న్యూఢిల్లీ, జూన్ 27 : బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 600 మందిపై ఢిల్లీ పోలీసులు కేసు బుక్ చేశారు. శని, ఆదివారాల్లో ఈ కేసులు నమోదు అయ్యాయి. మద్యం మత్తులో జరిగే నేరాలను అరికట్టాలన్న ఉద్దేశంతో పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు.
అయితే ఈ డ్రైవ్‌లో 607 మంది పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నట్లు తేలారు. ఔటర్ డిస్టిక్్రప్రాంతంలో ఉన్న పది పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.