బడి వంట బాగు పడేదెలా!?

 తెలంగాణ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం పై సమగ్రమైన ప్రణాళిక లేకపోవటం చేతనే అమలులో అనేక రకాల గందరగోళానికి గురవుతున్నది. మధ్యాహ్న భోజనం వంటను ప్రస్తుతం స్థానిక మహిళా సంఘాలు నిర్వ హిస్తున్నాయి. నిర్ధారించిన మెనూ వండటానికి కేటా యించిన నిధులు ప్రస్తుత ధరవరలకు చాలకపోవటం, అరాకొరా నిధులు కూడా సకాలంలో విడుదల కాక పోవటం సమస్యగా పరిణమిస్తున్నది. గత అక్టోబర్ నుంచి నిలిచిపోయిన కోడిగుడ్ల బిల్, నవంబర్ నుంచి తొమ్మిది ,పదితరగతుల విద్యార్థుల బిల్స్ బకాయిలు , వంట కార్మికుల గౌరవవేతనాలు వెరసి మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బకాయిలే కోట్లాది రూ పాయలకు పైనే వుంది.
మధ్యాహ్న భోజన నిర్వహణ పై మానిటరింగ్ పెద్ద ఎత్తున జరుపుతున్నట్టు హడా వుడి కనిపించటమే కానీ, రోజు వారీ మెనూ ఖచ్చితం గా అమలు, వంటలో నాణ్యత లోపాలపై వాస్తవ వివ రాల సేకరణ వుండటం లేదు. నిధులు సకాలంలో రాని కారణంగా అప్పు చేసి మధ్యాహ్న భోజన వంట ని ర్వహిస్తున్నామని, ఖచ్చితంగా మెనూ పాటించటం వీలు కాదని కార్మికులు ఏకంగా అధికారుల ముందే ప్రక టిస్తున్నారు. విద్యార్థికి రోజువారీ భోజనానికి గాను చేసిన కేటాయింపులు హాస్యాస్పదంగా వుండటం కూడా గమనార్హం.
    ప్రస్తుతం ఒకటి నుంచి ఐదవ తరగతు ల విద్యార్థులకు ఒక విద్యార్థికి రూ.5.45,ఆరవ తరగ తి నుండి నుండి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు రూ.8.17 చొప్పున, తొమ్మిది, పది తరగతుల విద్యా ర్థులకు రూ.10.67 చొప్పున మధ్యాహ్న భోజన ఏజె న్సీలకు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. మార్కెట్లో పప్పు, నూనె, కారం వంటి నిత్యవసర సరుకులు,కూ రగాయలరేట్లు పెరిగినా ఈ రేట్లలో ఎలాంటి తేడా ఉం డటం లేదు.రోడ్ పక్కన టిఫిన్ సెంటర్లలో పది రూపా యలకు కనీసం సింగల్ ఇడ్లీ కూడా లభించని పరిస్థి తులలో ఈ ధర లతో విద్యార్థులకు భోజనం ఎలా సిద్దం చేయగలమని ఏజెన్సీలు వాపోతున్నారు. పది రూపాయలకు నిర్ధారించిన పౌష్టికాహారం,వారంలో మూడు రోజులు కోడిగుడ్డు,మూడు రోజులు మిక్స్ డ్ కూరగాయల కూరలు సాధ్యమేలా అవుతుందనే ప్రశ్న కు సమాధానం లేదు.
   క్షేత్రస్థాయిలో వాస్తవాలు
 రోజు ఉదయం పాఠశాలల్లో సామాజిక వర్గాల వారీగా విద్యార్థుల హాజరు, సామాజికవర్గాల వారీగా ఆ రోజు మధ్యాహ్న భోజనం తినే విద్యార్థుల వివరాలు ఆయా పాఠశాలల హెడ్ మాస్టర్ ల ద్వారా ఎం.డి.ఎం. ప్రత్యే క డిజిటల్ యాప్ లో నమోదై బిల్ రెడీ అవుతుంది. నగర ప్రాంతాల్లో దాదాపు నలభై శాతం విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లో ముప్పయి శాతం విద్యార్థులు వే ర్వేరు కారణాలచేత ఇంటి నుండి తెచ్చుకున్న భోజన మే తింటారు. ఇలాంటి విద్యార్థులను కూడా మధ్యా హ్నం బడి భోజనమే తింటున్నట్టు రికార్డు లో చూపే పాఠశాలలు 90 శాతం వుంటాయి. కొన్ని పాఠశాలల్లో రోజువారీ హాజరు శాతానికన్నా ఎక్కువ మంది విద్యా ర్థులు బడి భోజనం తింటున్నట్టు రికార్డుల్లో చూపటం సాధారణంగా కనిపిస్తుంది. వంట కార్మికుల వ్యక్తిగత పరిశుభ్రత, వారి ఏకరూప దుస్తులు తలకు కవర్లు,విద్యార్థులకు సరిపడే,ఇవ్వా ల్సిన మేరకు కూరగాయలు,ఉప్పు పప్పు,నూనెలలో తూకాలు ,నాణ్యతలు, వంటకు వినియోగించే నీరు, వంట పాత్రల పరిశుభ్రతలపై మానిటరింగ్ దాదాపు మృగ్యమే! వంట నిర్వహణకు ప్రభుత్వం ఇచ్చే నిధు లు ఏ మూలకు చాలవని పాఠశాల పరిధిలో మానిట రింగ్ చేయాల్సిన హెడ్ మాస్టర్లే చూసీ చూడనట్టు ఊరుకోవటం కనిపిస్తుంది. పాఠశాల విద్యా హాజరు ప్రగ తి , ఉదయం పూట ప్రార్ధన తదితర పలుముఖ్యమైన పనుల్లో వుండే హెడ్ మాస్టర్లకు వంట నిర్వహణ పై పర్యవేక్షణ బాధ్యతలు అదనమై విషయం పలుచనవు తూంది.
