ప్రతికూల వాతావ రణాలు, యుద్ధాలతో గత ఏడాదితో పోల్చితే నేడు ప్రపంచ ఆహార పదార్థాల ధరలు 13 శాతం కరువు పెరగడంతో పేద వర్గాలు అర్థాకలితో అలమిటించే దుస్థితి ఏర్పడింది. బియ్యం, గోధుమలు, బార్లీ, వంట నూనెలు, తృణ ధాన్యాలు, పప్పుల వంటి సరుకుల ధరలు ఇటీవల పెరగడంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదుపుకు లోనవుతున్నాయి. ప్రస్తుతం గోధుమల ధరలు 13.6 శాతం పెరుగుదలను చూపిస్తున్నాయి. బియ్యం ధరలు కూడా పెరిగినప్పటికీ కొంత అదుపులోనే ఉన్నట్లుగా తోస్తున్నది. ఇండియాలో మార్చి 2022 నాటికి తీవ్ర వడగాలులతో గోధుమ, వడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. భారతదేశంలో ఆగష్టు 2022 నాటికి 3.1 మిలియన్ హెక్టార్లలో మాత్రమే వరి పండిస్తుండగా, గత ఏడాది 5.3 మిలియన్ హెక్టార్లలో వరి ఉత్పత్తి చేయడం జరగడంతో కనీసం 20 శాతం ధాన్య ఉత్పత్తి పడిపోయింది. దీనితో దేశంలో ఆహార పదార్థాల కొరత, ధరల పెరుగుదల జరుగనుంది.
ప్రతికూల వాతావరణ ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా యూరొప్ దేశాల్లో తీవ్ర వడగాలులు (హీట్ వేవ్) వీయడంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి క్షీణించడం, ధరలు చుక్కల్లోకి చేరడం జరిగింది. ప్రపంచ కరువు పరిశీలన (గ్లోబల్ డ్రాట్ అబ్జర్వేటరీ) వివరాల ప్రకారం యూరోప్‌లో 47 శాతం వరకు భూములు ప్రభావితం అయ్యాయి. నేడు 16 శాతం ముక్క జొన్న, 5 శాతం గోధుమ, దాదాపు 10 శాతం వంట నూనెల దిగుబడులు తగ్గాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితులే రెండు ప్రధాన దేశాలు చైనా, అమెరికాల్లో కూడా నెలకొని ఉన్నాయి. చైనాలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న వడగాలులు, కరువులతో ఆహార ఉత్పత్తి తగ్గిపోయింది. అలాగే అమెరికాలో తీవ్ర వడగాలులు, వర్ష లేమి కారణంగా కూడా ఆహార ఉత్పత్తులు తగ్గాయి. బ్రెజిల్‌లో కూడా ప్రతికూల వాతావరణ ప్రభావంతో దాదాపు 8 శాతం ధాన్య దిగుబడులు తగ్గడం, ధరలు పెరగడం అనుభవానికి వచ్చింది. ఆహార ధాన్యాలను పండించే ప్రధాన ప్రపంచ దేశాల్లో ప్రతికూల వాతావరణాలతో ఉత్పత్తులు గణనీయంగా పడిపోవడం, కొరత ఏర్పడడం, సరఫరా శృంఖలం ప్రభావితం కావడం, దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల ధరలు పెరగడం, బడుగులు ఆకలి చావుల అంచున నిలవడం జరుగుతున్నది. యూరొప్ దేశాల్లో వడగాలులతో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి ప్రతికూల ప్రభావాలను చూపుతున్నది. యూరొప్ ప్రాంతాల్లో సగటు ఉష్ణోగ్రతలు దాదాపు 2.00 డిగ్రీలు పెరగడం గత శతాబ్దంలో ఎన్నడూ చూడలేదని అంటున్నారు. తీవ్ర వడగాలులతో పంటల దిగుబడులు తగ్గడం, బీడు భూములు పెరగడం, కార్చిచ్చులు పెరగడం జరిగి ప్రపంచ ఆరోగ్య సంక్షోభానికి ఊతం ఇస్తున్నది. వడగాలులతో యూరొప్‌లో వేల సంఖ్యలో అదనపు మరణాలు నమోదు అవుతున్నాయి. 11-24 జూలై 2022లో వడగాలులతో స్పెయిన్‌లో 1,682 మంది, పోర్చుగల్‌లో 1,000 మంది అధికంగా మరణించడం గమనించారు. యూరొప్ హీట్ వేవ్‌తో వృద్ధులు, పిల్లలు, అంగవైకల్యం కలిగిన జనులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారని తెలుస్తున్నది. 2003లో ఇలాంటి తీవ్ర వడగాలులతో 13,000 మంది ఒక్క ఫ్రాన్స్ దేశంలోనే మరణించడం జరిగింది. తీవ్ర వడగాలులతో ఆహార ధాన్యాల ఉత్పత్తులు తగ్గడమే కాకుండా వృద్ధుల మరణాల్లో 90 శాతం నమోదు అవుతున్నాయి. యూకె లాంటి యూరొప్ దేశాలల్లో హీట్ వేవ్‌తో నీటి కొరత కారణంగా అత్యవసర పరిస్థితులను (వాటర్ ఎమర్జన్సీ) ప్రకటించడం జరిగింది.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం
రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో గోధుమ, వంట నూనెల దిగుబడులు పడిపోయి ప్రపంచ ఆహార సంక్షోభానికి ఆజ్యం పోస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ ప్రతికూల మార్పులతో ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తుల సరఫరా, వాణిజ్యం, వినియోగం, ద్రవ్యోల్భణం, ఆహార భద్రత లాంటివి ప్రభావితం కావడం చూస్తున్నాం. రష్యా, ఉక్రెయిన్ దేశాలు 70 శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్, అధిక మ్నెత్తంలో గోధుమలు, బార్లీ ఎగుమతులు చేస్తుండేవి. ఈ యుద్ధంతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆహార కొరత, ఆకలి కేకలు, రాజకీయ అనిశ్చితిలకు దారి తీస్తున్నది. అత్యధిక ఎరువుల ఉత్పత్తుల కలిగిన దేశంగా రష్యా పేరు తెచ్చుకుంది. ఉక్రెయిన్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి కావలసిన 20 మిలియన్ టన్నుల ధాన్యం యుద్ధంతో ఆగి పోయాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 40 కోట్లు ఉక్రెయిన్ ఆహార ధాన్యాల మీదనే ఆధారపడి ఉన్నాయి. ఈ యుద్ధంతో 41 దేశాలకు చెందిన 181 మిలియన్ల ప్రజలు ఆకలి చావుల అంచున ఉన్నాయని ఐరాస ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంచనా వేస్తున్నది. ఉక్రెయిన్ పండించిన గోధుమల్లో 90 శాతం ఇతర దేశాలకు సముద్ర మార్గాన ఎగుమతి అవడం గత చరిత్రగా నిలుస్తున్నది. యుద్ధానికి ముందు నెలకు 6 మిలియన్ టన్నుల ధాన్యం ఎగుమతి కాగా నేడు యుద్ధం కారణంగా 1.5 – 2 మిలియన్ టన్నులు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి. రష్యన్ బలగాలు ఉక్రెయిన్‌కు చెంది వ్యవసాయ వనరులు, ఆహార ధాన్యాలు, పంటల్ని అగ్నికి ఆహుతి చేయడం, సిరియా లాంటి రాష్ట్రాలకు అమ్మడం లాంటి అనైతిక చర్యలకు పూనుకుంటున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపిస్తున్నారు. ఈ యుద్ధంతో పేద దేశాలైన సోమాలియా, లిబియా, లెబనాన్, ఈజిప్ట్, యెమెన్, సూడాన్ లాంటి దేశాలు ఆహార అభద్రతతో ఆకలి విపత్తు, కరువులతో అలమటిస్తున్నాయి. యుద్ధంతో ముఖ్యంగా పిల్లలు మరణం అంచున నిలబడి ఉన్నారు. కొన్ని దేశాల్లో గోధుమల ధరలు 750 శాతం వరకు పెరిగాయంటే యుద్ధ దుష్ప్రభావాల ఏ స్థాయిలో ఉందో తెలుస్తున్నది.

భారతంలో ఆహార అభద్రత
ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ముందున్న భారత దేశం నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే రానున్న రోజుల్లో దేశ ప్రజల ఆహార భద్రతకు ముప్పు వాటిల్లవచ్చని గమనించాలి. నేటి ఆహార ధాన్యాల పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ ముందుచూపుతో నిల్వలను పెంచుకోవడం, అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఎదుర్కోవడానికి ఎల్లవేళలా సంసిద్ధంగా ఉండాలి. గత మూడు ఏండ్లలో గోధుమల నిల్వలు 39 మిలియన్ టన్నులు ఉండగా, ఈ ఏడాది 19 మిలియన్ టన్నుల నిల్వలు మాత్రమే ఉన్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది గోధుమలు, బియ్యం నిల్వలు గణనీయంగా తగ్గడంతో రాబోయే రోజుల్లో ఆహార పదార్థాల కొరత ఎదురు కావచ్చని విశ్లేషించారు.

2019-21లో 41 శాతం దేశ జనాభా ( దాదాపు 56 కోట్లు) ఆహార అభద్రతకు చేరువలో ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రపంచ ఆహార అభద్రత కలిగిన జనాభాలో 37 శాతం భారతీయులు ఉన్నట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. ధరల పెరుగుదలతో పేదలు తీవ్రంగా ప్రభావితం అవుతారు. ఆహార ఉత్పత్తులను పెంచడం, ధాన్యాల సేకరణ చేయడం, ప్రజా పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయడం, అర్హులకు పట్టెడన్నం అవసర సమయాల్లో అందించడం లాంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి. ప్రపంచ ఆహార సంక్షోభానికి సరైన సమాధానంగా మన దేశంలో ఖరీఫ్ సీజన్‌లో ఆహార ధాన్యాల సేకరణ, నిల్వలను పెంచుకోవడం మాత్రమే దేశ ఆహార భద్రతకు ఊతం ఇస్తుందని గమనించాలి. పెరుగుతున్న భవిష్యత్తు తరాలకు సరిపోయే ఆహార ధాన్యాల విషయంలో మనందరం చొరవ తీసుకోవాలి. ప్రతికూల వాతావరణ మార్పులు, మహమ్మారుల విజృంభణలతో ప్రపంచ ఆహార సంక్షోభం పొంచి ఉందని, దీనితో ఇండియా సురక్షితంగా, స్థిరంగా ఆహార భద్రత సాధనకు పూనుకోవాలి.
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్ – 994970003
కరీంనగర్ – 994970003