‌ప్రమాదంలో దేశ ప్రజాస్వామ్యం

  • రాష్ట్రాలను కూల్చడమే లక్ష్యంగా అరాచకం
  • కెసిఆర్‌ ‌జాతీయ లక్ష్యానికి మా మద్ధతు
  • కలసికట్టుగా పోరాడుదామని దిల్లీ, పంజాబ్‌, ‌కేరళ రాష్ట్రాల సిఎంలు, జాతీయ నేతల పిలుపు
  • ఖమ్మం సభలో పాల్గొన్న నేతలు

ఖమ్మం, ప్రజాతంత్ర నెట్‌వర్క్, ‌జనవరి 18 :అంతకుముందు కేరళ సీఎం పినరయి విజయన్‌ ‌మాట్లాడుతూ…ఈ సభ దేశానికి దిక్సూచి, కేసీఆర్‌ ‌పోరాటానికి మద్దతు పలుకుదామని పిలుపునిచ్చారు. కేరళ ప్రజలు కేసీఆర్‌ ‌వెంటే ఉన్నారని గుర్తుచేసారు. పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యానికి బీజేపీ ముప్పుగా మారిందని విజయన్‌ అన్నారు.ఫెడరల్‌ ‌స్ఫూర్తికి వ్యతిరేకంగా మోడీ పాలన సాగుతుందని, రాష్ట్రాల హక్కులు, అధికారాలను కేంద్రం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు.రాజ్యాంగాన్ని కాపాడేందుకు బీజేపీకి వ్యతిరేకంగా పని చేయాలి, గవర్నర్ల ద్వారా రాష్ట్రాలను నియంత్రించేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని విజయన్‌ అన్నారు. కీలక నిర్ణయాల్లో కేంద్రం రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకోవట్లేదని గుర్తు చేసారు.

తెలంగాణ పథకాలు బాగున్నాయని, కేరళలోనూ తెలంగాణ పథకాల అమలుకు ప్రయత్నిస్తామని చెప్పారు. యుపి మాజీ సిఎం అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌మాట్లాడుతూ…చారిత్రక ఖమ్మం నగరం జనసంద్రంగా మారిందని, ఖమ్మం ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులని అన్నారు. బీజేపీయేతర రాష్ట్రాలను కేంద్రం ఇబ్బంది పెడుతుందని అన్నారు. విపక్ష పార్టీల నేతలను కేసుల పేరుతో ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు. దర్యాప్తు సంస్థలను చూపి భయపెట్టాలని చూస్తుందని గుర్తు చేసారు. కేంద్రం రోజులు లెక్కబెట్టుకుంటుందని అన్నారు. ఇవాళ్టితో కేంద్రానికి 399 రోజులే ఉన్నాయి, రైతుల్ని ఆదుకుంటామని మాట తప్పారని, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చేతులెత్తేశారని అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రక్షాళన జరుగుతున్నట్టే యూపీలోనూ జరుగుతుందని అన్నారు.