 బడి వంటలో కనిపించని ప్రమాదం
 గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు వందశాతం పట్టణ ప్రాంతాల్లో తొంబయి శాతం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కార్మికులు వంటకోసం కట్టెల పొయ్యి విని యోగిస్తున్నారు. చెట్లకింద ఇరుకైన బడి ఆవరణలో ఈ కట్టెలు మండించటం ద్వారా వెలువడే పొగ పీల్చ టం ప్రమాదకరమనే స్పృహ ఎవరికీ వుండటం లేదు. ఈ కట్టెలు మండించటం వలన వెలువడే పొగ పై డెన్మార్క్ లోని అర్హస్ విశ్వవిద్యాలయం లోని ప్రజారోగ్య విభాగం అధ్యయనం చేసింది. ఈ పొగ వ్యాప్తిలో విష వాయువులు గాలిలో కలిసి వాతావరణం కలుషిత మవుతుందని నిర్ధారించారు. ఫలితంగా ప్రమాదకర మైన అస్తమా, ఊపిరితిత్తులలో వాపు,కంటి చూపు పై.ప్రభావం, గుండెజబ్బు, కాన్సర్ వ్యాప్తి జరుగుతుం దని ఆ పరిశీలన తేల్చింది. కౌమార దశలోవుండే పి ల్లలపై ఈ పొగ వ్యాప్తి మరింత ఎక్కువ ప్రభావాల్ని చూపిస్తుందని ఆ పర్యావరణ వేత్తలు పేర్కొన్నారు.
స్పెయిన్కు చెందిన బార్సిలోనా ఇన్స్టిట్యుట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ బృందం హైదరాబాద్లోని కొన్ని ప్రాంతా ల్లో 3,372 మందిపై చేసిన పరిశీలన మేరకు గాలి కా లుష్యం “కారొటిడ్ ఇంటిమా మీడియా థిక్నెస్”(రక్త నాళాలు గట్టి పడటం (సీఐఎంటీ)) వంటి సమస్యల కు కారణమవుతుందని రుజువు చేసింది.”ఇంటర్నేష నల్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ”లో ఈ అధ్యయ నం ప్రచురితమైంది. ఈ సమస్య తీవ్రతపై ప్రభుత్వం స్పందించకుంటే పాఠశాలలో విద్యార్థులకు కలిగే పలు అనారోగ్య సమస్యలు వారిని ప్రభుత్వ పాఠశాలకు దూరం చేసే అవకాశాలుంటాయి. ప్రతిబడిలో విద్యా ర్థుల సంఖ్య ఆధారంగా గ్యాస్ బర్నర్ స్టౌలు, సబ్సీడీ పై గ్యాస్ సిలిండర్లు మంజూరు చేయటం పై ప్రభుత్వం దృష్టి సారించాలి. పాఠశాలలో గాలి వెలుతురు వుండే విధంగా కిచెన్ రూం నిర్మాణం చేయించి వంటకు రక్షి త నీటి సరఫరా ఏర్పాటు చేయించాలి.
