నియోజక వర్గంలో చర్చిల నిర్మాణానికి నా సహకారం అందించా..
సిద్దిపేటలో క్రైస్తవ భవనం నిర్మించుకున్నాం..
క్రైస్తవుల సమాధుల కోసం స్థలం కూడా ఇచ్చాం..
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు
సిద్దిపేట లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: జిల్లా కేంద్రంలోని కొండ భూదేవి గార్డెన్ లో నిర్వహించిన క్రిస్టమస్ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెల్పిన హరీష్ రావు
మనం ఈ క్రిస్టమస్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ఈ క్రిస్టమస్ ఈ పండగను రాష్ట్ర పండుగగా మనం సందర్భంగా క్రైస్తవులకు, రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ బతుకమ్మ పండుగ కి హిందువులకు కూడా కొత్త బట్టలు ఇస్తూ వచ్చాము.మీరు అందరు కొత్త బట్టల తో కుటుంబ సమేతంగా పండుగను వేడుకగా జరుపుకోవాలని మన ఈ బట్టలు ఇచ్చుకోవడం జరుగుతుందని, ఈరోజు మన సిద్దిపేట నియోజకవర్గంలో కూడా మీ అందరి సంతోషాల మధ్య ఈ క్రిస్టమస్ కేక్ కట్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉందన్నారు. మరి ఈరోజు యేసుక్రీస్తు మహాప్రభువు మరి అందరూ కూడా ఈ భూమి మీద ఉండేటటువంటి ప్రజలు సంతోషంగా ఉండాలని, అందరూ శాంతితో ఉండాలని ప్రజల మధ్య ఎలాంటి రాగద్వేషాలు లేకుండా ప్రజలందరూ కూడా బాగుండాలి అని చెప్పారు.ఏసుక్రీస్తు మనకు బోధించడం జరిగిందన్నారు. మన నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాల్లో కూడా చర్చిల నిర్మాణానికి అనుమతులు అందిస్తూ చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి వ్యక్తిగతంగా కూడా నా సహకారాన్ని అందిస్తున్న విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసన్నారు.. ఎవరు ఏ గ్రామం నుంచి కూడా మేము చర్చి తట్టుకుంటున్నామని నా దగ్గరికి వచ్చినప్పుడు సహాయం అందించనన్నారు. మన సిద్దిపేటలో కూడా క్రైస్తవ భవనం కూడా ఒక చక్కగా నిర్మించుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసని గుర్తు చేశారు. ముఖ్యంగా ఈ క్రైస్తవ భవనానికి మా మిత్రులందరికీ నా దృష్టికి తెచ్చినప్పుడు అందుకు అనుగుణంగా నిధులు ఇచ్చామని చెప్పారు. క్రైస్తవుల కోసం సమాధుల కొరకు మంచి స్థలాన్ని ఇచ్చామని చెప్పారు. ఏసు ప్రభు దీవెన లతో సుఖసంతోషాలతో జీవించాలని మన రాష్ట్రం మన సిద్దిపేట అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో ముందుకు సాగాలని, ఆ యేసు క్రీస్తు మహాప్రభువును ప్రార్తించారు. మరొకసారి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.