కేంద్రానికి కౌంట్‌డౌన్‌ ‌మొదలైందనిఅఖిలేష్‌ ‌యాదవ్‌ అన్నారు.పంజాబ్‌ ‌సిఎం భగవంత్‌ ‌సింగ్‌ ‌మాన్‌ ‌మాట్లాడుతూ తెలంగాణ పథకాల్ని కేంద్రం కాపీ కొడుతోందని,కలిసి పనిచేస్తే దేశానికి కొత్త మార్గదర్శకత్వం దొరుకుతుదని అన్నారు.బీజేపీ భ్రమలు కల్పించే పార్టీ, బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచే ప్రారంభమైందని అవుతుందని అన్నారు. దక్షిణాది నుంచి మొదలైన ఈ ఉద్యమం కొత్త చరిత్ర సృష్టిస్తుంది అన్నారు.ఖమ్మం దేశమనే పుష్పగుచ్ఛంలో అన్నిరకాల పూలుఉంటేనే బాగుంటుందని అన్నారు.. కానీ కొందరు ఒకే రంగు పువ్వును కొరుకుంటున్నారని అన్నారు. బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ అని పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి భగవంత్‌ ‌సింగ్‌ ‌మాన్‌ ఎద్దేవా చేశారు.భారత దేశం అతిపెద్ద సంక్షోభంలో ఉందని, దేశానికి బీజేపీ ప్రమాదకారిగా మారిందని సీపీఐ నేత, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డి రాజా విమర్శించారు. బుధవారం ఖమ్మం బీఆర్‌ఎస్‌ ‌భేరిలో పాల్గొన్న ఈ జాతీయ నేత.. ఉద్వేగపూరితంగా ప్రసంగించారు.భా•రతదేశం హిందూ దేశంగా మారితే ప్రమాదకరమని రాజ్యాంగ రూపకర్త డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ఆనాడే హెచ్చరించారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోందని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీలు దేశ మౌలిక వ్యవస్థలనే మార్చేయాలని చూస్తున్నారని తెలిపారు.

అలాగే.. గవర్నర్లు.. సీఎంలను ఇబ్బంది పెడుతున్నారు. ఇదేనా ఫెడరల్‌ ‌స్ఫూర్తి అంటే అని కేంద్రానికి ఏకిపడేశారు. చివరికి.. వన్‌ ‌నేషన్‌.. ‌వన్‌ ‌లీడర్‌.. ‌వన్‌ ‌పార్టీ అనే రీతిలో వ్యవహరిస్తోంది బీజేపీ. దేశ సార్వభౌమాధికారం ప్రమాదంలో పడిందన్న రాజా.. బీజేపీ దేశానికి ప్రమాదకారిగా పరిణమించిందని పేర్కొన్నారు. రైతుబంధు, దళిత బంధు అమలు అవుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. సాగునీరు, తాగు నీటిని కొరత లేదిక్కడ. దేశం ఉనికి ప్రమాదంలో పడినప్పుడు సెక్యులర్‌ ‌పార్టీలు ఏకం కావాలి అని డి రాజా పిలుపు ఇచ్చారు. బీజేపీ పాలన నుంచి దేశానికి విముక్తి కలిగించాలి. ఖమ్మం సభ నుంచి ఈ మెస్సేజ్‌ ‌పంపాలి అని డీ రాజా పిలుపు ఇచ్చారు. ఖమ్మం: బీఆర్‌ఎస్‌ ‌ఖమ్మం సభలో ఢిల్లీ సీఎం అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ ‌మాకు పెద్దన్న లాంటి వారు అని కేజ్రీవాల్‌ అన్నారు. కంటి వెలుగు అద్బుతమైన కార్యకమం అంటూ ప్రశంసలు కురిపించారు.ఢిల్లీ, పంజాబ్‌లోకూడా కంటి వెలుగు పథకం తీసుకువస్తామని స్పష్టం చేశారు.

కొత్త కలెక్టరేట్ల నిర్మాణం ఒక అద్భుతం. కంటి వెలుగు కార్యక్రమం నుంచి మేము చాలా నేర్చుకున్నాము. ఢిల్లీ వెళ్లిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. సింగపూర్‌, ‌జపాన్‌ ‌కన్నా మనం ఎందుకు వెనుకపడ్డాము.ఢిల్లీలో ప్రతి గల్లీలో మొహల్లా క్లినిక్స్ ఉన్నాయి. అదే పథకాన్ని బస్తీ దవాఖాన పేరుతో తెలంగాణలో అమలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ‌స్వయంగా వచ్చి మొహల్లా క్లినిక్‌లను చూశారు. తెలంగాణ గవర్నర్‌.. ‌కేసీఆర్‌ను ఇబ్బంది పెడుతున్నారు. ప్రధాని మోదీ ఆదేశాలతోనే గవర్నర్‌ ‌తమిళసై ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని అన్నారులీ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు,మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌,‌మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు జిల్లాలోని ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,రాజ్యసభసభ్యులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page