‌ప్రియాంకకు కొరోనా పాజిటివ్‌

‌న్యూ దిల్లీ, ఆగస్ట్ 10 : ‌కాంగ్రెస్‌ ‌జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈవిషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్‌ ‌ఖాతాలో ప్రకటించారు. గతంలోనూ ఒకసారి ప్రియాంక గాంధీ కోవిడ్‌ ‌బారిన పడ్డారు. ఆమెకు కరోనా పాజిటివ్‌ ‌రావడం ఇది రెండోసారి. తాను ఐసోలేషన్‌ ‌లో ఉన్నానని, కోవిడ్‌ ‌ప్రొటోకాల్‌ ‌ను పాటిస్తున్నానంటూ ట్వీట్‌ ‌చేశారు. యరోవైపు ఆమె సోదరుడు,కాంగ్రెస్‌ ‌నేత, వయనాడ్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో రాజస్థాన్‌ ‌లోని అల్వార్‌ ‌పర్యటన రద్దయింది. రాహుల్‌ ‌గాంధీ కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సంకల్ప్ ‌శిబిరంలో పాల్గొనాల్సి ఉంది. పార్టీ బలోపేతానికి ఇటీవల కాంగ్రెస్‌ ‌పార్టీ అన్ని రాష్టాల్లో్ర వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వచ్చే ఏడాది రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారాన్ని నిలబెట్టకునేందుకు ఇప్పటి నుంచే కాంగ్రెస్‌ అధిష్టానం చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా రాజస్థాన్‌ ‌పై కాంగ్రెస్‌ ‌ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఈఏడాది మేలో కాంగ్రెస్‌ ‌చింతన్‌ ‌శిబిర్‌ ‌రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరగింది.

ఈ సభలోనే ఈ ఏడాది సెప్టెంబర్‌ ‌నాటికి కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు. ఈఏడాది జూన్‌ ‌లో కూడా ప్రియాంక గాంధీ కోవిద్‌ ‌బారిన పడ్డారు. ఆసమయంలోనూ ఆమె ఒంటరిగా ఐసోలేషన్‌ ఉం‌డి చికిత్స పొందారు. మరో రెండు నెలలు తిరగకుండానే ఈఏడాదిలో రెండోసారి ప్రియాంక గాంధీకి కరోనా వైరస్‌ ‌సోకింది. ప్రియాంకగాంధీతో పాటు కాంగ్రెస్‌ ‌నేతలు పవన్‌ ‌ఖేరా, ఎంపీ అభిషేక్‌ ‌మను సింఘ్వీ కూడా కోవిడ్‌ ‌బారిన పడిన వారిలో ఉన్నారు. రాజ్యసభలో కాంగ్రెస్‌పక్ష నాయకుడు, పార్టీ సీనియర్‌ ‌నేత మల్లికార్జున ఖర్గే కూడా తనకు కోవిడ్‌ ‌పాజిటివ్‌ ‌గా నిర్థారణ అయినట్లు ట్విట్టర్‌ ‌లో తెలిపిన విషయం తెలిసిందే. ఇటీవల నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఈడీ విచారణకు వ్యతిరే కంగా నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ ‌నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేతలకు వరుసగా కోవిడ్‌ ‌సోకుతుండటంతో పార్టీ నాయకుల్లో ఆందోళన నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page