హైదరాబాద్, ఫిబ్రవరి 7(ఆర్‌ఎన్‌ఎ) : ఫామ్‌హౌస్ కేసులో ప్రభుత్వ పిటిషన్‌పై హైకోర్టు సింగిల్ బెంచ్ విచారణ జరిపింది. గతంలో ఇచ్చిన ఆర్డర్ సస్పెన్షన్‌ను 3 వారాలకు పొడిగించాలని పిటిషన్ దాఖలైంది. సుప్రీమ్ కోర్టుకు వెళ్లేందుకు వీలుగా తీర్పును ఆపాలని ప్రభుత్వం కోరింది. సీబీఐ కేసు నమోదు చేసిందా అని ప్రభుత్వాన్నిహైకోర్టు ప్రశ్నించింది. సీబీఐ ఇంకా కేసు నమోదు చేయలేదని హైకోర్టుకు ఏజీ తెలిపారు. ఫైళ్లు అప్పగించాలని సీబీఐ ఒత్తిడి చేస్తుందని అడ్వొకేట్ జనరల్ పేర్కొన్నారు.
సుప్రీమ్ కోర్టులో అప్పీల్‌కు వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందని హైకోర్టు ప్రశ్నించింది. అప్పీల్‌కు వెళ్లేందుకు వారం రోజుల సమయం పడుతుందని కోర్టుకు ఏజీ సమాధానం ఇచ్చారు. ఆయన వ్యాఖ్యపై స్పందించిన కోర్టు సీజే బెంచ్ నుంచి అనుమతి తీసుకుని రావాలంటూ ఏజీకి సూచించింది. రేపు చీఫ్ జస్టిస్ కోర్టులో మెన్షన్ చేస్తామని ఏజీ తెలిపారు. తదుపరి విచారణను నేటికి సింగిల్ బెంచ్ వాయిదా వేసింది.