వ్యాస మహర్షి సంస్కృత భాషలో మహాభారతాన్ని రచించాడు. వ్యాసుడు సత్యవతికి పరశరమహర్షి ద్వారా జన్మించాడు. ఒకే రాసిగా ఉన్న వేదాలనునాలుగు భాగాలుగా విభజించి రూపొందించినవాడుగాన వేదవ్యాసుడైనాడాయన. వేదవ్యాసుడు చెబుతూఉంటే వినాయకుడు భారతం వ్రాశాడు. పద్దెనిమిది పర్వాలుగా మహాభారతాన్ని వ్యాసుడు లక్ష పాతికవేల శ్లోకాలుగా మనకు అందించాడు.
నన్నయ సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు. ఆది సభాపర్వాలనూ అరణ్యపర్వంలో కొంతభాగాన్నీ తెలుగులోకి అనువదించాక కాలం చేసాడు. ఆ తర్వాత తిక్కన విరాటపర్వాన్ని మొదలుపెట్టి, మిగిలిన పదేహేను పర్వాలను తెనిగించాడు. ఇక ఆయన వదిలేసిన వాటినే గాక, తిక్కన సగంలో వదిలేసిన అరణ్యపర్వాన్ని ఆంధ్రీకరించాడు. వీరి ముగ్గురునీ కవిత్రయం అంటారు.
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు తర్వాతి కాలంలో ఎందరో మహాభారతాన్ని పద్య రూపంలో గాకుండా, వచన రూపంలో అందించారు.
‘పాండవోద్యోగ విజయాలు’ పేరిట భారతాన్ని నాటకంగా తిరుపతి వేంకట కవులు రచించి, తెలుగు వారి అభిమానానికి నోచుకున్నారు.ఆ నాటకంలోని సగటు తెలుగువాడి నోట తరచుగా లాస్యం చేస్తూనే ఉంటాయి.
పలు దేశాల్లోని సాహితీపిపాసకులు, భారతం మనిషిభావనలకు చక్కటి భాష్యం అని వర్ణించారు. కొందరు ఈ కథ జరిగిన కథావేశ కాల్పనిక ఇతివృత్తమా అని సందేహాలుకూడా లేవనెత్తారు. ఇక అలాంటి వాటిని దూరంగా ఉంచి వ్యాస మహాభారతాన్ని పరిశీలిస్తే ఎక్కువభాగం మన జీవిత గమనాలను నిర్దేశించుకోవడానికి వీలుపడే అంశాలతో బాటుగా, ధర్మ సూక్ష్మాలెన్నో చెప్పబడినాయి.
భారతంలో ప్రతి వ్రత ధర్మాలు ఉన్నాయి. రాజనీతి యుద్ధనీతి వివరాలున్నాయి. పాలనారీతులు ఎంతో వివరంగా ఉన్నాయి. ముఖ్యంగా మనం భారతంలో విదురనీతినీ, భగవద్గీతనూ పదేపదే చదవాల్సిన అవసరం ఎంతైనావుంది.
మహాభారతం చదివే ముందు, నారాయణుడైన శ్రీ కృష్ణునకూ నరుడైన అర్జునుడికీ, చదువులతల్లి సరస్వతికే, మహాభారతాన్ని అందించిన వ్యాసునకూ నమస్కరించాలి.
మంగళ ప్రదమూ, పాపహారమూ, పరమపవిత్రమూ అయిన మహాభారత కథను బాలల భారతంగా ప్రతి శనివారం చదివి తరించండి.
-డా।। పులివర్తి కృష్ణమూర్తి