‌ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలనే సంకల్పాన్ని స్వీకరించండి

హైదరాబాద్‌, ‌పీఐబీ, మార్చి 22 : ప్రపంచ జల దినం సందర్భంగా ప్రతి ఒక్క నీటి చుక్కను ఆదా చేయాలనే సంకల్పాన్ని స్వీకరించండంటూ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. నీటి ఆదా దిశగా కృషి చేస్తున్న వ్యక్తులను, సంస్థలను ప్రధాన మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రధాని ట్వీట్‌ ‌ద్వారా.. ‘‘జల సంరక్షణ అనేది గత కొద్ది సంవత్సరాలలో ఒక ప్రజా ఉద్యమంగా మారిపోయింది. అంతేకాకుండా, సరికొత్త ప్రయాసల ద్వారా దేశం లోని అన్ని ప్రాంతాలలోను ఇది ఆచరణరూపం దాల్చడం చూస్తే సంతోషం వేస్తుంది. నీటిని ఆదా చేసే దిశలో శ్రమిస్తున్నటువంటి వ్యక్తులను మరియు సంస్థలను నేను ప్రశంసిస్తున్నాను.’’ అని తెలిపారు. ‘‘అద్భిః సర్వాణి భూతాని జీవన్తి ప్రభవంతి చ’’..‘‘ప్రపంచ జల దినం సందర్భంలో మనం ప్రతి ఒక్క నీటి చుక్కను ఆదా చేయడం కోసం మన సంకల్పాన్ని పునరుద్ఘాటిద్దాం. మన దేశం జల సంరక్షణ మరియు స్వచ్ఛమైన తాగు నీటిని మన పౌరులకు అందేటట్టు చేయటానికి జల్‌ ‌జీవన్‌ ‌మిశన్‌ ‌వంటి అనేక చర్యలను చేపడుతున్నది.’’ అని మోదీ పేర్కొన్నారు.

మాతృమూర్తుల, సోదరీమణుల జీవనాన్ని సులభతరం చేయడంలో జల్‌ ‌జీవన్‌ ‌మిశన్‌ అత్యంత ప్రభావవంతం అయినటువంటిదిగా నిరూపితమవుతుందని, ప్రజలందరి భాగస్వామ్యంతో ప్రతి ఇంటికీ నల్లా నీటిని అందించాలనే సంకల్పం నెరవేరగలదని ప్రధాని తెలిపారు. ‘‘రండి. మనం అందరం కలసి జల సంరక్షణను ముందుకు తీసుకుపోవాలి, అలాగే ఈ భూమిని చిరకాలం మనుగడ సాగించేందుకు వీలుగా తీర్చిదిద్దడంలో మన వంతు తోడ్పాటును అందిద్దాం. నీటి తాలూకు ప్రతి బిందువును ఆదా చేయడం వల్ల మన ప్రజలకు సాయపడినట్లు అవుతుంది. మరి మన ప్రగతి జోరు అందుకొంటుంది.’’ అని తన ట్వీట్‌ ‌ద్వారా ప్రధాని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page