త్యాగానికి రూపాలు
నిలిపిన స్తూపాలు
ఉద్యమానికి ఊపిరిపోసిన సజీవసాక్ష్యాలు
విజయకేతనామై రెపరెపలాడే చరితమరువని బలిదానాలు
కన్నపేగునుసైతం లెక్కచేయాని ఆరనిజ్వాలలు
దూరమై అల్లాడుతున్న తల్లుల కడుపుకోతలు
ఉద్యామాన్ని గుండెనెత్తుకుని
చైతన్యగీతమైన రుధిరం ధారవోసిన త్యాగాలవీరులు
సాధించిన విజయానికి
నిలువెత్తు ఆత్మలశిఖరాలు
ఆ బలిదానాలన్నీ ఏమెరుగని
అట్టడుగు వర్గాలు
ఆ స్తూపాలలో సమిదలు
బహుజన బిడ్డలు
వచ్చిన విజయాన్ని తన్నుకుపోయి
అధికార అందదలాలపైకెక్కి
త్యాగాలకు సమాధులుగట్టి
నివాళులర్పించే నియంతలు
నేటి స్వార్థపు
రాజకీయనాయకులు
వెనకబడిన వర్గాల ఓట్లనుదోచే దోపిడి దొంగలకు
చస్తే నిలువెత్తు విగ్రహాలు
మారాలి మార్పురావాలంతే
వచ్చిన స్వాతంత్య్రం సిగ్గపడుతోంది
ఏంటీ పీడిత తాడిత కులాలకెపుడు స్వాతంత్య్రఫలాలని
బహుజన బిడ్డలందరు
ఐక్యమత్యంతో ఏకమైతేనే
మనువాద ఛాందసవాద
దోపిడికి అడ్డుకట్టని
రాజకీయాధికారమే దానికి అంతిమమని
కానీ! ఉన్నతవర్గాలు
ఏదో ప్రలోభాల మాయలో బహుజనులందరిని బందిస్తున్నా
గ్రహింపులేనితనమేనాయే
బహుజనరాజ్యమే భారతదేశాభివృద్దికి బాటౌతుంది
స్థాపించిన స్తూపాలలోని
ఆత్మలకు శాంతవుతుంది
– సి. శేఖర్(సియస్సార్), పాలమూరు, 9010480557.