ప్రతి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలి

డిటిఎఫ్ డిమాండ్‌

ప్ర‌జాతంత్ర‌, జూలై 8 : రాష్ట్రంలోని ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయ పోస్టులు మంజూరు చేసి సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్ జిటి )లుమ అందరికీ ప్రమోషన్ కు అవకాశం ఇచ్చి భర్తీ చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏం సోమయ్య,టి. లింగారెడ్డిలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం హైదరాబాదులోని డిక్కీ హౌస్ లో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయ పోస్టులు మంజూరు చేసి డీఈడీ, బీఈడీ అర్హతలు గల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు అందరికీ ప్రమోషన్ కు అవకాశం కల్పించాలని, ఇటీవల జరిగిన పదోన్నతుల్లో మిగిలిపోయిన పోస్టులకు వెంటనే ప్రమోషన్ కౌన్సెలింగ్ చేపట్టాలని, గతంలో మాదిరిగా ప్రతినెల ప్రమోషన్లు ఇవ్వాలని,పెండింగ్ లో ఉన్న నాలుగు డిఎ లు వెంటనే విడుదల చేయాలని, ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విధంగా ప్రతి పాఠశాలకు స్వచ్ఛ కార్మికులను నియమించాలని, పాఠశాలల కరెంటు బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలని, పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు దాటినప్పటికీ విద్యార్థులందరికీ సరిపడా పాఠ్యపుస్తకాలు, యూనిఫార్మ్స్ ఇప్పటి వరకు అందజేయలేదని,వెంటనే అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమావేశంలోఅధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు డా.ఎం.గంగాధర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శాంతన్,వి.రాజిరెడ్డి,వి.రేణుక,టి.శ్రీశైలం,చాపబాబు,రాష్ట్ర కార్యదర్శులు ఎస్.భాస్కర్,జె.రామస్వామి,ఎ. శ్రీనివాసరెడ్డి, బి.శ్యామ్,అకడమిక్ సెల్ కన్వీనర్ డా.బి.రామకృష్ణ,అధ్యాపక జ్వాల సంపాదకులు జి. కళావతి,ఆడిట్ కమిటీ కన్వీనర్ పి.ఈశ్వర్ రెడ్డి,సభ్యులు బి.సదానందం,వెంకటేశ్వర్లుతో పాటు అన్ని జిల్లాల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page