 *నిర్వహణ బాధ్యతలు*
 మధ్యాహ్న భోజన బాధ్యతలు నిర్వహించే ఏజెన్సీల నిర్వహణ లోపాలకు బాధ్యులు చేస్తూ కొన్ని సంద ర్భాల్లో పాఠశాల హెడ్ మాస్టర్లను ప్రభుత్వం సస్పెండ్ చేయటం పై తీవ్ర విమర్శలు రేకెత్తుతున్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతో సర్కారు బడుల్లో ఏర్పాటు చేసిన మహిళా సంఘాలకు మధ్యాహ్న భో జన పర్యవేక్షణ బాధ్యతలు ఇచ్చారు. ఏజెన్సీలు తె చ్చిన గుడ్లు నాసిరకమైతే హెడ్ మాస్టర్ల పై సస్పెన్షన్ వేటు పడుతున్నది. చదువు బాధ్యతలతో పాటు పలు అనేక బాధ్యతలతో సతమతమవుతున్న హెడ్ మాస్టర్లను ఈ వంట పర్యవేక్షణ బాధ్యతల నుండి పూ ర్తిగా తప్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
 గుడ్డుతోనే అసలు తంటా…
 పాఠశాల విద్యార్థులకు వారానికి మూడు రోజులు గుడ్డు,మూడు రోజులు రాగిజావ ఇవ్వాలని మెనూలో నిర్ధేశించారు. కోడి గుడ్డు ధర రిటేల్ మార్కెట్ లో 7రూ పాయలు , హోల్ సేల్ మార్కెట్ లో 6 రూపాయలు కా గా ప్రభుత్వం గుడ్డుకు 5 రూపాయలు ధర ఏజెన్సీలకు చెల్లిస్తున్నది. ప్రతి గుడ్డు మీద రూపాయి ఎగవేస్తున్న ప్రభుత్వం ఎజెన్సీలను బహిరంగంగా దోపిడీ చేస్తుందనే భావించాలి.. 1-8 క్లాస్ ల దాకా విద్యాహక్కు చట్టం కింద సెంట్రల్ గవర్నమెంట్ ఎం.డీ.ఎం. ఖర్చులో 60 శాతం డబ్బును రాష్ట్రానికి పంపుతుంది. 9, 10 తర గతుల విద్యార్థుల ఎం.డీ.ఎం.భారమంతా రాష్ట్రాని దే. సెంట్రల్ గవర్నమెంట్ వాటా సొమ్ము గత బీ.ఆర్. ఎస్.పాలకులకు అందినా ఏజెన్సీలకు చెల్లించక తి ప్పలు పెట్టారు. ఏడు నెలల బాకీ బిల్ రూ.5 కోట్ల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏప్రిల్ లో చెల్లించింది.ఎం. డి.ఎం. లో నాణ్యత పై గుడ్డు నేరుగా తన ప్రభావం చూపుతుంది. స్టూడెంట్స్ కు బాయిల్డ్ ఎగ్స్ ఇవ్వడం దాదాపు ఆపేశారు.
మార్కెట్ గుడ్డు ధర రూ.6 ఉండ గా సర్కారు రూ.5 ఇవ్వడం గిట్టుబాటుకావడంలేదని ఏజెన్సీలు అంటున్నాయి. నిత్యావసర సరుకులు మార్కెట్ ప్రైస్ ప్రకారం ఇవ్వాలని కోరుతున్నారు. మధ్యాహ్నం వంట ఎజెన్సీలకు ఒక్క నెల పేమెంట్ ఆగినా దాని ప్రభావం వంట నాణ్యత ప్రమాణాలు , ప రిమాణం పై పడుతున్నది. వడ్డీకి తెచ్చి వంటలు చే స్తూ అప్పులపాలవుతున్న ఎం.డి.ఎం.ఎజెన్సీ వారికి కూడా ఉద్యోగులకు జీతాలు ఇచ్చినట్టుగా ఠంచన్ గా ఒకటో తేదీన బిల్లులు ఇవ్వటం వలన మేలు వారికి కలుగవచ్చును. ఎం.డీ.ఎం. రేట్లు పెంచకుంటే మధ్యా హ్నభోజన పథకంలో క్రమంగా నాణ్యతల ఉనికి కో ల్పోతుంది.ఎం.డి.ఎం. మీద ఆధారపడి బడికి వచ్చే నిరుపేద కుటుంబాల దళిత మైనారిటీ , ఆదివాసీ పిల్లలు బడికి దూరమయ్యేందుకు పరోక్షంగా కారణ మవుతుంది. ఎం.డి.ఎం. ను నమ్ముకున్న మహిళా సంఘాలు,ఏజెన్సీలు నష్టపోతాయి. మధ్యాహ్న భోజ న పథకం నిర్వహణ పై క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రధా నోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మహిళా సంఘా ల ప్రతినిధులతో చర్చించాలి. ఆమోదయోగ్యమైన ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి.
– వాడపల్లి అజయ్ బాబు 
సంపాదకులు. 
ఉపాధ్యాయ దర్శిని టి.పి.టి.ఎఫ్. అధికార మాస పత్రిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page