపీకి  మంచి మెజార్టీతో   సీట్లు వొస్తాయని వారనుకుంటున్నట్లు 400 రాకపోయినా, గణనీయంగా సీట్లు వొస్తాయని టీవీ ఇంటర్వ్యూల్లో ఊదర గొడుతున్నారు. విపక్షాలు, అధికార పక్షం పోలింగ్‌ శాతంపై ఎవరికి వారు ఊదర గొట్టి ప్రకటనలు చేస్తున్నారు. ఈ సారి బీజేపీ గ్రాఫ్‌ పడిపోతోంది. అగ్ర నేతల ప్రనంగాలు కళ తప్పాయి. మతంపేరుతో వోటర్లను చీల్చేఎత్తుగడలకు పాల్పడ్డారు. దేవదేవుడు శ్రీరామచంద్రుడి పేరును తెరపైకి తెచ్చారు. గతంలో తన పేరు మీద వోట్లువేయాలని అడిగారు. అయోధ్య రామచంద్రుడి పేరును తెరపైకి తెచ్చారు. ఈ రోజు దేవుడి పేరు చెప్పివోట్లు అడిగినా ఆశించినంత స్పందన  జనంలో లేదు. రాజకీయంగా అధికారం చేజారిపోకుండా, ఎదురు దెబ్బలుతగలకుండా, వోటర్లను జాగ్రత్తగా ఆకట్టుకునేందుకు దైవత్వం పేరుతో బీజేపీ జనంలోకి  వెళ్లింది. ప్రజాస్వామ్యంలో అభివృద్ధి, సంక్షేమం పేరుతో వోట్లు అడగాలి. దైవత్వం పేరుతో వోట్లను అడిగి కువ్పుకూలిన వ్యవస్థలు బైబిల్‌ కాలంనుంచి ఉన్నాయి. కాలచక్రంలో దైవత్వం పేరుతో వోట్లు అడిగిన వారికి ప్రజలు తగిన రీతిలో బుద్ది చెబుతారు.
-శ్యామ్‌ సుందర్‌