- వడ్లకు బోనస్ అడిగితే మొరుగుతున్నారంటారా
- రైతులు హైదరాబాద్‌కు వొచ్చి ధర్నా చేస్తారు
- కాంగ్రెస్ తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే హరీష్ రావు
- జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిశీలన
జగిత్యాల, ప్రజాతంత్ర, మే 23 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని సిద్దిపేట మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ముఖ్య నేత హరీష్ రావు పేర్కొన్నారు. ధాన్యం విక్రయం కోసం నెలరోజులుగా పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పర్యటించిన ఆయన.. పూడురులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. గత ప్రభుత్వం 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని, ప్రస్తుతం 37 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారని, రైతులంతా హైదరాబాద్‌కు వొచ్చి ఉద్యమం చేస్తామంటున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. వడ్లకు బోనస్ ఏమైందని అడిగితే.. వ్యవసాయ మంత్రి కొందరు మొరుగుతున్నారంటూ రైతులను కుక్కలతో పోలుస్తున్నారని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు బాండ్ పేపర్‌పై రాసిచ్చి.. వడ్లకు బోనస్ ఇస్తామని ఇవాళ సన్నాలకు మాత్రమే ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని అన్నారు. ఆరోజు వ్నిరు రాసిచ్చిన బాండ్ పేపర్‌పై సంతకాలు పెట్టారు కదా..వ్నిరు సంతకాలు పెట్టి.. నమ్మబలికి బాండ్ పేపర్లు ఇచ్చి.. చేతుల్లో పట్టుకుని ఇవాళ వడ్లకు బోనస్ ఏమందంటే చేతులెత్తేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ జగిత్యాల జిల్లాలో రైతులతో, వ్యవసాయశాఖ అధికారులతో మాట్లాడితే జిల్లా పరిధిలో 2.97లక్షల ఎకరాల్లో యాసంగిలో వడ్లు పండితే.. 2.80లక్షల ఎకరాల్లో దొడ్డు వడ్లే ఉన్నయని, మిగితా 17వేల ఎకరాల్లో సన్నాలు సాగు చేశారని, అవి కూడా ఇంటిమందం సన్నాలు తిండిగింజల కోసం సాగు చేశారని, దానికి వ్నిరు బోనస్ ఇచ్చేది ఏందని హరీష్ రావు ప్రశ్నించారు.
లక్ష్మారెడ్డి అనే రైతుతో మాట్లాడితే జగిత్యాలలో జైశ్రీరామ్ అనే సన్నవడ్లకు బయట రూ.2800-రూ.3వేలు కొనుగోలు చేస్తున్నరని, గవర్నమెంట్ ఇచ్చేది ఏందీ..ప్రైవేటులోనే కొనుగోలు చేస్తున్నారని, అందువల్ల రూ.500 కోసం ప్రభుత్వానికి అమ్మనే అమ్మరని, ఇదంతా మోసం ఉన్నది అని రైతు లక్ష్మారెడ్డి చెబుతూ వాపోతున్నరని హరీష్ రావు తెలిపారు. వాస్తవానికి దొడ్డు రకమైతే 25-30 క్వింటాళ్లు పండుతయని, సన్న రకాలైతే 10-15 క్వింటాళ్లు పండుతయని, దాదాపు పది క్వింటాళ్ల వరకు దిగుబడి తక్కువ అని, రోగాలు, పెట్టుబడి, నెలరోజుల కాలం ఎక్కువ అని, అందువల్లే మన ప్రాంతంలో రైతులు పండిరచేది రూపాయికి 90 పైసలు దొడ్డు రకమే ఎక్కువ అని, మరి సన్నాలకు బోనస్ ఇస్తామంటే.. రైతులను మోసం చేయడం, దగా చేయడం.. రైతులను గుండెలపై తన్నడం తప్ప ఇంకోటి కాదని హరీష్ రావు మండిపడ్డారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తమను మోసం చేస్తున్నదని ఈ రైతులే చెబుతున్నరని, అంటే ఇవాళ రైతులను అవమానపరుస్తున్నారని అంటూ నిలదీశారు.
పోరాటానికి సిద్ధంగా ఉన్నామని, తామందరం హైదరాబాద్‌కు వొస్తామని రైతులందరూ ముక్తకంఠంతో చెబుతున్నరన్నారు. రూ.500 బోనస్ ఇవ్వాల్సిందేనని చెబుతున్నరరని, దీనిపై స్పందించాలని అన్నారు. మొన్న లోక్‌సభ ఎన్నికల సమయంలో డబ్బాలో వోటుపడేదాక ఏవ్ని మాట్లాడలేదని, ఇప్పుడు సన్నాలకే బోనస్ ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతూ రైతులను మోసం చేస్తున్నరని దుయ్యబట్టారు. మంత్రులు మేల్కొనాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వొచ్చి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇక వనపర్తిలో భారాస నేత శ్రీధర్ హత్య ఘటనను హరీష్ రావు ఈ సందర్భంగా ఖండిరచారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిన 5 నెలల్లోనే దాడులు పెరిగాయని ఆరోపించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోనే ఇద్దరు భారాస నేతలు హత్యకు గురయ్యారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలను కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టలేదని స్పష్టం చేశారు. భారాస శ్రేణులు ధైర్యం కోల్పోవద్దని, పార్టీ వారికి అండగా ఉంటుందని తెలిపారు.